Donald-Trump-h1b
అంతర్జాతీయం, లేటెస్ట్ న్యూస్

H1B Exemption: హెచ్‌-1బీ వీసా ఫీజు పెంపు నుంచి వారికి మినహాయింపు.. సుముఖంగా ఉన్న ట్రంప్!

H1B Exemption: విదేశీ నిపుణులకు అత్యంత కీలకమైన హెచ్-1బీ వీసా అప్లికేషన్ ఫీజు పెంపు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనసు మార్చుకున్నారా?, వైద్యరంగంలో కీలకమైన డాక్టర్లకు మినహాయింపు ఇవ్వాలనుకుంటున్నారా?, అంటే ఔననే అంటున్నాయి వైట్‌హౌస్ అత్యున్నత స్థాయి వర్గాలు. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన లక్ష డాలర్ల ఫీజు నుంచి వైద్యులను మినహాయించే (H1B Exemption) అవకాశం ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. వైట్ హౌస్ ప్రతినిధి టేలర్ రాజర్స్ అంతర్జాతీయ మీడియా సంస్థ ‘బ్లూమ్‌బర్గ్‌ న్యూస్‌’కి ఇచ్చిన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేసిన ప్రొక్లమేషన్‌ (ప్రకటన పత్రం) ప్రకారం, వైద్యులకు మినహాయింపు ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఫీజు పెంపు నుంచి మినహాయింపు పొందే అవకాశం ఉన్నవారిలో వైద్యులతో పాటు మెడికల్ రెసిడెంట్లు కూడా ఉండవచ్చని టేలర్ రాజర్స్ అన్నారు.

హెచ్-1బీ వీసా ఫీజు పెంపుపై గతవారం విడుదల చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లో పలు కీలక విషయాలు ఉన్నాయి. అమెరికా జాతీయ ప్రయోజనాల కోసం ఎవరైనా ఓ వ్యక్తిని ఒక కంపెనీ లేదా పరిశ్రమ నియమించుకుంటే అతడి అప్లికేషన్‌పై భారీ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుందని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లో పొందుపరిచారు. హెచ్-1బీ వీసా ఫీజు పెంపు విషయంలో ప్రొక్లమేషన్‌లో ఉన్న నిబంధనలను అనుసరిస్తామని వైట్‌హౌస్ ప్రతినిధి టేలర్ రాజర్స్ వివరించారు.

Read Also- CM Revanth Reddy: సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. నిలువెత్తు బంగారం సమర్పణ

అమెరికా వైద్య రంగంలోని పనిచేస్తున్న ప్రముఖ సంస్థలు గ్రామీణ అమెరికాలో వైద్యుల కొరతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ విధమైన స్పందన వెలువడడం గమనార్హం. ఇప్పటికే గ్రామీణ అమెరికాలో డాక్టర్ల కొరత ఉంది. ఈ పరిస్థితుల్లో విదేశాల నుంచి వచ్చే మెడికల్ గ్రాడ్యుయేట్లపై వీసా ఫీజు పెంపు ప్రభావం పడితే మరిన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయని అక్కడి వైద్య నిపుణులు హెచ్చరించారు. జనాలు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటారని అంటున్నారు.

కాగా, పెంపునకు ముందు హెచ్-1బీ వీసా దరఖాస్తు ఫీజు కేవలం 215 డాలర్లుగా ఉండేది. చిన్నమొత్తంలో మరికొన్ని ఇతర ఫీజులు కూడా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే, అధ్యక్షుడు ట్రంప్ ఫీజును అమాంతం 100,000 డాలర్లకు పెంచుతున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయం ఇప్పటికే అమెరికాలో ఉన్నవారికి వర్తించదని, విదేశాలకు వెళ్లి తిరిగి వచ్చే సమయంలో లక్ష డాలర్ల ఫీజు చెల్లింపు చేయాల్సిన అవసరం ఉందని వైట్‌హౌస్ వర్గాలు పేర్కొన్నారు. ఫీజు పెంపు విధానం ఆదివారం ఉదయం 12:01 గంటల నుంచే అమల్లోకి వచ్చింది.

Read Also- Bengaluru: భార్యపై అనుమానం.. కూతురు చూస్తుండగానే బస్టాప్‌లో చెప్పలేని దారుణానికి ఒడిగట్టిన భర్త

కాగా, హెచ్-1బీ వీసా ద్వారా అమెరికాలోని కంపెనీలు… విదేశీ నిపుణులను, ప్రత్యేకమైన నైపుణ్యాలు ఉన్నవారిని నియమించుకుంటాయి. నిబంధనల ప్రకారం కనీసం బ్యాచిలర్ డిగ్రీ, లేదా దానికి సమానమైన విద్యార్హత ఉన్నవారిని నియమించుకునేందుకు వీలుంటుంది. మొదట మూడేళ్ల కాలపరిమితితో హెచ్-1బీ వీసా ఇస్తారు.అవసరమైతే మరో 3 ఏళ్లు పొడగించుకునే వీలుంటుంది. ఈ వీసాపై ఆధారపడి ప్రస్తుతం అమెరికాలో సుమారుగా 7 లక్షల మంది విదేశీ నిపుణులు పనిచేస్తున్నట్టు అంచనాగా ఉంది. అక్కడ పనిచేసేవారితో పాటు అదనంగా కుటుంబ సభ్యులు (dependents) 5 లక్షల మంది వరకు అమెరికాలో నివసిస్తున్నట్టుగా అంచనాగా ఉంది.

Just In

01

Money Fraud: కాన్ఫరెన్స్‌‌లో అమిత్ షా, అజిత్ దోవల్‌ ఉన్నారంటూ మాట్లాడించి.. బంధువుకు కుచ్చుటోపీ

OG release issue: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమాకు అక్కడ ఎదురుదెబ్బ!.. ఎందుకంటే?

CM Revanth Reddy: కుంభమేళాకు వేల కోట్లు కుమ్మరిస్తున్నారు.. మరి మేడారానికి ఏవి?

Pruthivi Raj – Dulquer: లగ్జరీ కార్ల పన్ను ఎగవేత.. మలయాళం స్టార్స్ ఇళ్లల్లో మెరుపు దాడులు

Hyderabad Floods: దేవరకొండ బస్తీలోనీ ఇండ్లలోకి నీళ్లు.. ముంపు నివారణకు చర్యలు చేపట్టాలని ఆదేశం