CM Revanth Reddy: మేడారం జాతరలో సీఎం పర్యటిస్తున్నారు. సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు లను దర్శించుకున్నారు. సమ్మక్క సారక్క కు నిలువెత్తున బంగారం సమర్పించారు. ఆలయ అభివృద్ధి కి సంబంధించిన పనులను డిజిటల్ ప్లాన్ ద్వారా విడుదల చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తో పాటు మంత్రి సీతక్క(Seethakka), పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivass Reddy), కొండా సురేఖ(Konda Sureka) తల్లులను దర్శించుకున్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా పేరుగాంచిన మేడారం జాతరలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అట్రాక్టివ్ గా మారింది. పూజారులు, ఆలయ పెద్దలు, మంత్రులతో కలిసి అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఆదివాసీల సాంప్రదాయాలకు అనుగుణంగా మేడారంలో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. మహా జాతర వరకు అన్ని రకాల అభివృద్ధి పనులు పూర్తిచేసే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు చేపట్టింది. మేడారం సమ్మక్క సారలమ్మలను సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు.
మేడారం మహోత్సవానికి
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా నిర్వహించే మేడారం మహోత్సవానికి నూతన ఉత్సాహం కలిగించేలా అభివృద్ధి పనులను సీఎం రేవంత్ రెడ్డి చేపట్టనున్నారు. సమ్మక్క సారలమ్మ జాతర వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ.. తరాలకు నిలిచేలా శాశ్వత అభివృద్ధి పనుల శంకుస్థాపనతో పాటు అమ్మవార్ల గద్దెల ప్రాంగణ డిజైన్లను పరిశీలించారు.
Also Read: Bathukamma 2025: గిన్నిస్ రికార్డు లక్ష్యంగా బతుకమ్మ ఉత్సవాలు.. ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు
ఆసియా ఖండంలోని అతిపెద్ద జాతర
ప్రపంచంలో ఆసియా ఖండంలో అతిపెద్ద ఆదివాసి జాతర గా మేడారం జాతర పేరుగాంచింది. తెలంగాణ(Telangana) కుంభమేళ ప్రసిద్ధిగాంచిన మేడారం లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆలయ పూజారులు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి అమ్మవార్లను దర్శించుకున్నారు. సాంప్రదాయ బద్ధంగా చెల్లించే నిలువెత్తు బంగారాన్ని సైతం తల్లులకు సమర్పించారు. మేడారం మహా జాతరకు కనీ, విని ఎరుగని రీతిలో ఎప్పుడూ కూడా ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అభివృద్ధిని సీఎం రేవంత్ రెడ్డి చేపట్టడంతో ఆదివాసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గిరిజన సంప్రదాయాలు, ఆదివాసి సాంప్రదాయాల కనుగుణంగా అభివృద్ధి పనులను శాశ్వత పనులుగా చేపట్టి చరిత్రలో సీఎం రేవంత్ రెడ్డి నిలిచిపోనున్నారు. మేడారం జాతర కోసం ఎప్పుడు ప్రభుత్వాలు తాత్కాలిక పనులను మాత్రమే చేపట్టి మమా.. అనిపించేవి. అయితే అందుకు అలాంటి పనులకు వెళ్లకుండా మేడారం జాతరలు ఎంతోమంది భక్తులు రానున్న నేపథ్యంలో, ఏడాది పొడవునా జాతరకు ప్రజల తాకిడి ఉండడంతో శాశ్వత అభివృద్ధి పనులను చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. అందులో భాగంగానే మంగళవారం మేడారం జాతరలో తల్లులను దర్శించుకున్న అనంతరం శాశ్వత నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.
Also Read: KTR: స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించండి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు