Warangal District (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Warangal District: నేను చేసే ప్రతి పని ప్రజల కోసమే నా లాభం కోసం కాదు: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

Warangal District: హనుమకొండ అంబేద్కర్ భవనంలో సోమవారం ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య(MP Kadiyam Kavya) తో కలిసి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(MLA Nayini Rajender Reddy) తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 135 మంది లబ్ధిదారులకు రూ.1,35,15,600 విలువైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.128 మంది లబ్ధిదారులకు రూ.43,28,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. 262 మందికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలు అందించారు.

అత్యవసర సమయంలో..

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దాదాపు రెండు కోట్ల విలువైన పథకాల లబ్ధి వరంగల్(Warangal) పశ్చిమ ప్రజలకు చేరుకోవడం, కాంగ్రెస్(Congress) ప్రభుత్వమే సాధ్యపడింది. పేదల పెళ్లిళ్ల భారం తగ్గించడానికి కల్యాణలక్ష్మి , షాదీ ముబారక్ పథకాలు ఆశీర్వాదం అవుతున్నాయి. వైద్య అత్యవసర సమయంలో సీఎంఆర్ఎఫ్(CMRF) ప్రాణరక్షకంగా నిలుస్తోంది. సొంత ఇల్లు లేని వారి ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు తో స్వంత గృహం కల నెరవేరుతోంది. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకే నిదర్శనం అని అన్నారు. ప్రతిపక్ష పార్టీలకు ప్రజల సమస్యలు కనబడవు. వారు చేసే పని ఒక్కటే అబద్ధపు ప్రచారం. ప్రజల మనసులో అనుమానాలు కలిగించడం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కష్టతరంగా ఉన్నా, సంక్షేమ పథకాల కోసం ఒక్క రూపాయి కూడా తగ్గించలేదు. కానీ ప్రతిపక్షాలు మాత్రం అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడమే పని చేసుకుంటున్నాయి.

Also Read: Gold Rate Today: గోల్డ్ లవర్స్ కి బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

ఇవే నా లక్ష్యాలు..

20 ఏళ్ల పాలనలో వరంగల్‌ ను వెనుకబాటులోకి నెట్టినవారు నేటి బోధకులు కావడం దురదృష్టకరం అని అన్నారు. నేను చేసే ప్రతి పని ప్రజల కోసం ఎవరి వ్యక్తిగత లాభం కోసం కాదు. ప్రతి పేద కుటుంబం అభివృద్ధి చెందడం, ప్రతి యువకుడికి అవకాశాలు రావడం, ప్రతి మహిళ గౌరవంగా జీవించడం ఇవే నా లక్ష్యాలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు నాయిని లక్ష్మారెడ్డి, బంక సంపత్ యాదవ్, మాజీ కార్పొరేటర్ ఎనుకుంటి నాగరాజు, పలు డివిజన్ అధ్యక్షులు తాళ్లపల్లి సుధాకర్, ఎనుకుంటి పున్నం చందర్, తడుక సుమన్ గౌడ్, బంక సతీష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, లబ్ధిదారులు, అధికారులు, ప్రజలు, పాల్గొన్నారు.

Also Read: OG Benefit Show: మొత్తానికి సాధించారు.. ఏపీలో బెనిఫిట్ షో టైమింగ్ మారింది!

Just In

01

Anupama Parameswaran: అనుపమపై అసభ్యకర పోస్ట్‌లు పెట్టిన వ్యక్తిని పట్టేశారట!

Sreeleela: శ్రీలీల సపోర్ట్‌‌తో.. ప్రియదర్శి, ఆనందిల ‘పెళ్లి షురూ’

Janhvi Kapoor: మళ్లీ అందాలేనా? ఈసారైనా పెర్ఫార్మెన్స్‌తో మెప్పిస్తుందా?

Shiva Re Release: జెన్-జి‌ని మెప్పించే కంటెంట్‌ ‘శివ’లో ఏముంది? ఎందుకు ఈ సినిమా చూడాలి?

Andhra King Taluka: ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సాంగ్ అప్డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?