OG Benefit Show: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) అభిమానులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Govt) శుభవార్త తెలిపింది. సెప్టెంబర్ 25న విడుదల కానున్న ‘ఓజీ’ సినిమా (OG Movie) బెనిఫిట్ షోల సమయాన్ని మారుస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు (జీవో) జారీ చేసింది. మొదట సెప్టెంబర్ 25న తెల్లవారుజామున 1 గంటకు బెనిఫిట్ షో అనుమతి ఇవ్వగా, ఇప్పుడు ఆ సమయాన్ని సెప్టెంబర్ 24 రాత్రి 10 గంటలకు మార్చారు. మొదట ఇచ్చిన జీవోలో ఇది తప్ప మిగతా వాటిలో (టికెట్ ధరలు) ఎటువంటి ఛేంజెస్ ఉండవని ఈ జీవోలో పేర్కొంది. ఈ నిర్ణయంతో పవన్ కళ్యాణ్ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సినిమా విడుదలకు ఒక రోజు ముందుగానే తొలి షో చూడవచ్చని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. థియేటర్ల వద్ద అభిమానుల సందడి అప్పుడే మొదలైంది. చాలామంది అడ్వాన్స్ బుకింగ్‌ల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ జీవో వల్ల తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులందరికీ సినిమా విడుదలకు ముందే పండగ వాతావరణం నెలకొంది.
Also Read- Chiranjeevi: మీరు ఒక చరిత్ర .. చిరు సినీ జర్నీపై పవన్ కళ్యాణ్, బండ్ల గణేష్ ట్వీట్స్ వైరల్!
యుద్ధం ఫలించింది
వాస్తవానికి దీనిపై ఫ్యాన్స్ పెద్ద యుద్ధమే చేశారు. ముందుగా ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచుకునేందుకు, బెనిఫిట్ షో వేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. కానీ తెల్లవారు జామున 1కి అంటే చాలా ఇబ్బందులు ఉంటాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ టైమ్ మార్చాలని, మళ్లీ అనుమతి తీసుకోవాలని నిర్మాణ సంస్థకు రిక్వెస్ట్‌లు పెడుతున్నారు. ఆ వెంటనే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హైక్‌తో వారి పని ఇంకాస్త సులువైంది. తెలంగాణ ప్రభుత్వం టికెట్ల ధరలను పెంచుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూనే, బెనిఫిట్ షోను ఒక రోజు ముందే అంటే, సెప్టెంబర్ 24 రాత్రి 9 గంటలకు షో వేసుకోవచ్చని అనుమతి ఇచ్చింది. అంతే అప్పటి నుంచి, ఏపీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నిర్మాణ సంస్థపై ఒత్తిడి చేయడం మొదలు పెట్టారు. నిజమే.. పక్క రాష్ట్రం వాళ్లు ఒక రోజు ముందే సినిమా చూసేస్తుంటే.. మనం మాత్రం తెల్లవారు జాము వరకు వేచి ఉండాలా? అని వారు గట్టిగా ప్రయత్నాలు మొదలెట్టారు.
Also Read- OG Censor Details: ‘ఓజీ’ సెన్సార్ పూర్తి.. తొలగించిన సన్నివేశాలివే..
మొత్తానికి ఫ్యాన్స్ సాధించారు
ఎట్టకేలకు నిర్మాణ సంస్థ మళ్లీ ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించడంతో జీవో మార్చి, బెనిఫిట్ షో టైమింగ్ ఛేంజ్ చేసి, కొత్త జీవోని విడుదల చేశారు. మొత్తానికి ఫ్యాన్స్ అనుకున్నది సాధించారు. ఈ నిర్ణయం చిత్ర బృందానికి కూడా పెద్ద ఊరట కలిగించింది. సెప్టెంబర్ 24న రాత్రి నుంచే బెనిఫిట్ షోలు ప్రదర్శించడం వల్ల సినిమాకు తొలి రోజే భారీ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ‘ఓజీ’ సినిమాపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో, ఈ ముందస్తు విడుదల వసూళ్లను మరింత పెంచుతుందని అంచనా వేస్తున్నారు. మొత్తంగా, ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ‘ఓజీ’ సినిమా బాక్సాఫీస్ ప్రయాణానికి గొప్ప ప్రారంభాన్ని అందిస్తుందని, అభిమానులకు మర్చిపోలేని అనుభూతిని ఇస్తుందని చెప్పవచ్చు. బెనిఫిట్ షోల కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున టికెట్లు అమ్ముడవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అభిమానుల ఆనందం, సినిమాపై ఉన్న అంచనాలు సినిమా విజయాన్ని ముందే సూచిస్తున్నాయి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు