Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటుడిగా జర్నీ ప్రారంభించి 47 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్‌గా రియాక్ట్ అయ్యారు. ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో మెగాస్టార్ అరంగేట్రం చేశారు. ఆయన తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’ (Praanam Khareedhu) విడుదలై నేటికి (22 సెప్టెంబర్) 47 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఎమోషనల్‌గా స్పందించారు. ‘‘22 సెప్టెంబర్ 1978.. ‘కొణిదెల శివ శంకర వరప్రసాద్’ అనబడే నేను ‘ప్రాణం ఖరీదు’ అనే చిత్రం ద్వారా ‘చిరంజీవి’గా మీకు పరిచయమై.. నేటితో 47 ఏళ్లు దిగ్విజయంగా పూర్తయ్యాయి. ఈ చిత్రం ద్వారా నాకు నటుడిగా ప్రాణం పోసి, మీ అన్నయ్యగా, కొడుకుగా, మీ కుటుంబ సభ్యుడిగా, ఒక మెగాస్టార్‌గా.. అనుక్షణం నన్ను ఆదరించి, అభిమానించిన తెలుగు సినిమా ప్రేక్షకులకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటాను. నేటికి 155 సినిమాలను పూర్తి చేసుకున్నాను అంటే… అందుకు కారణం నిస్వార్ధమైన మీ ‘ప్రేమ’. ఈ 47 ఏళ్ళలో నేను పొందిన ఎన్నో అవార్డులు, గౌరవమర్యాదలు నావి కావు, మీ అందరివీ, మీరందించినవి. మనందరి మధ్య ఈ ప్రేమానుబంధం ఎల్లప్పటికీ ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటున్నాను’’ అని చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
Also Read- Manchu Manoj: అయోధ్య రాములవారిని దర్శించుకుని క్షమాపణలు చెప్పిన బ్లాక్ స్వార్డ్.. విషయమిదే!
ఎప్పటికీ రిటైర్ అవ్వరు
మెగాస్టార్ చేసిన ఈ పోస్ట్‌కు అభిమానులు, సెలబ్రిటీలందరూ ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తాజాగా పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ‘‘పెద్దన్నయ్య ‘ప్రాణం ఖరీదు’ సినిమాలో హీరోగా నటించిన క్షణం నాకు ఇంకా బాగా గుర్తుంది. అప్పుడు మేము నెల్లూరులో ఉన్నాం, నేనప్పుడు స్కూల్‌కు వెళ్లేవాడిని. కనకమహల్ థియేటర్‌కి వెళ్లాం, ఆ రోజు నాకెంతో ఆనందం వేసింది, అది మాటల్లో చెప్పలేను. 47 ఏళ్ల సినీ ప్రయాణంలో, ఆయన అంచలంచెలుగా ఎలా ఎదిగారో చూస్తే నిజంగా స్ఫూర్తి కలుగుతుంది. ఇన్ని విజయాలు సాధించినా.. ఆయనలో ఉన్న నిరాడంబరత, సహాయం చేసే గుణం మాత్రం ఎప్పుడూ తగ్గలేదు. దుర్గా మాత ఆయన్ని దీర్ఘాయుష్షుతో, ఆరోగ్యంతో, సంపదతో ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. భవిష్యత్తులో ఆయన మరెన్నో విలక్షణ పాత్రల్లో నటించాలని ఆశిస్తున్నాను. ఆయన స్వతహాగా రిటైర్మెంట్ ప్రకటించనంతవరకు, దానికి అవసరం లేదు. ఆయన వ్యక్తిత్వం తెలిసిన నాకు, ఆయన ఎప్పటికీ రిటైర్ అవ్వరు. పుట్టుకతోనే యోధుడైన మా పెద్దన్నయ్య, ముద్దుగా అందరూ శంకర్ బాబు అని పిలుచుకునే మెగాస్టార్ చిరంజీవి’’ అని పవన్ కళ్యాణ్ చేసిన పోస్ట్‌ని నెటిజన్లు లైక్స్, షేర్స్‌తో వైరల్ చేస్తున్నారు.
I still vividly remember when ‘Peddha Annaya’ acted as the hero in the film ‘Praanam Khareedhu’. We were in Nellore at that time, and I was still in school. We went to Kanakamahal Theater, and the elation I felt that day is beyond words.
In his 47 year film journey, it is truly… https://t.co/tClLlUMMaA pic.twitter.com/TSUTMJZwVo
— Pawan Kalyan (@PawanKalyan) September 22, 2025
Also Read- Adhira Movie: ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో ‘అధీర’.. ఫస్ట్ లుక్ అదిరింది
మీ పేరు శాశ్వతం
మరో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) చేసిన పోస్ట్ కూడా వైరల్ అవుతోంది. బండ్ల గణేష్ తన పోస్ట్‌లో ‘‘మీరు ఒక చరిత్ర. చరిత్రను చదివే భావితరాలకు మీరే ప్రేరణగా నిలుస్తారు. మీ పేరు శాశ్వతం, మీ జీవితం ఆదర్శం. జై చిరంజీవ. అన్నయ్యకు శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు. బండ్ల గణేష్ పోస్ట్ కూడా వైరల్ అవుతోంది. ఇలా ఇంకా ఎంతో మంది సెలబ్రిటీలు చిరంజీవి పోస్ట్‌కు రియాక్ట్ అవుతున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు