GHMC: జీహెచ్ఎంసీ(GHMC) చేపట్టనున్న అభివృద్ది పనులు, పౌర సేవల నిర్వహణతో పాటు పరిపాలనపరమైన నిర్ణయాల్లో ముఖ్య పాత్ర పోషించే స్టాండింగ్ కమిటీ సమావేశం మరోసారి వాయిదా పడింది. ముందుగా జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం మంగళవారం జరగాల్సిన ఈ సమావేశం బుధవారానికి వాయిదా పడినట్లు సమాచారం. ఈ నెల 24న జరగనున్న ఈ కమిటీ సమావేశంలో అధికారులు పలు కీలకమైన, ముఖ్యమైన ప్రతిపాదనలు కమిటీకి సమర్పించనున్నారు. వీటిలో జీహెచ్ఎంసీ(GHMC)లోని 145 మంది కార్పొరేటర్ల మెడికల్ ఇన్స్యూరెన్స్(Medical Insurence) పొడిగించే ప్రతిపాదన కమిటీ ముందుకు రానుంది.
కీలకమైన ప్రతిపాదనలు..
ఒక్కో కార్పొరేటర్, వారి ఇద్దరు పిల్లలు, తల్లి దండ్రులు లేక అత్తా మామలతో కలిసి మొత్తం ఒక్కో కుటుంబానికి రూ. 23 వేల 129 వార్షిక ప్రీమియం చెల్లించేందుకు వీలుగా మొత్తం రూ. 33 లక్షల 53 వేల 705 చెల్లించేందుకు అనుమతి కోరుతూ ప్రతిపాదన కమిటీ ముందుకు రానుంది. దీంతో పాటు హైడ్రా(Hydraa)కు సంబంధించిన పలు కీలకమైన ప్రతిపాదనలు కూడా స్టాండింగ్ కమిటీ(Standing Comity) ముందుకు రానున్నట్లు తెలిసింది. ముఖ్యంగా వర్షాకాలం సీజన్ కు సంబంధించి ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు మూడు నెలల పాటు విధులు నిర్వర్తించిన అయిదు క్యాటగిరీలకు నెలకు రూ.35 లక్షల 11 వేల 950 చొప్పున మొత్తం రూ. కోటి 5 లక్షల 35 వేల 850 హైడ్రాకు చెల్లించాలన్న ప్రతిపాదనను కమిటీ పరిశీలించిన నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
Also Read: Beauty movie success meet: ‘బ్యూటీ’ అందరి మనసులకు హత్తుకునే చిత్రం.. ఎందుకంటే?
సిగ్నల్ రహిత ప్రయాణం..
దీంతో పాటు మాన్సూన్ సీజన్ లో వానాకాలం సహాయక చర్యల కోసం హైడ్రా(Hydraa) ఏర్పాటు చేసిన మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్(Monsoon Emergency Team) లు, వినియోగించిన మిషనరీ ఖర్చులుగా రూ. 20 కోట్లు హైడ్రాకు చెల్లించే ప్రతిపాదన కూడా కమిటీ ముందుకు రానుంది. సిటీలో సిగ్నల్ రహిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు సర్కారు ప్రతిపాదించిన హెచ్ సిటీ ప్రాజెక్టు పనుల్లో భాగంగా ఆర్కే పురం లో ఆర్వోబీ, ఆర్ యూబీ నిర్మాణం కోసం 52 ఆస్తుల నుంచి స్థల సేకరణ ప్రతిపాదన కూడా కమిటీ పరిశీలించి, నిర్ణయం తీసుకోనుంది.
Also Read: Chiranjeevi: మీరు ఒక చరిత్ర .. చిరు సినీ జర్నీపై పవన్ కళ్యాణ్, బండ్ల గణేష్ ట్వీట్స్ వైరల్!