Gadwal District: విజిట్ వీసాల పేరిట నమ్మించాడు.. తీరా అక్కడ!
Gadwal District (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Gadwal District: విజిట్ వీసాల పేరిట నమ్మించాడు.. తీరా అక్కడికి వెళ్ళాక అలా చేసాడు!

Gadwal District: సొంతూరులో ఉపాధి కరువై ఇజ్రాయిల్ లాంటి దేశాలకు వలస వెళ్తున్న పలువురు నకిలీ ఏజెంట్ల చేతుల్లో మోసపోతూనే ఉన్నారు. అమాయకుల అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్న ఏజెంట్లు డబ్బుల సంపాదనే లక్ష్యంగా విజిట్‌ వీసా(Visit visa)లు కట్టబెడుతున్నారు. డబ్బులు సంపాదించుకొని ఆర్థికంగా స్థిరపడదామని ఆశతో వెళ్తున్న పలువురు మోసపోయి అప్పుల కుప్పల్లో చిక్కుకుపోతున్నారు. మోసపోయామని తెలుసుకొని ఎలాగోలా స్వదేశానికి వచ్చిన వారికి ఏజెంట్లు డబ్బులు తిరిగివ్వడం లేదు. ఇలా అక్కడికి పోలేక.. ఇక్కడ ఉన్న పని కోల్పోయి అప్పులపాలవుతున్నారు.

విజిట్ వీసా పేరుతో..

బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్(AP) కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలానికి చెందిన బాలక్రిష్ణ, ప్రసాద్(Prasad), చిట్టిబాబు(Chitti babu), ప్రభుదాస్(Prabudas), భారతీ(Bharathi), సునీల్(Sunil), రత్నకుమారి(Rathnakumare), బేబి కిషోర్, విజయ్ మోహన్, పద్మతో పాటు మరికొందరు ఇజ్రాయిల్ లో ఉద్యోగాల కోసం జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం ఓ చర్చి ఫాస్టర్ కె.సుదర్శన్ అలియాస్ అబ్రహంను సంప్రదించారు. విజిట్ వీసా పేరుతో ఇజ్రయిల్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి ఒక్కొక్కరి నుంచి రూ.8 లక్షల నుంచి 15 లక్షల వరకు వసూలు చేశాడు. జూన్ 9‌, 2024 సంవత్సరంలో కోనసీమ జిల్లాలకు చెందిన మొత్తం 42 మందిని టూరిస్ట్ వీసా పేరుమీద ఇజ్రాయిల్ కు తీసుకెళ్లాడు. అక్కడ కొన్ని ప్రదేశాలు చూసిన తర్వాత అక్కడే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పాడు.

Also Read: Idli Kottu Trailer: వారసత్వాన్ని వదిలి వలసెళ్లిపోయాడు.. ఎక్కడికెళ్తాడు, ఎగిరెగిరి ఇక్కడికే రావాలి

బాధితులకు కొంత నగదు..

కొంత కాలం తర్వాత ఆ దేశం అధికారులు టూరిస్ట్ వీసా మీద వెళ్లిన వారిని తిరిగి భారత్ కు పంపడంతో.. వీసా ఖర్చులు, టికెట్ ఖర్చులు పోగ మిగిలిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఏజెంట్ కె.సుదర్శన్ పై ఒత్తిడి తేగ, అందుకు తగ్గటు బాధితులకు చెక్కులు అందజేశాడు. బ్యాంకులో డబ్బులు లేకపోవడంతో బాధితులు నిలదీయగా ఈ‌రోజు రేపు కాలయాపన చేశాడు. కొందరి బాధితులకు కొంత నగదు ఇవ్వడం జరిగిందని, మాకూడా డబ్బులు ఇవ్వాలని‌ ఏజెంట్ పై ఒత్తిడి తేగ ఎవరికైన చెప్పుకోండి. నేను ఇచ్చేది లేదంటూ బాధితులపై బెదిరింపులకు పాల్పడటంతో బాధితులు వారం రోజుల నుంచి ధరూర్ మండల కేంద్రంలోని చర్చిలో ఉంటున్నారు. పాస్టర్ ముసుగులో ఇక్కడ సైతంనేటికి ఏజెంట్ అబ్రహం డబ్బులు ఇవ్వకపోవడంతో జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక రోడ్లపై తిరుగుతున్నామని, ఇప్పటికైన న్యాయం చేసి తమ డబ్బులు తమకు చెల్లించాలని బాధితులు కోరారు.

Also Read: School Controversy: పండుగ రోజు స్కూల్ లో పిల్లలకు బలవంతపు పాఠాలు.. ఎక్కడంటే..?

Just In

01

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం