Pawan Kalyan ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Pawan Kalyan: ప్రకృతితో చెలగటాలు ఆడొద్దు అంటున్న నెటిజన్స్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన నటించిన ఓజీ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం సెప్టెంబర్ 25 న రిలీజ్ కు రెడీ అవుతుంది. అయితే, ఈ చిత్రానికి సంబంధించిన ‘ఓజీ’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 21, 2025న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ జరిగే సమయంలో భారీ వర్షం కురిసినప్పటికీ, వేలాది మంది అభిమానులు హాజరై స్టేడియంను కేరింతలతో నింపారు.

Also Read: Ind Vs Pak: భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాక్ టీమ్‌తో జత కలిసిన అనూహ్య వ్యక్తి.. నవ్వుకుంటున్న ఇండియన్స్

ఇక పవన్ కళ్యాణ్ అయితే.. కత్తితో స్టైలిష్ ఎంట్రీ ఇచ్చి, బ్లాక్ అండ్ బ్లాక్ లుక్‌లో అదరగొట్టారు. ఈవెంట్‌లో మూవీ ట్రైలర్ విడుదలై, అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ గ్యాంగ్‌స్టర్ థ్రిల్లర్‌లో ఇమ్రాన్ హష్మీ విలన్‌గా, ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా పని చేసిన తమన్ లైవ్ పెర్ఫార్మెన్స్‌తో ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించారు. పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో, సినిమా కోసం సుజిత్, తమన్ బృందం కష్టపడిన తీరును ప్రశంసించారు.

Also Read: Telangana Anganwadi: అంగన్వాడీలను ప్రభుత్వం రెగ్యులర్ చేయాలి.. 1వ తేదీన అంగన్వాడీలకు వేతనాలు చెల్లించాలి

ఆయన ‘వాషి యో వాషి’ పాటను లైవ్‌లో పాడటం ఈవెంట్‌కు హైలైట్‌గా నిలిచింది. అయితే, ఈవెంట్ జరుగుతున్నమధ్యలో వర్షం పడుతుంటే ఆ వర్షంలో వర్షం మనల్ని ఆపుద్దా అని స్టేజ్ ముందుకు నడుచుకుంటూ ముందుకు వెళ్ళాడు. అయితే, ఇప్పుడు దీనిపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ప్రకృతి తో చెలగాటం ఏంటి పవన్ కళ్యాణ్ గారు వర్షం మనల్ని ఆపుద్దా అని పరుగులు పెడుతున్నారు. ఓ వైపు వర్షం మనల్ని ఆపుద్దా అని అంటావ్.. ఇంకో వైపు మళ్లీ గొడుగు కావాలంటావ్ .. దేశ చరిత్రలోనే మీ పేరు నిలిచిపోతుంది. ట్రైలర్ ఈవెంట్ పెట్టి ఊగిపోతున్నావ్ అంటూ నెటిజన్స్ పవన్ మీద ఫైర్ అవుతున్నారు.

Also Read: Telangana Anganwadi: అంగన్వాడీలను ప్రభుత్వం రెగ్యులర్ చేయాలి.. 1వ తేదీన అంగన్వాడీలకు వేతనాలు చెల్లించాలి

Just In

01

Mahabubabad District: ప్రభుత్వ అధికారుల బహిరంగ వాగ్వాదం.. బతుకమ్మ వేడుకల్లో ఉద్రిక్తత

MLC Kavitha: తెలంగాణ సాధించిన చంద్రునికి కొందరు మచ్చ తెచ్చారు: ఎమ్మెల్సీ కవిత

Gold Rate Today: గోల్డ్ లవర్స్ కి బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

School Controversy: పండుగ రోజు స్కూల్ లో పిల్లలకు బలవంతపు పాఠాలు.. ఎక్కడంటే..?

Pawan Kalyan: ప్రకృతితో చెలగటాలు ఆడొద్దు అంటున్న నెటిజన్స్