Vasavi Group (imagecredit:twitter)
హైదరాబాద్

Vasavi Group: ఓ పక్క ఐటీ దాడులు.. హైడ్రా భయంతో వాసవి గ్రూప్ ఉక్కిరిబిక్కిరి!

Vasavi Group: భారీ నిర్మాణ సంస్థ ‘వాసవి’కి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే ఐటీ అధికారుల దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సంస్థ యజమానులను తాజాగా హైడ్రా భయం వెంటాడుతోంది. బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు ఆ పార్టీకి చెందిన కీలక నేతల అండదండలతో చెరువులు.. నాలాలు కబ్జా చేసి నిర్మించిన నిర్మాణాలపై ఏ క్షణంలోనైనా హైడ్రా(Hydraa) పంజా విసరనున్న నేపథ్యంలో దీని నుంచి బయట పడటానికి సంస్థ నిర్వాహకులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.

ఐటీ దాడులు..

వాసవి కన్ స్ట్రక్షన్స్(Vasavi Constructions), వాసవి గ్రూప్ ఆఫ్ వెంచర్స్(Vasavi Group of Ventures) పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు తాజాగా దాడులు చేసిన విషయం తెలిసిందే. వందల కోట్ల వ్యాపారం చేస్తూ భారీగా పన్ను ఎగ్గొట్టారన్న సమాచారంతో 40కి పైగా అధికార బృందాలు ఏకకాలంలో ఇరవై ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. వాసవి గ్రూప్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ తోపాటు డైరెక్టర్ల ఇళ్లపై కూడా దాడులు చేశారు. సంస్థ ప్రధాన కార్యాలయం, అనుబంధ ఆఫీసుల్లో సోదాలు చేశారు. ఈ క్రమంలో ఐటీ అధికారులు పలు కీలక డాక్యుమెంట్లను సీజ్ చేశారు. వాసవి గ్రూప్ సంస్థకు వస్తున్న ఆదాయం.. ప్రభుత్వానికి చెల్లిస్తున్న ఆదాయపు పన్న మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్టు గుర్తించి ఇప్పటికే కేసలు నమోదు చేశారు.

వెంటాడుతున్న హైడ్రా భయం..

మరో వైపు వాసవి గ్రూప్ ను హైడ్రా భయం వెంటాడుతోంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నిజాంపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న బాచుపల్లిలో సంస్థ వాసవి అర్భన్ పేర భారీ ప్రాజెక్టును నిర్మిస్తోంది. అయితే, కోమటి కుంట చెరువు ఎఫ్ట్ఎల్ బఫర్ జోన్​ లో వాసవి అర్భన్ పేర భారీ టవర్లను నిర్మించింది. దీనిపై విచారణ జరిపిన ఇరిగేషన్ శాఖ అధికారులు గతంలోనే హెచ్​ఎండీఏకు నివేదిక కూడా ఇచ్చారు. మొత్తం 8 ఎకరాల్లో 23 అంతస్తులతో 12 టవర్లను నిర్మిస్తున్న వాసవి గ్రూప్ దీంట్లోని 8, 9 టవర్లను కోమటి కుంట చెరువు బఫర్ జోన్ లో నిర్మించింది. దీనిపై సర్వే చేసిన ఇరిగేషన్​ అధికారులు బఫర్ జోన్ ఆక్రమణ జరిగినట్టుగా నిర్ధారించారు కూడా.

హైడ్రాకు ఫిర్యాదులు..

బఫర్​ జోన్ ఆక్రమణలపై పలువురు హైడ్రాకు ఫిర్యాదులు చేశారు. దాంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు మరోసారి ఇరిగేషన్​ అధికారులతో కలిసి జాయింట్ సర్వే చేశారు. దీంట్లో కూడా వాసవి గ్రూప్ కోమటి కుంట చెరువు బఫర్ జోన్ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేసినట్టుగా నిర్ధారణ అయ్యింది. అయితే, హైడ్రా(Hydraa) అధికారులు ఇప్పటివరకు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

హైకోర్టుకు..

ఇటువంటి పరిస్థితుల్లోనే కోమటి కుంట చెరువు బఫర్ జోన్​ ఆక్రమణలపై ఆకుల సతీష్​ అనే వ్యక్తి హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్)​ దాఖలు చేశారు. దీనిని న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఇటువంటి పరిస్థితుల్లో ఏం మతలబు జరిగిందోగాని హెచ్ఎండీఏ వాసవి కన్ స్ట్రక్షన్స్ కు అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చింది. దీనిపై ఆకుల సతీష్ మరోసారి హైకోర్టులో రిట్ పిటిషన వేశారు. దీనిపై వాదనలు వినిపించిన న్యాయవాది కంబలపల్లి శ్రావణ్​ కుమార్ రెడ్డి వాసవి కన్ స్ట్రక్షన్స్ చేసిన చెరువుల ఆక్రమణలపై జరిపిన జాయింట్ సర్వే రిపోర్దు ఆధారంగా చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు. ఈ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు మూడు నెలలలోపు వాసవి కన్ స్ట్రక్షన్స్ ఆక్రమణలకు సంబంధించి పిటిషనర్ వద్ద ఉన్న డాక్యుమెంట్లను పరిశీలించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read: Phone Tapping Case: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి?

ఆకుల సతీష్​ తగు చర్యలు

దాంతోపాటు హైడ్రా ఆధ్వర్యంలో ఇరిగేషన్(Irrigation), రెవెన్యూ(Revenue), హెచ్​ఎండీఏ(HMDA) అధికారులు మరోసారి రీ సర్వే చేసి చెరువుల్లో ఆక్రమ నిర్మాణాలు ఉన్నట్టు తేలితే కూల్చి వేయాలని ఆదేశాలు ఇచ్చింది. చెరువులను రక్షించాల్పిందేనని స్పష్టంగా పేర్కొంది. హైకోర్టు ఇచ్చిన ఈ ఉత్తర్వులతోపాటు కోమటి కుంట చెరువు బఫర్ జోన్ ఆక్రమణలకు సంబంధించిన అన్ని ఆధారాలతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఫిర్యాదు చేసిన ఆకుల సతీష్​ తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే రీ సర్వే జరిపి అక్రమంగా నిర్మించిన 8, 9 బ్లాకులను కూల్చి వేయాలని కోరారు. కబ్జా జరిగినట్టు అన్ని ఆధారాలు ఉండటం…3 నెలల గడువు విధిస్తూ హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యంలో ఏ క్షణంలోనైనా హైడ్రా కోమటి కుంట బఫర్ జోన్ లో నిర్మించిన నిర్మాణాలపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సరిగ్గా ఈ పరిణామమే వాసవి గ్రూప్ యజమానుల గుండెల్లో దడ పుట్టిస్తోంది.

వెంటాడుతున్న నాలా కబ్జా ఆరోపణలు..

ఇక, కూకట్​ పల్లిలో వాసవి సరోవర్ ప్రాజెక్ట్ పేర నిర్మించిన నిర్మాణాలపై కూడా ఆరోపణలు బలంగా ఉన్నాయి. దీంట్లో నాలా కబ్జా చేశారని స్థానికులు చెబుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చెరువుల పరిరక్షణ, సుందరీకరణ కోసమంటూ పలు చెరువులను దత్తతకు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మైసమ్మ చెరువు, కాముని చెరువులను దత్తత తీసుకున్న వాసవి గ్రూప్ దాని పేర రెండు చెరువుల నాలాలను కబ్జా చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. మైసమ్మ చెరువు…కాముని చెరువు మధ్య వాసవి సరోవర్ పేరుతో 21 ఎకరాల్లో 11 బ్లాక్స్ గా జీ ప్లస్ 29 అంతస్తుల నిర్మాణాలు చేపట్టింది. అయితే, దీని కోసం చెరువుల స్థలాలతోపాటు నాలాను కబ్జా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. నిజానికి నిర్మాణాల కోసం హెచ్ఎండీఏ అనుమతులు తీసుకున్న సమయంలో 17 మీటర్ల నాలా నిర్మిస్తామి వాసవి గ్రూప్​ పేర్కొంది. అయితే, నాలా నిర్మాణం చేయకపోగా నాలాలోనే పిల్లర్లు వేసి నిర్మాణాలు చేపట్టింది. చెరువు స్థలంలో మట్టి పోసి నిర్మాణాలు ప్రారంభించింది. దీనిపై స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు కూడా చేశారు. ఇక, నాలా కబ్జాపై ఇరిగేషన్ అధికారులు చేసిన ఫిర్యాదుపై కూకట్ పల్లి పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. దీనిపై కూడా హైడ్రా ఏ క్షణంలోనైనా చర్యలు తీ

కొనుగోలుదారుల నుంచి..

ఇక, వాసవి గ్రూప్ పై కొంతకాలం క్రితం కొనుగోలుదారులు కూడా తిరగబడ్డారు. డబ్బు మొత్తం చెల్లించినా ప్లాట్లను అప్పగించక పోవటంతో వందలాది మంది కొనుగోలుదారులు బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లోని ఆ సంస్థ కార్పోరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయంలోకి చొచ్చుకుపోయి ఆందోళన జరిపారు. తమ ఫ్లాట్లను ఎప్పటిలోగా అప్పగిస్తారో తేల్చి చెప్పాలంటూ బైఠాయించారు. హఫీజ్ పేటలో వాసవి లేక్ సిటీ ప్రాజెక్ట్ పేర సంస్థ నిర్మాణాలు చేపట్టగా 2020లో ఫ్లాట్లను బుక్ చేసుకున్న వందలాది మంది 90శాతం డబ్బు కూడా చెల్లించారు 2024 నాటికి ప్రాజెక్ట్ పూర్తి చేసి డబ్బు చెల్లించిన వారికి ఫ్లాట్లు అప్పగించాల్సి ఉన్నా వాసవి గ్రూప్ ఇప్పటికీ నిర్మణాలను పూర్తి చేయలేదు. ఈ నేపథ్యంలోనే కొనుగోలుదారులు ఆందోళనకు దిగారు. ఇక్కడ గమనించాల్సిన మరో అంశం ఏమిటంటే ఉప్పల్​ లో వాసవి మెట్రో పొలిస్ ప్రాజెక్టులో ఫ్లాట్లు కొనటానికి డబ్బు చెల్లించిన వారు కూడా నిరసనలో పాల్గొనటం. చెప్పిన సమయానికి తమకు ఫ్లాట్లను ఎందుకు అప్పగించ లేదని నిలదీయటం. ఇలా జరుగుతున్న వరుస పరిణామాలతో వాసవి గ్రూప్ యాజమాన్యం ఉక్కిరిబిక్కిరవుతోంది. గత ప్రభుత్వ హయాంలో కీలక నేతల అండతో ఆడింది ఆటగా పాడింది పాటగా వ్యవహరించింది.

Also Read: Bigg Boss Telugu 9: వారికి రంగు పడింది.. బిగ్ బాస్ మాములు ట్విస్ట్ కాదిది!

Just In

01

Mahabubabad District: బతుకమ్మ ఆడుతూ.. గుండెపోటుతో హిళ మృతి.. ఎక్కడంటే..?

KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై లైంగిక వేధింపుల కేసు నమొదు

Pawan Kalyan: తెలంగాణలో ఈవెంట్ పెట్టి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు చెప్పలేదు.. పవన్ ని ఏకిపారేస్తున్న నెటిజన్స్

Mahabubabad District: ప్రభుత్వ అధికారుల బహిరంగ వాగ్వాదం.. బతుకమ్మ వేడుకల్లో ఉద్రిక్తత

MLC Kavitha: తెలంగాణ సాధించిన చంద్రునికి కొందరు మచ్చ తెచ్చారు: ఎమ్మెల్సీ కవిత