Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) సంచలన మలుపు తిరగనుంది. రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించిన ఈ కేసును సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం (Telangana Governmen) నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకున్నట్టు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 2003లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping Case) వ్యవహారం వెలుగు చూసిన విషయం తెలిసిందే. వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలన్న లక్ష్యంతోనే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని నడిపించిందన్న ఆరోపణలు బలంగా వినిపించాయి.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన ఆధారాలను నాశనం
ఈ క్రమంలో ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) పై సిట్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు జరిపిన సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) వ్యవహారానికి సంబంధించిన ఆధారాలను నాశనం చేసిన ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును అందరికన్నా ముందుగా అరెస్ట్ చేశారు. విచారణలో వెల్లడైన వివరాల మేరకు వరుసగా టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను కూడా కటకటాల వెనక్కి పంపించారు. వీళ్లు వెల్లడించిన వివరాల ఆధారంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్ఐబీ ఛీఫ్ గా పని చేసిన ప్రభాకర్ రావును కేసులో ప్రధాన నిందితునిగా చేర్చారు. ఆయనతోపాటు ఓ ఛానల్ యజమాని శ్రవణ్ రావును కూడా నిందితుల జాబితాలో చేర్చారు. కాగా, కేసులు నమోదు కాగానే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులు విదేశాలకు పారిపోయారు. దాంతో వారిని వెనక్కి రప్పించటానికి ఓ దశలో సిట్ అధికారులు రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేయించారు. కాగా, సుప్రీం కోర్టు మధ్యంతర రక్షణ కల్పించటంతో ఈ ఇద్దరు తిరిగి వచ్చి సిట్ విచారణకు హాజరయ్యారు.
Also Read: Bobby Kolli: అనుదీప్ చేసిన పనికి షాక్ అయిన బాబి కొల్లి.. అందుకే అలా చేశాడు
సంచలన వివరాలు…
ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) కేసులోని నిందితులను విచారించినపుడు సంచలన వివరాలు వెలుగు చూశాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి, అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తోపాటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు అగ్ర నాయకులు, కొంతమంది జడ్జిలు, పారిశ్రామిక వేత్తలు, బడా వ్యాపారులు మొత్తం 618మంది ఫోన్లను ప్రణీత్ రావు అండ్ టీం ట్యాప్ చేసినట్టుగా వెల్లడైంది. వీరిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేయటం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ లోని కీలక నేతలు పోటీ చేసిన సెగ్మెంట్లలో వార్ రూంలు ఏర్పాటు చేసి మరీ ఫోన్ ట్యాపింగులు చేసినట్టుగా దర్యాప్తులో బయట పడింది.
ఈ కేసులో అరెస్టయిన నిందితులు ఇప్పటివరకు ఈ వ్యవహారంలో అసలు సూత్రధారులు ఎవరన్న దానిపై నోరు తెరవ లేదు. ఎస్ఐబీ మాజీ ఛీఫ్ ప్రభాకర్ రావును సిట్ పదిసార్లు కార్యాలయానికి పిలిపించి సుధీర్ఘంగా ప్రశ్నించింది. అయితే, ప్రతీసారి తాను ఏం చేశానో పై అధికారులు అందరికీ తెలుసని మాత్రమే ప్రభాకర్ రావు చెబుతూ వచ్చాడు. తప్పితే ఎవరి సూచనల మేరకు ఫోన్లు ట్యాపింగ్ చేయించారన్నది మాత్రం వెల్లడించ లేదు. ప్రభాకర్ రావును అరెస్ట్ చేయవద్దంటూ సుప్రీం కోర్టు మధ్యంతర రక్షణ కల్పించిన నేపథ్యంలో సిట్ అధికారులు ఆయనను అరెస్ట్ చేయలేక పోయారు. సరిగ్గా ఇదే రక్షణతో ఫోన్ ట్యాపింగ్ లో కీలకంగా వ్యవహరించిన శ్రవణ్ రావు కూడా ఎలాంటి కీలక వివరాలు వెల్లడించ లేదు.
విమర్శలకు చెక్ పెట్టటానికి…
కాగా, ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) కేసులో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా లేదన్న విమర్శలు ఇటీవలిగా ఎక్కువయ్యాయి. ముఖ్యంగా బీజేపీ నాయకులు కేసులో దర్యాప్తు తీరు చూస్తుంటే బీఆర్ఎస్…కాంగ్రెస్ పార్టీలు నువ్వు కొట్టినట్టు చెయ్యి….నేను ఏడ్చినట్టు చేస్తా అన్నట్టుగా ఉందంటూ పలు సందర్భాల్లో వ్యాఖ్యలు చేశారు. సీబీఐకి అప్పగిస్తే నెలల వ్యవధిలోనే ఫోన్ ట్యాపింగ్ లో అసలు సూత్రధారులు ఎవరన్నది బయటకు తీయిస్తామని ప్రకటనలు చేశారు.
సీబీఐకి అప్పగించాలని నిర్ణయం
రాష్ట్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాల కేసును సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా సీబీఐకి అప్పగిస్తే బాల్ ను బీజేపీ కోర్టులోకి పంపించినట్టుగా అవుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. సీబీఐకి ఇవ్వండి…అసలు దోషులు ఎవరు? అన్నది తేలుస్తామన్న బీజేపీ కేంద్ర మంత్రులు కేసును అప్పగించిన తరువాత ఎలా స్పందిస్తారన్నది చూడాలని ప్రభుత్వ భావనగా కనిపిస్తోంది. చెప్పినట్టుగా చర్యలు తీసుకోకపోతే బీజేపీ ఇరకాటంలో పడుతుందని అనుకుంటున్నట్టు సమాచారం. అలా కాకుండా అసలు సూత్రధారులు ఎవరన్నది సీబీఐ తేలిస్తే బీఆర్ఎస్ శరాఘాతం అవుతుందని భావిస్తున్నట్టు తెలియవచ్చింది. ఈ రెండింటిలో ఏ పరిణామం జరిగినా అది కాంగ్రెస్ పార్టీకే కలిసి వస్తుందన్న భావన ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది.
Also Read: Vijay Deverakonda: ఎవరి సలహాలు వినాల్సిన పనిలేదు.. బండ్లకు కౌంటర్! ఇదెలా మిస్సయ్యారు?