Harish Rao: పల్లెటూర్లలో కేసీఆర్(KCR) సీఎంగా ఉన్నప్పుడు మిషన్ కాకతీయలో చెరువులు బాగా చేసి బతుకమ్మ మెట్లు కట్టించాడు.. బతుకమ్మ ఘాట్లు కట్టించాడు.. పండుగను అద్భుతంగా జరిపించుకోవడానికి ఫ్లడ్లైట్లు, రోడ్లు, సౌకర్యాలు ఏర్పాటు చేసేవారని, కానీ ఈరోజు బతుకమ్మకి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఒక రూపాయి ఇవ్వలేదని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు(Harish rao) ఆరోపించారు. సికింద్రాబాద్ రాంగోపాల్ పేట డివిజన్ లోని కస్తూర్బానగర్ లో మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Thalasani Srinivas Yadhav) ఆధ్వర్యంలో వరద ముంపుకు గురైన 1500 కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసే కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొని బాధితుల సమస్యలను తెలుసుకున్నారు.
నాలాల్లో కొట్టుకుపోయి..
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రీ మాన్ సూన్(Free Mon Soon) ముందు నాలాలన్నీ క్లీన్ చేయాలి.. గతంలో కేసీఆర్(KCR) నాయకత్వంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ , కేటీఆర్ హైదరాబాద్ నగరంలో నాలాలన్నీ క్లీన్ చేయించేవారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటూ నాలాలు క్లీన్ చేయకపోవడం వల్ల నాళాల నుండి వరద రోడ్లపై పారుతుందని మండిపడ్డారు. ఒక రూపాయి సహాయం కూడా వరద బాధితులకు చేయలేదని మండిపడ్డారు. హైదరాబాద్ నగరంలో 7 , 8 మంది నాలాల్లో కొట్టుకుపోయి చనిపోయారని, దానికి కారణం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం అని దుయ్యబట్టారు. రోడ్లు గుంతల మాయమైపోయాయని,వాటిని పూడ్చే తెలివి లేదు గాని ఫోర్త్ సిటీ గురించి మాట్లాడుతున్నాడన్నారు.
Also Read: Hydraa: శ్రీరాంనగర్ ముంపు సమస్యకు హైడ్రా పరిష్కారం
మాటలకు ఎక్కువ చేతులకు తక్కువ
పోర్త్ సిటీ కాంట్రాక్టర్ల కోసం ఆరాటం చేస్తున్నాడని మండిపడ్డారు. కండువా కప్పినంత మాత్రాన పార్టీ మారినట్టు కాదని రేవంత్ రెడ్డి మాట్లాడం హాస్యాస్పదం అన్నారు. పదిమందిని పార్టీలో చేర్చుకున్నామని పీసీసీ మహేష్ కుమార్ గౌడ్(PCC Mahesh Kumar Goud) ప్రకటించారన్నారు. లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదన్నారు. పండుగ పూట చెత్త ఎత్తడానికి, ట్రాక్టర్లో డీజిల్ పోయడానికి లేదని, మాటలకు ఎక్కువ చేతులకు తక్కువ ఇది రేవంత్ పాలన అని పేర్కొన్నారు. ఈ పండుగ పూటైనా గ్రామపంచాయతీలకు నిధులు విడుదల చేసి అతిపెద్ద పండుగైన బతుకమ్మ పండుగను జరుపుకునేటట్టు చేయాలని కోరారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో గ్రామాలు మురికి కూపాలుగా మారాయన్నారు. వరదల్లో మునిగిపోయిన పంట పొలాలకు నష్టపరిహారం, పేదలకు నిత్యవసర వస్తువులను అందించాలని డిమాండ్ చేశారు.
Also Read: Viral News: అసభ్యకర వీడియోలు చూస్తూ డ్రైవింగ్.. చివరికి ఏం జరిగిందంటే