Mulugu District: తక్కువ ఖర్చుతో సేంద్రియ యూరియా
Mulugu District (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Mulugu District: తక్కువ ఖర్చుతో సేంద్రియ యూరియా.. ఇలా చేయండి..?

Mulugu District: రైతు చౌకగా, స్వంతగా, తక్కువ ఖర్చుతో సేంద్రీయ యూరియా ఇతర నత్రజని ఆదారిత సేంద్రీయ ఎరువుల తయారూ చేసుకునే విధంగా రైతులు సేంద్రీయ పద్ధతులను పాటించాలని ములుగు జిల్లా మైక్రోబయాలజిస్ట్స్, ఆచార్య జీవన్ చంద్ర(Acharya Jeevan Chandra) తెలిపారు. దేశ వ్యాప్తంగా యూరియా కొరతకు మొదటి కారణం మన దేశీయ ఉత్పత్తి సరిపోవడం లేదు. అదే విధంగా యూరియానీ రసాయనిక హాబర్ భాషర్ పద్ధతిలో తయారు చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. దాని వల్ల లాభం రాదు.. సరికదా ఎన్నో రెట్ల నష్టం కలుగుతుంది. పర్యావరణానికి కూడా నష్టం కలుగుతుంది. ఆర్దికంగా సుస్థిర మైన, చౌకైన పద్ధతి కాదు. ప్రకృతిలో ఎన్నో విలువైన నత్రజని ఆదారిత ఎరువుల తయారీ విధానాలు ఉన్నాయి. ఇవి బయోలాజికల్(Biological) అంటే జీవ వైవిధ్యం ఆధారిత పద్ధతులు. ప్రకృతిలో ఉన్న సూక్ష్మ జీవులు భూమిలో బయో- జియో- కెమికల్ చర్యల ద్వారా నత్రజనిని స్థాపిసాయి. అలాగే వృక్ష జంతు సంబంధ వ్యర్థాలలో నత్రజని ఉంటుంది. వీటిని కూడా ఉపయోగించ వచ్చు.

రైతు తన స్వంత పొలం, కొట్టం, స్థలంలో యూరియా తయారీ పద్ధతులు ఏమిటో వాటి గురించి తెలుసుకుందా

పశు మూత్రం సేకరణ వినియోగం

1.పశువుల కొట్టాలలో మూత్రం సేకరణ గుంతలు లేదా ట్యాంకులు ఏర్పాటు చేసైకోలి. వీటిలోకి చేరిన మూత్రం, నీటితో కలిపి ప్రతి రోజు ఒక స్థిరమైన నిల్వచేసి, వాడుకోవాలి.

2.అడుగున ఆకుల ముక్కలు, వ్యర్థ పొట్టు, మొదలైనవి ఒక లేయర్, లేయర్ గా పెట్టి, మద్యలో పశువు మూత్రాన్ని చల్లి, కొన్ని రోజులు వేచిచూడాలి. ఇది మొత్తం నైట్రోజెన్ నిల్వచేయడంలో దోహదపడుతుంది.

3.అవసరమైతే, పశువు కొట్టాల అడుగు భాగంలో జిప్సం లేదా సూపర్‌ఫాస్ఫేట్ తరహా రసాయన పదార్థాలను చల్లి, మూత్రం తో తడిన మిశ్రమన్నీ ఒక గుంటలో కానీ, ఒక పెద్ద డబ్బులోకి తీసుకొని ఉపయోగించవచ్చు. ఈ పద్ధతి నైట్రోజెన్(Nitrogen) ను ఎక్కువగా నిల్వ చేస్తుంది.

Also Read: Narayana College: నారాయణ కాలేజీలో దారుణం.. విద్యార్థి దవడ ఎముక విరిగేలా కొట్టిన ఇన్​ ఛార్జ్

కంపోస్టింగ్ పద్ధతి ద్వారా యూరియా తయారీ

పశువుల పేడ, మట్టి, మూత్రం చెత్త, మొదలైనవి 11.5 మీటర్లు లోతైన, 1.52 మీటర్లు వెడల్పైన, 67 మీటర్లు పొడవైన మందు గుంతలో వేసి, లేయర్ బై లేయర్ తయారు చేయాలి. ప్రతి రోజు వచ్చిన కొత్త చెత్తను పాత పదార్థంతో మిళితం చేసి 4560 సె.మీ.మందం తో ఏర్పాటు చేయాలి. పై భాగాన్ని పశువు పేడ, మట్టి బురద మిశ్రమంతో పైనవేయాలి. ఇది నాలుగుఐదు నెలల్లో పూర్తిగా కంపోస్టింగ్ అయ్యి యూరియా పదార్థంగా మారుతుంది. దీన్ని కొన్ని దఫాలు వాడుకోవచ్చు.

తక్కువ ఖర్చు టెక్నాలజీ పద్ధతులు

ఎలెక్ట్రోలైట్ పద్ధతి

పశు మూత్రంకి గ్రాఫైట్ ఎలక్ట్రోడ్, సౌర శక్తి ద్వారా యూరియా తయారుచేయడాన్ని పరీక్షించవచ్చు. ఇది ప్రాథమిక స్థాయి ఉద్యానంలో తక్కువ ఖర్చుతో సాధ్యపడుతుంది.

ఆవిరి పద్ధతి

మూత్రాన్ని వేరుగా, సూర్య రశ్మి లేదా తక్కువ వేడి తో ఆవిరి చేసి, కూలింగ్ చేసి, ద్రవాన్ని వడకట్టి యూరియా సారం పొందవచ్చు.

పర్యావరణ రక్షణ

సేకరణ గుంతలు గణనీయంగా తడిగా ఉండేలా నిబంధనలు పాటించాలి. కంపోస్టింగ్ పూర్తిగా అయిన తర్వాతనే పదార్థాన్ని పొలంలో వాడాలి. విద్యుత్ పద్ధతులు వాడితే, పిల్లలు, పశువులను దూరంగా వుంచాలి. ఈ విధానం ద్వారా రైతులు చవకగా, సుస్థిరంగా చేయొచ్చు అని తెలిపారు.

Also Read: Kalvakuntla Kavitha: మళ్లీ ఓపెన్ అయిన కవిత.. కేసీఆర్, హరీశ్ రావుపై షాకింగ్ కామెంట్స్!

Just In

01

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక మలుపు.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుల విచారణకు రంగం సిద్ధం!

Mahabubabad District: బినామీ రైతుల పేర్లతో వరి దందా.. అధికారుల మౌనమే అక్రమాలకు కారణమా?

Sigma Telugu Teaser: దళపతి విజయ్ తనయుడి ‘సిగ్మా’ టీజర్ ఎలా ఉందంటే..

Etela Rajender: హుజురాబాద్ ప్రజల నమ్మకాన్ని నిలబెడతా : ఈటెల రాజేందర్!

Sivaji: ‘సారీ’ చెప్పిన శివాజీ.. కాంట్రవర్సీ ముగిసినట్లేనా?