Actress Samantha Reacted To The Pushpa Item Song
Cinema

Actress Samantha: ఆ సాంగే నాకు టర్నింగ్‌ పాయింట్‌

Actress Samantha Reacted To The Pushpa Item Song: నటి సమంత టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి కుర్రకారుకి కునుకు లేకుండా చేసింది. ఎందుకంటే మొదట్లో తమిళంలో కొన్ని చిత్రాల్లో నటించినా అంతగా ఐడెంటీటీ రాలేదు. కానీ, టాలీవుడ్‌లో నటించిన ఏమాయ చేసావే మూవీతో కుర్రకారు మదిలో లవర్‌గా నిలిచిపోయింది. ఈ మూవీ అంతలా సక్సెస్‌ అయింది. ఈ మూవీ ఆమె సినీ కెరీర్‌నే మార్చేసింది. ఆ తరువాత టాలీవుడ్‌లో స్టార్‌ హీరోలతో చేసే ఛాన్స్‌లు క్యూ కట్టడంతో స్టార్‌ హీరోయిన్‌ రేంజ్‌కి చేరుకుంది. ఆ తరువాత తమిళంలో విజయ్, సూర్య, విశాల్‌ వంటి స్టార్‌ హీరోల సరసన నటించే ఛాన్స్‌లు వరించాయి. ఇక తమిళం, తెలుగు భాషల్లో క్రేజీ హీరోయిన్‌గా రాణిస్తున్న టైంలోనే టాలీవుడ్‌ యంగ్ స్టార్‌ నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ మ్యారేజ్ లైఫ్ ఎక్కువ టైమ్‌ సాగలేదు. అభిప్రాయభేదాల కారణంగా విడిపోయారు.

ఇదిలా ఉంటే సమంత ఐటమ్‌ సాంగ్‌ చేసిన బ్లాక్‌బస్టర్‌ మూవీ పుష్ప. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ , నటి రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ మూవీ 2022లో రిలీజై సంచలన విజయం సాధించింది. ఆ విజయంలో సమంత ఐటమ్ సాంగ్ చేసిన ఊ అంటావా మామ పాటకు బాగా క్రేజ్ ఉంది. ఆ సాంగ్‌లో సమంత హాట్‌ నటన యువతను గిలిగింతలు పెట్టించింది. ఆ పాటకు డ్యాన్స్‌ చేయడానికి సమంతకు ఏకంగా రూ. 5 కోట్లు పారితోషికం ఇచ్చినట్లు జోరుగా ప్రచారం సాగింది. అయితే ఈ సాంగ్‌ గురించి సమంత సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ సాంగ్‌లో యాక్ట్ చేయవద్దని తన ఫ్యామిలీ,ఫ్రెండ్స్ చెప్పారని సమంత ఇటీవల పేర్కొన్నారు.

ఆ సాంగ్‌ చేసే టైంలో తాను విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నానని, అలాంటి టైంలో పుష్ప మూవీలో ఐటమ్‌ సాంగ్‌లో నటించవద్దని తెలిపారని, అయితే తాను వారి మాటలను పట్టించుకోకుండా ఆ సాంగ్‌లో యాక్ట్ చేశానని పేర్కొన్నారు. అయితే ఆ సాంగ్‌ పెద్ద టర్నింగ్‌గా మారిందని అన్నారు. నిజం చెప్పాలంటే ఆ ఛాన్స్‌ని కాదనడానికి తన వద్ద సరైన రీజన్ లేదన్నారు. అలాంటప్పుడు ఎందుకు దాన్ని నిరాకరించాలి, తానే తప్పు చేయలేదని అన్నారు.

Just In

01

Nude Gang: నగ్నంగా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు