Hydra ( image CREDIT: SWETCHA REPORTER)
రంగారెడ్డి

Hydra: కాలువను పున‌రుద్ధ‌రించిన హైడ్రా.. వరద ముప్పు తొలగడంతో స్థానికుల హర్షం

Hydra: మేడ్చ‌ల్ (Medchal) – మ‌ల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండ‌లంలోని కౌకూరు ప్రాంతంలో వ‌ర‌ద ముప్పు త‌ప్ప‌డంతో స్థానికులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. కౌకూరు కుంట – నాగిరెడ్డి కుంట‌ల మ‌ధ్య అనుసంధాన కాలువ‌ను హైడ్రా (Hydra) పున‌రుద్ధ‌రించి ఈ స‌మ‌స్య‌కు శాశ్వత ప‌రిష్కారాన్ని సమకూర్చింది. రెండు కుంట‌ల‌ను క‌లుపుతూ ఉండే కాలువ‌కు అడ్డంగా ప్ర‌హ‌రీ నిర్మించార‌ని ప్రజావాణిలో వ‌చ్చిన ఫిర్యాదు మేర‌కు సంబంధిత అధికారుల‌తో హైడ్రా (Hydra) క్షేత్ర స్థాయిలో విచారించింది. కాలువ‌కు అడ్డంగా గోడ‌ను నిర్మించార‌ని విషయాన్ని చుకున్న వెంట‌నే హైడ్రా కూల్చివేత‌లు చేప‌ట్టింది.

 Also Read: Harish Rao: అడ్డగోలుగా ఆర్టీసీ బస్సు ఛార్జీలు.. మాజీ మంత్రి ఫైర్!

గ్రామంలోని ప‌లు నివాసాల‌కు వ‌ర‌ద ముప్పు

అంతే గాక, దాదాపు 25 మీట‌ర్ల మేర కాలువ‌ను హైడ్రా పున‌రుద్ధ‌రించింది. దీంతో కౌకూరుకుంట నీటితో పాటు ప‌రిస‌ర ప్రాంతాల నుంచి వ‌చ్చే వ‌ర‌ద నీరు సాఫీగా ప్రవహిస్తూ నాగిరెడ్డి కుంట‌కు చేరుతుంది. రెండు కుంట మ‌ధ్య‌న ఉన్న ఫార్చ్యూన్ ట‌వ‌ర్స్‌తో పాటు కౌకూరు గ్రామంలోని ప‌లు నివాసాల‌కు వ‌ర‌ద ముప్పు త‌ప్పిందని స్థానికులు వ్యాఖ్యానించారు. ఇటీవ‌ల వ‌ర్షాలు కురిసినా నీరు నిల‌వ‌లేద‌ని స్థానికులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వానికి, హైడ్రాకు అనుకూలంగా నినాదాలు చేశారు. హైడ్రా లాంగ్ లివ్ అంటూ ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించి మ‌ద్ధ‌తు తెలిపారు. రెండు కుంట‌ల‌ను క‌లుపుతూ సాగే వ‌ర‌ద నీటి కాలువ‌కు అడ్డంగా నిర్మించిన ప్ర‌హ‌రీని హైడ్రా తొల‌గించ‌డంతో ఈ ముప్పు త‌ప్పింద‌ని స్థానికులు తెలిపారు.

 Also Read: Viral Video: కొరియన్ అమ్మాయిలతో.. పులిహోర కలిపిన దిల్లీ అబ్బాయి.. ఇంత కరువులో ఉన్నావేంట్రా!

బొల్లారంలో విషాదం.. రైలు ఢీకొని ఇద్దరు యువకుల దుర్మరణం

బొల్లారం బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు దాటుతున్న క్రమంలో శనివారం ఉదయం ముగ్గురు యువకులను రైలు ఢీకొట్టింది.బొల్లారం బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో తెల్లవారుజామున ఈ ధారుణ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.కాగా ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందగా మరొకరికి గాయాలు అయ్యాయి.మృతులు కార్ఖానా,మచ్చ బొల్లారం నిసులుగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ ముగ్గురు కూడా స్నేహితులేనని,ఉదయాన్నే రైలు పట్టాలు దాటుతుండగా ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.యువకుల మృతితో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.మృతులు కార్ఖానకు చెందిన కార్తీక్(19),వెస్ట్ మారేడు పల్లికి చెందిన మల్లికార్జున్ (20)లు అని,మృతి చెందిన ఈ ఇద్దరు కూలీలుగా పని చేస్తున్నారని,అదేవిదంగా బొల్లారంలో ఫిషర్ మెన్ గా వృత్తి నిర్వహిస్తున్న శివానంద్ (35)తీవ్ర గాయాల పాలయ్యాడని రైల్వే పోలీసులు తెలిపారు.

 Also Read: Kalvakuntla Kavitha: మళ్లీ ఓపెన్ అయిన కవిత.. కేసీఆర్, హరీశ్ రావుపై షాకింగ్ కామెంట్స్!

 

Just In

01

Huzurabad District: సింగాపూర్‌లో అక్రమ మొరం తవ్వకాలు.. పట్టించుకోని అధికారులు

Vasavi Group: ఓ పక్క ఐటీ దాడులు.. హైడ్రా భయంతో వాసవి గ్రూప్ ఉక్కిరిబిక్కిరి!

BJP Telangana: బీజేపీలో రగులుతున్న అంతర్గత కుమ్ములాట.. మళ్లీ మొదలైన పాత కొత్త నేతల లొల్లి

Army Veterans: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సర్కారు ఆసుపత్రుల్లో ఆర్మీ జవాన్లు

Bathukamma 2025: గిన్నిస్ రికార్డు లక్ష్యంగా బతుకమ్మ ఉత్సవాలు.. ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు