YS Sharmila (Image Source: Twitter)
ఆంధ్రప్రదేశ్

YS Sharmila: బెన్‌ఫిట్ టికెట్లపై ఉన్న శ్రద్ధ.. రైతుల గిట్టుబాటు ధరపై లేదు.. పవన్‌పై షర్మిల ఫైర్!

YS Sharmila: రాష్ట్రంలో బెన్ ఫిట్ షోలకు రూ.1000 పెంచుకోవడంలో పెట్టిన శ్రద్ధ.. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడంలో లేకపోవడం బాధాకరమని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. గిట్టుబాటు ధర లేక ఉల్లి రైతులు పడుతున్న బాధలను ప్రస్తావిస్తూ కూటమి ప్రభుత్వంపై ఆమె మండిపడ్డారు. ఉల్లి రైతుల ఉసురు ముఖ్యమంత్రి చంద్రబాబుకు తగులుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

క్వింటాకు 50 రూపాయలా?
ఉల్లి రైతుల సమస్యల గురించి ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎక్స్ లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ‘ఉల్లి ఎండినా నష్టమే.. ఇప్పుడు పండినా నష్టమే. ఎకరాకు రూ.1.20లక్షల పెట్టుబడి పోసి పండిస్తే.. మీరిచ్చే ధర కిలోకి 50 పైసలా ? క్వింటాకు 50 రూపాయలా? ఆరుగాలం కష్టించి ఉల్లి పండిస్తే రైతుకి దక్కిన ఆదాయం ఎకరాకు రూ.3వేలు మాత్రమే. ఉల్లి వేసిన కారణంగా ఒక్కో రైతుకి వచ్చిన నష్టం ఎకరాకు అక్షరాల రూ.లక్షా 15 వేలు. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారే. అలాంటి ఉల్లి పండించే రైతే ఉరేసుకొనే పరిస్థితి వస్తే మీరేం చేస్తున్నారు?’ అంటూ కూటమి ప్రభుత్వాన్ని షర్మిల నిలదీశారు.

‘ఇదేనా.. మీ రైతు సంక్షేమం’
కూటమి ప్రభుత్వం చెప్పుకుంటున్న రైతు సంక్షేమం అంటే రైతులను అప్పుల పాలు చేయడమా? అని షర్మిల ప్రశ్నించారు. ‘ఉల్లి రైతు కన్నీళ్లు పెడుతుంటే రాష్ట్రం సుభిక్షంగా ఎలా ఉంటుంది? ధర లేక బేజారు అవుతుంటే ఉల్లి రైతు కళ్ళల్లో ఆనందం ఎక్కడుంటుంది ? కర్నూల్ మార్కెట్ లో దళారుల ధరతో సంబంధం లేకుండా క్వింటాకు రూ.1200 ఇస్తాం అన్నారు. రైతులను ఉద్ధరించినట్లు గొప్పలు చెప్పారు. ప్రచార ఆర్భాటాలు చేసుకున్నారు. ఒక్క రైతుకైనా రూ.1200 గిట్టుబాటు ధర ఇచ్చారా? ఒక్క కిలో అయినా మార్క్ ఫెడ్ సేకరించిందా ? 50 పైసలకు అమ్ముకోలేక మార్కెట్ లోనే ఉల్లిని వదిలేస్తుంటే, కూలి ఖర్చుల మందం కూడా రాలేదని బోరున విలపిస్తుంటే ఎక్కడుంది రైతు కళ్ళల్లో ఆనందం?’ అని షర్మిల ప్రశ్నించారు.

టికెట్ ధరల పెంపుపై..
రాష్ట్రంలో బెనిఫిట్ షోలకు టిక్కెట్ ధర వెయ్యికి పెంచేందుకు పెట్టిన శ్రద్ధ.. రైతుకు గిట్టుబాటు ధర కల్పించడంపై లేకపోవడం విచాకరమని షర్మిల విమర్శించారు. ‘రైతు పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఉల్లి ధరాఘాతంపై ప్రభుత్వం తక్షణం స్పందించాలి. అసెంబ్లీలో ప్రభుత్వ డబ్బా కొట్టడం కాదు. ఉల్లి రైతుల కష్టాల మీద చర్చ చేపట్టండి. మార్క్ ఫెడ్ ద్వారా ఇస్తామని చెప్పిన రూ.1200 వెంటనే అందేలా చూడండి. కర్నూల్ మార్కెట్ లో దళారుల మాయాజాలన్ని వెంటనే అరికట్టండి’ అంటూ ఎక్స్ వేదికగా షర్మిల డిమాండ్ చేశారు.

Also Read: CM Revanth Reddy: తెలంగాణలో ఒక ట్రంప్ ఉండేవాడు.. ప్రజలు పక్కన పెట్టేశారు.. సీఎం రేవంత్

ఓజీపై ఏపీ ప్రభుత్వం ప్రకటన..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా టికెట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘ఓజీ’ సినిమా విడుదల రోజున, అంటే సెప్టెంబర్ 25న, రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 1 గంటకు బెనిఫిట్ షో ప్రదర్శించుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఈ షో టికెట్ ధరను రూ. 1000కి మించకుండా నిర్ణయించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. సినిమా విడుదలైన తొలి 10 రోజుల పాటు టికెట్ల ధరలను పెంచుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరను రూ. 125 వరకు, మల్టీ‌ఫ్లెక్స్ థియేటర్లలో రూ. 150 వరకు పెంచుకోవచ్చని జీవోలో తెలిపింది. ఈ నిర్ణయం ‘ఓజీ’ సినిమాకు భారీగా వసూళ్లను సాధించడంలో ఎంతగానో తోడ్పడుతుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Also Read: Post Office vs Bank: పోస్టాఫీస్ వర్సెస్ బ్యాంక్.. మీ డబ్బును ఎందులో డిపాజిట్ చేస్తే బెటర్!

Just In

01

Harish Rao: లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టే ధైర్యం ప్రభుత్వానికి లేదా: హరీష్ రావు

Ramachandra Rao: ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం.. అలైన్ మెంట్ మార్చాలంటూ రైతులు డిమాండ్!

H-City Project: ముందుకు సాగని హెచ్ సిటీ పనులు.. ఎందుకో తెలుసా..!

Pawan Kalyan thanks: వారికి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్.. ప్రత్యేకించి అభిమానులకు అయితే..

OG Concert: ‘ఓజీ’ సినిమాలో హీరో తాను కాదంటూ బాంబ్ పేల్చిన పవన్.. ఇంతకూ వారు ఎవరంటే?