bandla ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Bandla Ganesh: ఈ మాఫియా నిన్ను బతకనివ్వదు.. లిటిల్ హార్ట్స్ హీరోకి సినిమా పాఠాలు నేర్పిస్తున్న బండ్ల గణేష్?

Bandla Ganesh: హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన ‘లిటిల్ హార్ట్స్’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్ సినీ లవర్స్ ను ఆకర్షించింది. కేవలం రెండున్నర కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి, 50 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ చిన్న మూవీ, పెద్ద సినిమాలకు సవాల్ విసిరింది. ఈ ఈవెంట్‌కు అల్లు అరవింద్, విజయ్ దేవరకొండ, బండ్ల గణేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అయితే, బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. బండ్ల గణేష్ తనదైన శైలిలో మాట్లాడుతూ, “ఈ రోజుల్లో పెద్ద సినిమాలే హిట్టవుతాయని అంతా అనుకుంటున్న ఈ తరుణంలో, ‘లిటిల్ హార్ట్స్’ లాంటి చిన్న బడ్జెట్ చిత్రం ఇండస్ట్రీకి కళ్లు తెరిపించింది. కథ బాగుంటే, కంటెంట్ బలంగా ఉంటే, ప్రేక్షకులు థియేటర్లకు తండోపతండాలుగా వస్తారని ఈ చిత్రం నిరూపించింది,” అన్నారు.

Also Read: Vemsoor Tahsildar Office: భూ రికార్డులు, రైతు బంధులో అక్రమాలు.. వేంసూర్ తహసిల్దార్ కార్యాలయంలో మరో బాగోతం

ఇండస్ట్రీలో మాఫియా వ్యవస్థలపై బండ్ల గణేష్ ఫైర్

“ఇండస్ట్రీలో కొంతమంది మాఫియా గుండాల్లాంటి వ్యవస్థలు చిన్న సినిమాలను అణచివేస్తాయి. కొందరు జన్మతః ప్రివిలేజ్‌లతో ఉంటారు—ఒకరు స్టార్ కమెడియన్ కొడుకైతే, మరొకరు మెగాస్టార్ బావమరిది. వీళ్లకి లైఫ్ సులభం. కానీ మిగతావాళ్లం కష్టపడి, చెమటోడ్చి ముందుకొచ్చాం. అదే అసలైన సినీ ప్రయాణం,” అని బండ్ల గణేష్ తన ఆవేదనను వ్యక్తం చేశారు.

Also Read: Vemsoor Tahsildar Office: భూ రికార్డులు, రైతు బంధులో అక్రమాలు.. వేంసూర్ తహసిల్దార్ కార్యాలయంలో మరో బాగోతం

మౌళి తనూజ్ పై బండ్ల గణేష్ ఎమోషనల్ కామెంట్స్

సినిమాలో హీరోగా నటించిన మౌళి తనూజ్ గురించి మాట్లాడుతూ.. “‘లిటిల్ హార్ట్స్’ కేవలం సినిమా మాత్రమే కాదు, నా జీవితంలోని తండ్రి-కొడుకు బంధాన్ని గుర్తు చేసింది. ఈ సినిమాలోని ఎమోషన్స్ అందరినీ టచ్ చేస్తాయి. ఏడెనిమిదేళ్ల తర్వాత నాకు ఈ సినిమా కిక్ ఇచ్చింది. సినిమా చూసిన వెంటనే ఈ ఈవెంట్‌కు రావాలనిపించింది,” అని ఉద్వేగంగా చెప్పారు. “ఈ విజయంతో గర్వపడొద్దు, నీటిలో తేలే కలలాంటిది ఈ సక్సెస్. నీ నిజ జీవితాన్ని అలాగే కొనసాగించు,” అని టీమ్‌కు సలహా ఇచ్చారు.

Also Read: Huzurabad Crime News: గర్భిణి హత్య కేసు.. 24 గంటల్లో ఛేదించిన పోలీసులు.. సంచలన నిజాలు వెలుగులోకి?

Just In

01

Ram Mohan Naidu: 52 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో కేంద్రమంత్రి రామ్మోహన్ భేటీ.. ఎందుకంటే?

Rana Daggubati: కాలాన్ని రీ క్రియేట్ చేయగలిగేది ఒక్క సినిమా మాత్రమే!

Rukmini Vasanth: ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటి వరకు ఇలాంటి చిత్రం రాలేదు.. ‘టాక్సిక్’పై రుక్మిణి వసంత్!

Allu Arjun: జక్కన్న, నీల్, వంగా.. బన్నీ లైనప్ చూస్తుంటే మెంటలొచ్చేస్తుంది! ఇక తగ్గే దే లే..

JubileeHills bypoll: జూబ్లీహిల్స్‌లో పవన్ చరిష్మా పనిచేస్తుందా?