Ram Charan APL
ఎంటర్‌టైన్మెంట్

Ram Charan: ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా.. గ్లోబల్ స్టార్!

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు మరో గౌరవం దక్కింది. భారత్‌లో తొలిసారి జరగబోతున్న ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌ (Archery Premier League- APL)కు గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌ (Global Star Ram Charan)ను బ్రాండ్‌ అంబాసిడర్‌ (Brand Ambassador)గా నియమిస్తున్నట్లుగా.. జాతీయ ఆర్చరీ అసోసియేషన్‌ (ఏఏఐ) గురువారం అధికారిక ప్రకటనను విడుదల చేసింది. న్యూఢిల్లీలోని యుమున స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ వేదికగా… అక్టోబర్‌ 2 నుంచి 12వ తేదీ వరకు అరంగేట్రం ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌ జరుగనుంది. ఫ్రాంచైజీ ఆధారిత లీగ్‌గా జరగబోతున్న ఈ టోర్నీ.. ఆతిథ్య భారత్‌లోని పురుష, మహిళా కాంపౌండ్‌, రికర్వ్‌ ఆర్చర్లతో పాటు వివిధ దేశాల ఆర్చర్లను ఒక చోటుకు చేర్చనుంది. దేశీయ ఆర్చరీకి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంతో పాటుగా.. భారత ఒలింపిక్‌ మూమెంట్‌ను మరింత ముందుకు తీసుకుపోయే ఉద్దేశంతోనే ఈ లీగ్‌‌ను ఏర్పాటు చేసినట్లుగా నిర్వాహకులు పేర్నొన్నారు.

Also Read- Mahavatar Narsimha OTT: ఇంకొన్ని గంటల్లోనే ఓటీటీలోకి ‘మహావతార్ నరసింహ’.. ఈ సడెన్ ట్విస్ట్ ఏంటి?

ఆర్చరీని మరో స్థాయిని తీసుకెళ్లేందుకు

లీగ్‌లో మొత్తం ఆరు ఫ్రాంచైజీలు ఉండగా.. 36 మంది భారత టాప్‌ ఆర్చర్లతో సహా 12 మంది అంతర్జాతీయ ఆర్చర్లు పోటీపడనున్నారు. లైట్ల వెలుతురులో గతంలో ఎన్నడూ లేని విధంగా.. డైనమిక్‌ ఫార్మాట్‌‌లో ఆర్చర్లు రికర్వ్‌, కాంపౌండ్‌ విభాగాల్లో పోటీపడనున్నారని నిర్వాహకులు తెలియజేశారు. ఈ సందర్భంగా జాతీయ ఆర్చరీ అసోసియేషన్‌ అధ్యక్షుడు అర్జున్‌ ముండా (Arjun Munda) మాట్లాడుతూ.. దేశంలోని వివిధ గ్రామాల్లో ఉన్న ఆర్చర్లకు, తమ ప్రతిభ నిరూపించుకునేందుకు ఈ ఏపీఎల్‌ వేదిక ఉపయోగపడనుంది. దీని ద్వారా వారి భవిష్యత్‌ లక్ష్యాలను ఆవిష్కరించేందుకు అవకాశం లభిస్తుందన్న గట్టి నమ్మకంతో ఉన్నాం. దీనికి తోడు ఆర్చరీని మరో స్థాయిని తీసుకెళ్లేందుకు ఈ లీగ్‌ దోహదం చేస్తుందని ప్రగాఢంగా నమ్ముతున్నాం. గ్లోబల్ ఐకాన్ రామ్‌చరణ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుండటంతో.. దేశంలోని మరింత మంది యువత ఆర్చరీ పట్ల ఆకర్షితమయ్యే ఆస్కారం ఉందని భావిస్తున్నామని అన్నారు.

Also Read- OG Trailer Update: ‘ఓజీ’ ట్రైలర్ రిలీజ్‌కు డేట్ అండ్ టైమ్ ఫిక్స్.. ఎప్పుడంటే?

భవిష్యత్‌ అథ్లెట్లకు స్ఫూర్తిగా నిలిచేందుకు సిద్ధం

గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్‌ స్పందిస్తూ.. ‘ఆర్చరీ అనే క్రీడ.. క్రమశిక్షణ, ఫోకస్‌, స్థితిస్థాపకతను కల్గి ఉంటుందనే కారణంతో ఈ బాండ్ ఏర్పరచుకోవడం జరిగింది. ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌లో కలిసి కొనసాగుతున్నందుకు చాలా గర్వంగా ఉంది. భారత ఆర్చర్లకు అంతర్జాతీయ వేదిక కావడమే కాదు.. గ్లోబల్‌ స్పాట్‌లైట్‌లో మెరిసే అవకాశం కల్పిస్తున్న నిర్వాహకులకు అభినందనలు. భవిష్యత్‌ అథ్లెట్లకు స్ఫూర్తిగా నిలిచేందుకు నేను సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఏఏఐ ప్రధాన కార్యదర్శి వీరేంద్ర సచ్‌దేవా (Virendra Sachdeva) మాట్లాడుతూ.. దేశంలోని మిగతా లీగ్‌ల నుంచి స్ఫూర్తి పొంది.. ఈ ఆర్చరీ లీగ్‌ను ఏర్పాటు చేశాం. దీనిని ప్రొఫెషనల్‌ స్థాయికి తగినట్లుగా నిర్వహిస్తాం. ఇది కేవలం లీగ్‌ కాదు, భారత ఒలింపిక్‌ స్వప్నాన్ని చేరుకునేందుకు ఒక మెట్టుగా భావిస్తున్నాం. రామ్‌ చరణ్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుండటంతో.. ఈ లీగ్‌కు ప్రపంచ వ్యాప్తంగా మెరుగైన ఆదరణ లభిస్తుందన్న నమ్మకం ఉందని తెలిపారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Mahabubabad District: బతుకమ్మ ఆడుతూ.. గుండెపోటుతో హిళ మృతి.. ఎక్కడంటే..?

KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై లైంగిక వేధింపుల కేసు నమొదు

Pawan Kalyan: తెలంగాణలో ఈవెంట్ పెట్టి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు చెప్పలేదు.. పవన్ ని ఏకిపారేస్తున్న నెటిజన్స్

Mahabubabad District: ప్రభుత్వ అధికారుల బహిరంగ వాగ్వాదం.. బతుకమ్మ వేడుకల్లో ఉద్రిక్తత

MLC Kavitha: తెలంగాణ సాధించిన చంద్రునికి కొందరు మచ్చ తెచ్చారు: ఎమ్మెల్సీ కవిత