Missing-Case
Viral, లేటెస్ట్ న్యూస్

Constable Missing Case: పోలీసుని సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న లేడీ ట్రాఫిక్ కానిస్టేబుల్.. చివరికి ట్విస్ట్!

Constable Missing Case: ఒడిశాలోని భువనేశ్వర్‌‌లో లేడీ ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుల్ మిస్సింగ్ కేసులో (Constable Missing Case) షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. కియోన్జార్‌ జిల్లాలోని అటవీప్రాంతంలో ఆమె డెడ్‌బాడీని పోలీసులు గుర్తించారు. ఆమెను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న పోలీస్ కానిస్టేబులే ఆమెను హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. హత్య చేసినట్టుగా అతడు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. గురువారం అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల తొలి వారంలో 25 ఏళ్ల ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ సుభమిత్ర సాహూ అదృశ్యమైంది. జగత్సింగ్‌పూర్ జిల్లాలోని పారాదీప్ ప్రాంతానికి చెందిన ఆమెకు భువనేశ్వర్‌లో పోస్టింగ్‌ వచ్చింది. దీంతో, అక్కడే విధులు నిర్వహించింది. సెప్టెంబర్ 6న డ్యూటీకి వెళ్లిన తర్వాత ఆమె తిరిగి ఇంటికి వెళ్లలేదు. దీంతో, తల్లి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. అప్పటినుంచి పోలీసులు ఆమె కోసం గాలింపు మొదలుపెట్టారు.

కేసు దర్యాప్తులో కీలక విషయం బయటపడింది. సుభమిత్ర సాహూ తన సహోద్యోగి అయిన దీపక్ రౌత్‌ అనే కానిస్టేబుల్‌ను 2024 జులైలో సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ దిశగా విచారణ జరపగా సుభమిత్ర చివరిసారిగా భువనేశ్వర్‌లో దీపక్ రౌత్‌తో కలిసి ఉన్నట్టు సమాచారం తెలుసుకున్నారు. ఆ తర్వాత నిందితుడు దీపక్ రౌత్‌ను ప్రశ్నించగా అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయని భువనేశ్వర్-కటక్ పోలీసు చీఫ్ ఎస్.దేవ్ దత్తా సింగ్ మీడియాకు వెల్లడించారు.

Read Also- Pak Saudi Pact: సౌదీతో పాక్ రక్షణ ఒప్పందం.. భారత్‌తో యుద్ధం వస్తే కలిసి వస్తాయా?

పోలీసు దర్యాప్తులో నిందితుడు దీపక్ రౌత్ పలు కీలక విషయాలు వెల్లడించారు. సెప్టెంబర్ 6న మధ్యాహ్నం 2 గంటల తర్వాత సుభమిత్ర సాహూ డ్యూటీ చేస్తున్న ప్రదేశానికి వెళ్లి కారులో తీసుకెళ్లినట్టు అంగీకరించాడు. అనంతరం, ఆమెను గొంతునులిమి చంపేశానని, 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న కియోన్జార్ జిల్లా ఘటగాం అడవి ప్రాంతానికి వెళ్లి డెడ్‌బాడీని పాతిపెట్టినట్టు చెప్పాడు.

Read Also- Huzurabad Crime News: గర్భిణి హత్య కేసు.. 24 గంటల్లో ఛేదించిన పోలీసులు.. సంచలన నిజాలు వెలుగులోకి?

కాగా, ఈ హత్యకు ఆర్థిక వ్యవహారాలే కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. సుభమిత్ర నుంచి దీపక్ రౌత్ రూ.10 లక్షలు అప్పుగా తీసుకున్నట్టు సమాచారం. అయితే, తమ పెళ్లిని అధికారికంగా ప్రకటించి, అందరికీ తెలిసేలా వేడుక నిర్వహించాలని, మరోపక్క అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాలని అడుగుతున్నందున హత్యకు పాల్పడినట్టు పోలీసులు చెప్పారు. డబ్బు తిరిగి ఇవ్వాలన్న ఉద్దేశం అతడికి లేదని, ఈ విషయంలో ఆమెను బెదిరించినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఈ కేసు దర్యాప్తుపై పోలీసు అధికారి సింగ్ మాట్లాడుతూ మొదట్లో తమకు ఏ ఆధారాలూ దొరకలేదన్నారు. అతడిపై అనుమానం కూడా రాలేదన్నారు. ఆమె మొబైల్ చాటింగ్ ప్రకారం, ఆమె ఎక్కడో దాక్కొని ఉంటుందని భావించి తాము పుణ్యక్షేత్రాల్లో గాలించామని, చాటింగ్ ఆ విధంగా ఉందని పోలీస్ అధికారి తెలిపారు. ఇక, ఈ కేసులో పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుందని, ఈ నేరంలో మరెవరి పాత్ర ఉందా? అనే కోణంలో కూడా పరిశీలించాల్సి ఉందని సింగ్ తెలిపారు.

Just In

01

SGT Post Fraud: డీఎస్సీ 2024 ఎస్‌జి‌టి పోస్ట్ ఎంపికలో.. డ్యూయల్ క్యాస్ట్ సర్టిఫికెట్ గుట్టు రట్టు

IND vs BAN Clash: రేపే మ్యాచ్‌.. టీమిండియాపై బంగ్లాదేశ్ కోచ్ షాకింగ్ కామెంట్స్

Nongjrang Village: మహా అద్భుతం.. మేఘాల కంటే ఎత్తులో గ్రామం.. లైఫ్‌లో ఒక్కసారైనా వెళ్లాల్సిందే!

71st National Awards: జాతీయ అవార్డులు అందుకున్న తెలుగు గ్రహీతల ఫస్ట్ రియాక్షన్.. ఏంటంటే?

Batukamma Festival: పువ్వులను పూజించే సంప్రదాయం.. వైద్యశాలలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు