Daksha Movie Team
ఎంటర్‌టైన్మెంట్

Daksha: ‘దక్ష’తో హ్యాట్రిక్.. మంచు లక్ష్మి కాన్ఫిడెంట్ చూశారా!

Daksha: మంచు లక్ష్మీ ప్రసన్న (Manchu Lakshmi Prasanna) ప్రధాన పాత్రలో.. శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై రూపుదిద్దుకున్న చిత్రం ‘దక్ష’ (Daksha Movie). ‘ది డెడ్‌లీ కాన్స్పిరసీ’ అనేది ట్యాగ్‌లైన్ (Daksha – The Deadly Conspiracy). ఈ సినిమాలో డాక్టర్ మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. తండ్రీ కూతుళ్లు కలిసి మొదటిసారిగా ఈ చిత్రంలో నటించడంతో పాటు, ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోవడంతో.. సినిమాపై భారీగానే అంచనాలు మొదలయ్యాయి. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వంశీ కృష్ణ మల్లా అందించగా, ఈ సినిమా సెప్టెంబర్ 19న వరల్డ్ వైడ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర టీమ్ మీడియాతో ముచ్చటించింది.

Also Read- Kajal Aggarwal: అర్ధరాత్రి పిలిచినా కాజల్ పరుగెత్తుకుంటూ నా దగ్గరకు వస్తుంది.. దర్శకుడు షాకింగ్ కామెంట్స్..

హ్యాట్రిక్ కొడుతున్నాం

ఈ కార్యక్రమంలో నటి మంచు లక్ష్మి (Manchu Lakshmi) మాట్లాడుతూ.. ఈ శుక్రవారం నేను నటించిన ‘దక్ష’ సినిమా వస్తుంది. నేను ఎంతో ఇష్టపడి, కష్టపడి, ప్రేమించి చేసిన చిత్రమిది. అలాగే, ఫస్ట్ టైమ్ నాన్నతో కలిసి నటించాను. టైటిల్ ‘దక్ష’ ఎంత పవర్ ఫుల్‌గా ఉందో.. సినిమా కూడా అంతకు మించి ఉంటుంది. మొదటి నుంచి నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తూ వచ్చిన ప్రేక్షకులందరికీ థ్యాంక్స్. ఎప్పటిలాగే నాపై మీ ప్రేమ ఉంటుందని ఎంతగానో నమ్ముతున్నాను. ఈ చిత్రంతో మా డైరెక్టర్ వంశీ కృష్ణకు ఘన విజయం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందులో సముద్రఖని, సిద్దిక్, విశ్వంత్, చిత్రా శుక్లా వంటి స్టార్ క్యాస్ట్ ఉంది. వీళ్లంతా తమ స్క్రీన్ ప్రెజెన్స్, పెర్ఫార్మెన్స్‌తో ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఈ సినిమాకు పని చేసిన అందరికీ థ్యాంక్స్ చెబుతున్నాను. విష్ణు ‘కన్నప్ప’, మనోజ్ ‘మిరాయ్’తో సక్సెస్ అందుకున్నారు. రేపు (శుక్రవారం) రాబోయే ‘దక్ష’ చిత్రంతో హ్యాట్రిక్ కొడుతున్నాం. ఈ సినిమా థియేటర్స్‌లోకి వస్తోందంటే చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. ప్రేక్షకులందరినీ మా మూవీ ఆకట్టుకుంటుందని నమ్ముతున్నానని తెలిపారు.

Also Read- Manchu Manoj: నా బిడ్డ మహవీర్ లామా.. అని అమ్మ అంటుంటే.. !

ప్రౌడ్‌గా ఫీలవుతున్నాను

డైరెక్టర్ వంశీకృష్ణ మల్లా (Director Vamsee Krishna Malla) మాట్లాడుతూ.. ఇప్పటి వరకు తండ్రీకూతుళ్లైన మోహన్ బాబు, మంచు లక్ష్మి కలిసి నటించ లేదు. వారిద్దరినీ డైరెక్ట్ చేసే అవకాశం నాకు వచ్చినందుకు ప్రౌడ్‌గా ఫీలవుతున్నాను. వారిద్దరూ కలిసి నటించిన ఫస్ట్ మూవీ ‘దక్ష’.. ఈ సెప్టెంబర్ 19న థియేటర్స్‌లోకి వస్తోంది. ఒక డిఫరెంట్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని అందరూ థియేటర్లలో చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇప్పటి ట్రెండ్‌లో ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో.. అలాంటి అంశాలన్నీ ఉన్న థ్రిల్లర్ సినిమా ఇది. ఇటీవల విష్ణు అన్న ‘కన్నప్ప’, మనోజ్ అన్న ‘మిరాయ్’ సక్సెస్ అయినట్లే లక్ష్మి అక్క ‘దక్ష’ సినిమా కూడా విజయం సాధిస్తుందని ఎంతో నమ్మకంతో ఉన్నామన్నారు. ‘‘ఒక మంచి థ్రిల్లర్‌ చిత్రంతో మంచు లక్ష్మి ‘దక్ష’ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మీ దగ్గరలోని థియేటర్స్‌లో ఈ సినిమాను తప్పకుండా చూడండి. అంతా ఈ సినిమా చూసి, నచ్చితే పదిమందికి చెప్పాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు రంగస్థలం మహేష్.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Raasi: స్నానం చేస్తూ చేసే.. అలాంటి సీన్స్ నాకు సెట్ అవ్వవు.. సంచలన కామెంట్స్ చేసిన రాశి

Mahabubabad District: బతుకమ్మ ఆడుతూ.. గుండెపోటుతో హిళ మృతి.. ఎక్కడంటే..?

KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై లైంగిక వేధింపుల కేసు నమొదు

Pawan Kalyan: తెలంగాణలో ఈవెంట్ పెట్టి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు చెప్పలేదు.. పవన్ ని ఏకిపారేస్తున్న నెటిజన్స్

Mahabubabad District: ప్రభుత్వ అధికారుల బహిరంగ వాగ్వాదం.. బతుకమ్మ వేడుకల్లో ఉద్రిక్తత