Deepika padukone ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Deepika Padukone: వరుసగా రెండో షాక్.. కల్కి 2 నుంచి దీపిక పదుకొనే ఔట్..

Deepika Padukone: ప్రభాస్ కథానాయకుడిగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన బ్లాక్‌బస్టర్ చిత్రం కల్కి 2898 ఏడీ. ఈ చిత్రంలో దీపికా పదుకొనే కథానాయికగా నటించి, ప్రపంచవ్యాప్తంగా ఆడియెన్స్ ను మంత్రముగ్ధులను చేసింది. ఈ చిత్రం సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు, ఈ చిత్ర సీక్వెల్ కోసం చిత్ర బృందం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. కానీ, ఒక ఆశ్చర్యకరమైన వార్త అభిమానులను షాక్‌కు గురిచేసింది. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Also Read: Damodar Raja Narasimha: ఉస్మానియా, అనుబంధ దవాఖాన్లలో బెటర్ ట్రీట్మెంట్.. ఆరోగ్య శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు

కల్కి 2లో దీపికా పదుకొనే నటించడం లేదని చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. వైజయంతి మూవీస్ తమ ట్వీట్‌లో ఇలా పేర్కొంది. “కల్కి 2898 ఏడీ మొదటి భాగంలో దీపికాతో కలిసి పనిచేశాము. అయితే, సీక్వెల్‌లో ఆమె లేదు. మేము అన్ని పరిశీలించిన తర్వాత, ఇరు పక్షాలూ విడిపోవాలని నిర్ణయించాము. దీపికా భవిష్యత్తు ప్రయాణం విజయవంతం కావాలని కోరుకుంటున్నాము. అద్భుతమైన టీమ్‌తో కల్కి 2ని మీ ముందుకు తీసుకొస్తాం.” అంటూ పోస్ట్ లో రాసుకొచ్చారు.

Also Read: Gadwal Vijayalakshmi: ప్రపంచంలోనే అగ్రశ్రేణి నగరంగా హైదరాబాద్.. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కీలక వ్యాఖ్యలు

ఈ ట్వీట్ అభిమానుల్లో చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా.. కొన్ని రోజుల క్రితం దీపికా మరో ప్రతిష్టాత్మక చిత్రం, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ నుంచి కూడా తప్పుకుంది. ఆమె స్థానంలో తృప్తి డిమ్రిని చిత్ర బృందం ఎంపిక చేసింది. దీపికా ఇటీవల తల్లి కావడంతో, రోజుకు కేవలం ఎనిమిది గంటలు మాత్రమే పనిచేస్తానని, అధిక పారితోషికం డిమాండ్ చేసిందని, దీంతో సందీప్ ఆమెను తప్పించినట్లు వార్తలు వచ్చాయి. కల్కి 2898 ఏడీ మొదటి భాగంలో సుమతి పాత్రలో దీపికా చూపించిన నటన అభిమానుల హృదయాలను కట్టిపడేసింది. ఇప్పుడు సీక్వెల్‌లో ఆమె స్థానంలో ఎవరు నటిస్తారన్న ప్రశ్న ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. దీపికా లేని కల్కి 2 ఎలా ఉంటుంది? ఆమె పాత్రలో ఎవరు నటిస్తారు? ఈ ప్రశ్నలు అభిమానులను ఆలోచనలో ముంచెత్తుతున్నాయి.

Also Read: Mahesh Kumar Goud: కవితకు విలీన దినోత్సవానికి ఏం సంబంధం?.. పీసీసీ చీఫ్ సంచలన కామెంట్స్

 

Just In

01

Army Veterans: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సర్కారు ఆసుపత్రుల్లో ఆర్మీ జవాన్లు

Bathukamma 2025: గిన్నిస్ రికార్డు లక్ష్యంగా బతుకమ్మ ఉత్సవాలు.. ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు

Harish Rao: లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టే ధైర్యం ప్రభుత్వానికి లేదా: హరీష్ రావు

Ramachandra Rao: ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం.. అలైన్ మెంట్ మార్చాలంటూ రైతులు డిమాండ్!

H-City Project: ముందుకు సాగని హెచ్ సిటీ పనులు.. ఎందుకో తెలుసా..!