Damodar Raja Narasimha: ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి దామోదర రాజనర్సింహా (Damodar Raja Narasimha) పేర్కొన్నారు. ఆయన హైదరాబాద్ లో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కేన్సర్ కేసులు పెరుగుతున్నాయన్నారు. మహిళల్లో బ్రెస్ట్ కేన్సర్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయన్నారు.రకూ బ్రెస్ట్ కేన్సర్ కేసులు చివరి దశలోనే బయట పడుతున్నాయన్నారు.ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన డే కేర్ కేన్సర్ సెంటర్ల ద్వారా మహిళల్లో కేన్సర్ స్క్రీనింగ్,ఎర్లీ డిటెక్షన్‌కు ప్రాధాన్యతను ఇస్తున్నామన్నారు. ఎన్‌సీడీ క్లినిక్‌ల ద్వారా బీపీ, షుగర్, కిడ్నీ, గుండె, కేన్సర్ జబ్బుల బారిన పడిన మహిళలకు వైద్య సేవలు అందిస్తున్నామన్నారు.ట్రాన్స్‌జెండర్ల కోసం మైత్రి క్లినిక్స్ ఏర్పాటు చేశామన్నారు.
Also Read: OG Movie: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సెన్సార్ పూర్తి.. ఇక రికార్డులు బద్దలే!
20,639 హెల్త్ క్యాంపులు
రోగ్య రంగంలో మాత్రమే కాదు.. ఉపాధి కల్పన, ఉద్యోగవాకాశాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లోనూ మహిళకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. మహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యతను ఇస్తూ స్వస్థ్ నారీ సశక్త్ అభియాన్ కార్యక్రమాన్ని తీసుకున్న కేంద్ర ఆరోగ్యశాఖకు అభినందనలు తెలిపారు. ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకూ మహిళల కోసం రాష్ట్రవ్యాప్తంగా హెల్త్ క్యాంపులు నిర్వహించబోతున్నామన్నారు. వ్యాప్తంగా 20,639 హెల్త్ క్యాంపులు నిర్వహించాలని లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రైమరీ హెల్త్ సెంటర్ల నుంచి టీచింగ్ హాస్పిటల్స్ వరకూ అన్ని చోట్ల క్యాంపులు నిర్వాహణకు ఏర్పాట్లు చేశామన్నారు. మాజ నిర్మాతలు మహిళలేనని, వారు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందన్నారు.తద్వారా సమాజం ఆరోగ్యంగా ఉంటుందన్నారు.ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే 2012-2013లో మాతా, శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను ప్రారంభించుకుని.. గర్భిణులు, బాలింతలు, పిల్లలకు వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఎంసీహెచ్‌లు విస్తరించి వైద్య సేవలు అందిస్తున్నామన్నారు.
మరింత స్పీడ్ గా వైద్య సేవలు అందాలి
ఇక ఉస్మానియా మెడికల్ కాలేజీ అనుబంధ ఆసుపత్రులలలో వైద్య సేవల బలోపేతం పై రాష్ట్ర వైద్య , ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా ఎస్ ఆర్ నగర్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ హెల్త్ కార్యాలయం లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు . ఉస్మానియా మెడికల్ కాలేజీకి అనుబందంగా ఉస్మానియా హాస్పిటల్‌తో పాటు, నీలోఫర్ హాస్పిటల్, సరోజిని దేవి కంటి ఆస్పత్రి, ఎంఎన్‌జే కేన్సర్ హాస్పిటల్, టీబీ అండ్ చెస్ట్ హాస్పిటల్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, సుల్తాన్ బజార్ మెటర్నిటీ హాస్పిటల్, పెట్లబుర్జు మెటర్నిటీ హాస్పిటల్, ఈఎన్‌టీ హాస్పిటల్, ఫీవర్ హాస్పిటల్ లు అనుబంధంగా విశేష వైద్య సేవలను అందిస్తున్నాయని, మరింత స్పీడ్ గా వైద్య సేవలు అందాలని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉస్మానియా హెల్త్ హబ్ గా , బ్రాండ్ గా ఉస్మానియా డాక్టర్లు గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. మౌళిక వసతులకు పెద్దపీఠ వేయాలన్నారు. ఈ సమీక్ష లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హెల్త్ సెక్రటరీ డా క్రిస్టినా, డీఎంఈ డాక్టర్ నరేంద్రకుమార్, టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ తదితరులు ఉన్నారు.