Kajal Aggarwal: సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన కాజల్ ఇప్పుడు అడపా దడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. కానీ, ఒకప్పుడు ఆమె కూడా ఇండస్ట్రీలో కొత్తగా అడుగుపెట్టిన సాధారణ నటి మాత్రమే. అలాంటి కాజల్‌ను సినిమా ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత ప్రముఖ దర్శకుడు తేజకు దక్కుతుంది. ఎందుకంటే, ఆమె సినీ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన చిత్రం ‘లక్ష్మీ కళ్యాణం’.
ఆమెకు డైరెక్టర్ తేజ తొలి అవకాశం ఇచ్చారు. ఈ అవకాశమే కాజల్‌ను ఈ రోజు స్టార్ స్థాయికి చేర్చిందని ఆమె ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకోచ్చింది. సినిమా రంగంలో చాలామంది నటీనటులు తమను ఇండస్ట్రీకి పరిచయం చేసిన వారి పట్ల ఒక ప్రత్యేకమైన గౌరవం, కృతజ్ఞతా భావం కలిగి ఉంటారు. అలాంటి వారిలో కాజల్ కూడా ఒకరు. తేజ ఎప్పుడు పిలిచినా, ఎలాంటి సమయంలోనైనా సరే, ఆమె వెంటనే స్పందిస్తుందని, అతని పట్ల ఆమెకున్న అభిమానం అలాంటిదని చెబుతారు. ఈ అనుబంధం గురించి కాజల్ తన సన్నిహితులతో తరచూ పంచుకుంటూ, “నీవు ఇచ్చిన అవకాశమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది” అని తేజ గురించి గర్వంగా చెప్పుకుంటుందట.
ఇటీవల డైరెక్టర్ తేజ ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించాడు. దర్శకుడు తేజ, తాను ఇండస్ట్రీకి ఎంతోమంది నటీనటులు, సంగీత దర్శకులు, రచయితలను పరిచయం చేశానని, వారంతా తన పట్ల కృతజ్ఞతా భావంతో ఉన్నారని చెప్పారు. “ అక్కడి వరకు ఎందుకు.. అర్ధరాత్రి పిలిచినా కాజల్ పరుగెత్తుకుంటూ నా దగ్గరకు వస్తుంది. అంతటి అనుబంధం, అభిమానం నా మీద ఉంది” అని తేజ గుండెలు నిండిన గర్వంతో చెప్పారు.
ఉదయ్ కిరణ్, నితిన్, నవదీప్, గోపీచంద్, ఆర్‌పీ పట్నాయక్ వంటి ఎందరో తేజ ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టి, తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి వారిలో కాజల్ అగర్వాల్ కూడా ఒకరు. ఈ బంధం కేవలం ప్రొఫెషనల్ సహకారం మాత్రమే కాదు, ఒక గురువు-శిష్యురాలి మధ్య ఉన్న గాఢమైన గౌరవం, ప్రేమ, కృతజ్ఞతా భావం. అందుకే, అర్ధరాత్రి అయినా సరే, తేజ పిలుపుకు కాజల్ స్పందించడం వెనుక ఈ హృదయపూర్వక అనుబంధమే కారణమని చెప్పవచ్చు.