Producer Ashwini Dutt Bags Golden Chance To TTD Chairman Post
Cinema

Golden Chance: డైరెక్టర్‌కి ఆ గోల్డెన్‌ ఛాన్స్ దక్కనుందా..?

Producer Ashwini Dutt Bags Golden Chance To TTD Chairman Post: ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని విధంగా కూటమి అనూహ్య విజయం సాధించింది. దాదాపు 135 సీట్లను గెలుచుకున్న కూటమి త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఈ క్రమంలోనే గత ప్రభుత్వంలో ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు, పలు పదవుల్లో ఉన్న వాళ్ళు రాజీనామా చేస్తుండగా, త్వరలోనే కూటమి ప్రభుత్వం తరపున కొత్త వాళ్ళని నియమించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే టీటీడీ చైర్మన్‌గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశాడు.

దీంతో ఈ పదవి ఇప్పుడు తెలుగు చిత్రసీమలో ఉన్న ఆ అగ్ర నిర్మాతకు రాబోతుందని నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఇది కాస్త రాజకీయవర్గాల్లో సర్వత్రా ఆసక్తికరంగా మారింది. టాలీవుడ్ సీనియర్ నిర్మాత అశ్వనిదత్‌కి కూటమి ప్రభుత్వం టీటీడీ చైర్మన్ బాధ్యతలను అప్పగించబోతున్నారంటూ టాక్‌. ప్రస్తుతం ఆయన హీరో ప్రభాస్‌తో కల్కి మూవీని నిర్మిస్తున్నారు. కాగా అశ్వనిదత్ ముందు నుంచి కూడా టీడీపీ పార్టీలోనే ఉన్నారు. ఎన్టీఆర్ ఉన్నప్పట్నుంచి ఆ పార్టీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు ఇస్తూ వస్తున్నారు. ఇటీవల చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు అరెస్ట్‌ని తీవ్రంగా ఖండించారు.

Also Read: టాలీవుడ్‌లో సందడి చేయనున్న మూవీస్‌

అశ్వినిదత్ టీడీపీ సపోర్ట్ అని ఇండస్ట్రీలో కూడా అందరికి తెలుసు. అలాగే అశ్వినిదత్‌కు ఎన్టీఆర్ ఫ్యామిలీతో, చంద్రబాబుతో మంచి సాన్నిహిత్యం ఉంది.ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక అశ్వనిదత్‌కి టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అప్పట్లో చంద్రబాబు హయాంలో ఇదే టీటీడీ చైర్మన్ పదవి ఛాన్స్ దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావుకి ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈసారి ఈ పదవికి అశ్వనిదత్‌కి ఇచ్చే ఛాన్స్ ఉందని పలువురు భావిస్తున్నారు. మరి అశ్వనిదత్‌కి ఆ పదవి ఛాన్స్‌ నిజంగానే దక్కనుందా లేక ఈ వార్త రూమర్స్‌కే పరిమితం కానుందా అనేది క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయకతప్పదు.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?