Hero raghava Lawrance Kanchana 4 Movie Latest Updates
Cinema

Kanchana 4: భయపెట్టేందుకు రెడీ అవుతున్న లారెన్స్

Hero raghava Lawrance Kanchana 4 Movie Latest Updates: సౌత్ సినీ ఇండస్ట్రీలో హారర్ సినిమాలకి ట్రెండ్ సెట్ చేసి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన మూవీ కాంచన. ఈ సిరీస్ నుంచి మరో ఇంట్రెస్టింగ్‌ అప్డేట్‌ని అందించారు మూవీ యూనిట్. డ్యాన్స్ మాస్టర్, డైరెక్టర్, హీరో రాఘవలారెన్స్ యాక్ట్ చేస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమాలన్నీ, అన్ని లాంగ్వేజీలలో సూపర్ డూపర్ సక్సెస్‌ని అందుకున్నాయి.

ఇప్ప‌టికే ఈ సిరీస్ నుంచి ముని, కాంచ‌న, గంగ కాంచన 2, కాంచ‌న 3 వంటి సినిమాలు ఆడియన్స్‌ని బాగా భయపెట్టాయి. ఇక ఇప్పుడు అదే బాటలో కాంచన 4 కూడా ఆడియెన్స్‌ని భయపెట్టేందుకు రెడీగా ఉందని మూవీ యూనిట్ తెలిపారు. కాంచన 3 మూవీ 2019 ఆడియెన్స్‌ ముందుకు వచ్చి సూపర్ హిట్ మూవీగా నిలిచింది. అప్పటినుంచి పార్ట్ 4 కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాంచన 3 క్లైమాక్స్‌లో పార్ట్ 4 కి సంబంధించి రాఘవ లారెన్స్ లుక్ రివీల్ చేయడంతో ఆ లుక్ కాస్త పార్ట్ 4 పై మరింత క్యూరియాసిటిని పెంచింది.

Also Read: డార్లింగ్ కల్కి ట్రైలర్ అప్పుడే

ఇక అన్నింటిని అధిగమించి కాంచన 4 ఎట్టకేలకు పట్టాలెక్కనుంది. ఇందుకు సంబంధించి మేకర్స్ తాజాగా కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా ఓ పోస్ట‌ర్‌ను కూడా రిలీజ్‌ చేశారు. రాఘ‌వ లారెన్స్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఈ మూవీ షూటింగ్ సెప్టెంబ‌ర్‌లో ప్రారంభం కానున్న‌ట్లు మూవీ యూనిట్ అనౌన్స్ చేశారు. దాంతో పాటు 2025 స‌మ్మ‌ర్‌లో ఈ మూవీని ఆడియెన్స్ ముందుకు తీసుకురానున్న‌ట్లు వెల్లడించారు. ఇక ఈ అప్డేట్‌తో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ మూవీ కూడా కాంచన 2,3 లాగా అలరించనుందని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.

Just In

01

Nude Gang: నగ్నంగా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు