TGPSC (image CREDIT: SWETCHA TWITTER)
తెలంగాణ

TGPSC: గ్రూప్ 1పై కీలక నిర్ణయం.. సింగిల్ బెంచ్ తీర్పును విజన్ బెంచ్ లో అప్పీల్ చేసిన టీజీపీఎస్సీ

TGPSC: గ్రూప్​ 1 ఉద్యోగాలకు సంబంధించి హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి కోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) అప్పీల్​ కు వెళ్లింది. ఈ మేరకు  హైకోర్టు డివిజన్ బెంచ్​ లో పిటిషన్ దాఖలు చేసింది. గ్రూప్ 1 పరీక్షలపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి కోర్టు ఈనెల 9న సంచలన తీర్పును ఇచ్చిన విషయం తెలిసిందే. సంజయ్​ వర్సెస్ యూపీఎస్సీ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం మార్కులను రీవాల్యుయేషన్ జరపాలని టీజీపీఎస్సీని ఆదేశించింది.

 Also Read: Pakistan Gym: పాక్ జిమ్‌లో దిక్కుమాలిన కసరత్తులు.. నవ్వి నవ్వి పోతే.. ఎవరు రెస్పాన్సిబిలిటీ!

సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా పూర్తయి ఇక నియామక ఉత్తర్వులు

ఈ ప్రక్రియను పూర్తి చేయటానికి ఎనిమిది నెలల గడువు విధించింది. ఆలోపు రీవాల్యూయేషన్ జరపక పోతే మొత్తంగా పరీక్షలను రద్దు చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. అదే జరిగితే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు మళ్లీ నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ తీర్పు పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన కలిగించింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా పూర్తయి ఇక నియామక ఉత్తర్వులు చేతికి అందుతాయన్న దశలో మరోసారి మార్కుల రీవాల్యుయేషన్ చేయాలని, గడువులోపు చేయకపోతే పరీక్షలను రద్దు చేయాల్సి ఉంటుందని హైకోర్టు చెప్పటంతో తమ భవిష్యత్తు ఏమవుతుందోనన్న కలవరం ఎంపికైన అభ్యర్థుల్లో వ్యక్తమైంది. కాగా, హైకోర్టు సింగిల్​ జడ్జి ఇచ్చిన తీర్పుపై టీజీపీఎస్సీ న్యాయ నిపుణులతో చర్చించింది. అనంతరం ఈ తీర్పును డివిజన్ బెంచ్​ లో సవాల్ చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే బుధవారం డివిజన్ బెంచ్ లో అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది.

 Also Read: Uttar Pradesh: ఇదెక్కడి విచిత్రంరా బాబు.. ఒకే ఇంట్లో 4 వేలకు పైగా ఓటర్లు

Just In

01

Pawan Kalyan: ప్రకృతితో చెలగటాలు ఆడొద్దు అంటున్న నెటిజన్స్

Huzurabad District: సింగాపూర్‌లో అక్రమ మొరం తవ్వకాలు.. పట్టించుకోని అధికారులు

Vasavi Group: ఓ పక్క ఐటీ దాడులు.. హైడ్రా భయంతో వాసవి గ్రూప్ ఉక్కిరిబిక్కిరి!

BJP Telangana: బీజేపీలో రగులుతున్న అంతర్గత కుమ్ములాట.. మళ్లీ మొదలైన పాత కొత్త నేతల లొల్లి

Army Veterans: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సర్కారు ఆసుపత్రుల్లో ఆర్మీ జవాన్లు