Telangana Tourism: రాష్ట్రంలోని కోటగుళ్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం అడుగులు వేస్తుంది. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రాధాన్యత క్రమంలో బలోపేతం చేసేందుకు కసరత్తుచేస్తుంది. వాటిని పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ప్రణాళికలు రూపొందిస్తుంది. ఈ కోటగుళ్లు తెలంగాణ చరిత్రకు, కాకతీయ కళా వైభవానికి ప్రతీకగా ఉన్నాయి. వాటివద్ద నాటి అద్భుతమైన కళారూపాలు ఉన్నాయి. దీంతో వాటి చరిత్రను భవిష్యత్ తరాలకు తెలపాలని భావిస్తుంది. అందులో భాగంగానే జయశంకర్ భూపాలపల్లి(Jayashankar Bhupalapally) జిల్లాలోని గణపురం మండలంలో ‘కోటగుళ్ల’ ఆలయం ఉంది. కాకతీయ రాజుల కాలంనాటి ఆలయం వారి కళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. రాతి కట్టడాలు, శిల్ప కళలు, నిర్మాణ శైలీ నాటి గొప్పదనాన్ని చాటుతున్నది. స్థానిక ప్రజలు సందర్శనకు వెళ్తుంటారు. అయితే ఈ ఆలయాన్ని మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావాలని భావిస్తుంది.
రూ.30 కోట్ల డీపీఆర్ సిద్ధం
పర్యాటక శోభను సంతరించుకునేలా చేయడంతోపాటు చారిత్రక కట్టడాలను రక్షించి భావితరలకు పరిచయం చేయాలన్న సంకల్పంతో పర్యాటకశాఖ కోటగుళ్ల ఆలయ అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది. అవసరమైన పనులకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రూపొందించినట్లు అధికారులు తెలిపారు. కోటగుళ్లను పునరుద్ధరించడంతోపాటు పర్యాటకుల కోసం మౌలిక వసతులను కల్పించడంతోపాటు శిథిలమైన గోడలు, శిల్పాల పునరుద్ధరించనున్నారు. లైటింగ్, సౌండ్ షో, హాటల్, గెస్ట్‌హౌజ్‌లు, వాక్ వేలు, పార్కు అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు, రోడ్లు, పార్కింగ్ వంటి సౌకర్యాలు కల్పించనున్నారు. కాకతీయ శిల్పకళను ప్రదర్శించే మ్యూజియాన్ని ఏర్పాటు చేయనున్నారు. రూ.30 కోట్ల డీపీఆర్ సిద్ధం చేసింది. త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను పర్యాటకశాఖ పంపనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
Also Read: Navjyot Singh death: ఆర్థిక శాఖ సీనియర్ అధికారి మృతికి కారణమైన బీఎండబ్ల్యూ కార్ డ్రైవర్ అరెస్ట్
కోటగుళ్లతోపాటు..
కోటగుళ్లను రామప్ప ఆలయం (యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్)తో లింక్ చేసి పర్యాటక సర్క్యూట్‌ను ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే మేడారం, రామప్ప ఆలయానికి టూరిస్ట్‌లు రద్దీ పెరిగిపోయింది. అయితే, ఈ పర్యాటక ప్రాంతాలకు వెళ్లే మార్గంలో ఉన్న కోటగుళ్లును అభివృద్ధి చేస్తే పర్యాటకులకు మధురానుభూతి కలిగించనున్నది. ప్రభుత్వానికి ఆదాయం సమకూరడంతోపాటు స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కోటగుళ్లతోపాటు నిర్మల్ జిల్లా కేంద్రంలోని చారిత్రక నిర్మల్ ఫోర్ట్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. నిర్మల్ ఫోర్ట్ (శ్యామ్‌గఢ్ ఫోర్ట్) కూడా కాకతీయుల కాలం నాటిది. కాగా, ఈ పురాతన కోట ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. పర్యాటక శాఖ దీన్ని పునరుద్ధరించి పర్యాటక హబ్‌గా మార్చేందుకు సిద్ధమైంది. ఫోర్ట్ కు అవసరమైన పనులు చేపట్టేందుకు డీపీఆర్ రెడీ చేస్తున్నారు. ఇందుకోసం పర్యాటకశాఖ ప్రత్యేక టీంను నిర్మల్ కు పంపించినట్లు సమాచారం.
పునరుద్ధరణకు నిర్ణయం
అదే విధంగా హైదరాబాద్(Hyderabad)లోనూ 12 వారసత్వ కట్టడాల అభివృద్ధికి అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. అదే విధంగాఉమ్మడి 10 జిల్లాల్లోని ప్రాముఖ్యత కలిగిన కట్టడాలపై ఫోకస్ ఫెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా పునరుద్ధరణకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. డీపీఆర్ రూపొందించాలని కన్సల్టెన్సీలను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ఇచ్చినట్లు వెల్లడించారు. అయితే డీపీ(DPR)ఆర్ ను అధికారులు ఫైనల్ చేసిన తర్వాత ఎన్ని నిధులు అవసరమో క్లారిటీ వస్తుందని, దానికి అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన నిధులు ఉపయోగించనున్నట్లు తెలిపారు. చారిత్రక ప్రదేశాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన చొరవ తీసుకుంటుందని అధికారులు తెలిపారు. కొన్ని చారిత్రాత్మకమైన కోటగుళ్లు కనుమరుగవుతున్న తరుణంలో ప్రభుత్వం తీసుకుంటున్న చొరవపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Hyderabad Crime: మద్యానికి బానిసై.. బ్లేడుతో భార్య గొంతు కోసి?