Hyderabad Metro (imagecredit:twitter)
హైదరాబాద్

Hyderabad Metro: మెట్రో రైలు ఎండీ బదిలీ.. నూతన ఎండీగా హెచ్ఎండీఏ కమిషనర్..?

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైలు ను ప్రతిపాదనల స్థాయిలో కాగితాలపైకి, ఆ తర్వాత మెట్రోరైలును నగరంలో పట్టాలెక్కించి, నగరవాసులకు లగ్జరీ రైలు ప్రయాణాన్ని పరిచయం చేసిన మెట్రోరైలు ఎండీ డా. ఎన్వీఎస్ రెడ్డి(Dr.NVS Reddy)ని సర్కారు ఎట్టకేలకు మంగళవారం బదిలీ చేసింది. ఆయన స్థానంలో ప్రస్తుత హెచ్ఎండీఏ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్(Commissioner Sarparaj Ahmed) ను మెట్రోరైలు ఎండీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డా. ఎన్వీఎస్ రెడ్డిని ఎండీ పదవీ నుంచి తప్పించిన సర్కారు ఆయన సేవలను సిటీ రవాణా విభాగానికి వినియోగించేలా ఆయన్ను పట్టణ రవాణా ప్రభుత్వ సలహాదారుగా నియామిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

తొలుత ఆయన సిటీలో..

రెండేళ్ల పాటు ఆయన ప్రభుత్వ సలహాదారుగా కొనసాగేలా పదవీ కాలాన్ని కూడా ఫిక్స్ చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుత జీహెచ్ఎంసీ 2004లో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ గా ఉన్నప్పటి నుంచే ఆయన ఎంసీహెచ్ లో అదనపు కమిషనర్ ( టాన్స్ పోర్టు, ట్రాఫిక్)గా, అదనపు కమిషనర్ (అడ్వర్ టైజ్ మెంట్)గా విధులు నిర్వహిస్తూనే, తొలుత ఆయన సిటీలో నిత్యం రద్దీగా ఉండే మెహిదీపట్నం నుంచి ఉప్పల్ వరకు 13 కిలోమీటర్ల పొడువున బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (బీఆర్ టీఎస్) ప్రతిపాదనలు రూపకల్పన చేశారు. కానీ అప్పటి సర్కారు ఆ ప్రతిపాదనలపై పెద్దగా ఆసక్తి చూపకపోవటం, ప్రత్యామ్నాయంగా బస్ ప్లసే లో రైలు గురించి ఆలోచించి, ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఆదేశించటంతో హైదరాబాద్ మెట్రోరైలు ప్రతిపాదనలు పురుడు పోసుకున్నాయి.

Also Read: US Corn Threat: మరోసారి అమెరికా బెదిరింపులు.. భారత్ మా మొక్కజొన్న కొనకుంటే…

 సమైఖ్య రాష్ట్రంలో ఎండీగా..

2005 లో మెట్రో రైలు ప్రతిపాదనలకు అప్పటి వైఎస్ఆర్(YSR) సర్కారు ఎంతో ప్రాధాన్యతనివ్వటంతో మెట్రోరైలు ప్రతిపాదనల రూపకర్త, ఆ తర్వాత 2009లో మెట్రోకు టెండర్లు ఖరారైన తర్వాత డా. ఎన్వీఎస్ రెడ్డిని అప్పటి సర్కారు ఎండీగా నియమించింది. మెట్రోరైలు స్థల సేకరణ, అలైన్ మెంట్ కు సంబంధించిన ఆయన క్షేత్ర స్థాయిలో, సాంకేతికపరంగా ఆయన ఎన్నో సవాళ్లను అధిగమించారు. సమైఖ్య రాష్ట్రంలో ఎండీగా నియమితులైన ఆయన ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన 2014 తర్వాత ఏకంగా పదేళ్ల పాటు ఎండీగానే కొనసాగారు. ఆయన ఎండీగా కొనసాగుతున్నపుడే 2018లో ప్రధాని నరేంద్ర మోడి చేతుల మీదుగా హైదరాబాద్ ప్రజలకు మెట్రోరైలు ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. మెట్రోరైలు ఫేజ్ -1లోని మూడు కారిడార్లకే పరిమితం కాని డా. ఎన్వీఎస్ రెడ్డి ముద్ర మెట్రోరైలు-2, 2ఏ, 2బి ప్రతిపాదనల్లో చోటు సంపాదించుకుంది.

Also Read: Gold Rate Today: పండుగ ముందు మహిళలకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్..

Just In

01

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!