Jogulamba Gadwal ( Image Source: Twitter)
క్రైమ్

Jogulamba Gadwal: భర్తపై వేడి నూనె పోసిన భార్య.. చికిత్స పొందుతూ మరణించిన భర్త వెంకటేష్

Jogulamba Gadwal: భర్తపై వేడి నూనె పోసిన భార్య, వెంకటేష్ మరణించాడు. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం మల్లెందోడ్డి గ్రామంలో ఒక భయానకమైన సంఘటన చోటు చేసుకుంది. భార్య తన భర్తపై వేడి నూనె పోసి, అతని ప్రాణాలను తీసింది. ఈ ఘటనలో తీవ్రమైన కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న వెంకటేష్ (35) అనే వ్యక్తి చివరికి మరణించాడు. ఈ దుర్ఘటన గ్రామంలోని ప్రజలను షాక్‌కు గురిచేసింది.

Also Read: Hyderabad Collector: సీజనల్ వ్యాధుల నివారణపై దృష్టి పెట్టాలి.. అధికారులకు కలెక్టర్ హరిచందన ఆదేశం!

భార్యా-భర్త సంబంధాల్లో గొడవలు ఎంతవరకు దారుణ పరిణామాలకు దారితీయవచ్చో ఈ ఘటన చూపించింది. మల్దకల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ నందీకర్ అందించిన వివరాల ప్రకారం, వెంకటేష్, పద్మ (32) భార్యా-భర్తలు 8 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. వివాహం తర్వాత ఈ దంపతుల మధ్య తరచూ కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు కారణంగా తీవ్రమైన గొడవలు జరుగుతూ వచ్చాయి.

Also Read: Ramchander Rao: ఫీజు రీయింబర్స్ మెంట్ పై సర్కార్ కు స్పష్టత కొరవడింది.. రాంచందర్ రావు సంచలన కామెంట్స్

ఈ గొడవలు క్రమంగా మరింత తీవ్రమవుతూ, ఇటీవల తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈ నెల 11వ తేదీ ఉదయం 5 గంటల సమయంలో మరోసారి గొడవ జరిగింది. కోపంతో ఊగిపోతున్న పద్మ, తన భర్త వెంకటేష్ నిద్రించే సమయంలో నూనెను వేడి చేసి, అతని మీద పోసేసింది. వెంకటేష్‌ తీవ్రంగా గాయ పడగా.. శరీరమంతా కాలి గాయాలు పాలయ్యాయి. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తక్షణమే అతన్ని స్థానిక గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతని పరిస్థితిని చూసి, తీవ్రతను అంచనా వేసి, మెరుగైన చికిత్స కోసం కర్నూల్ ను తరలించిన ఫలితం లేదు. చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం వెంకటేష్ మరణించడం జరిగింది. ఈనెల 11వ తేదిన సంఘటన జరిగిన రోజు భార్య పద్మను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం పద్మను రిమాండ్ కు తరలించడం జరిగిందని మల్దకల్ ఎస్ఐ నందీకర్ తెలిపారు.

Also Read: Jharkhand Encounter: మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ.. అగ్రనేత హతం.. మరో ఇద్దరు కీలక నేతలు సైతం?

Just In

01

Pawan Kalyan: ప్రకృతితో చెలగటాలు ఆడొద్దు అంటున్న నెటిజన్స్

Huzurabad District: సింగాపూర్‌లో అక్రమ మొరం తవ్వకాలు.. పట్టించుకోని అధికారులు

Vasavi Group: ఓ పక్క ఐటీ దాడులు.. హైడ్రా భయంతో వాసవి గ్రూప్ ఉక్కిరిబిక్కిరి!

BJP Telangana: బీజేపీలో రగులుతున్న అంతర్గత కుమ్ములాట.. మళ్లీ మొదలైన పాత కొత్త నేతల లొల్లి

Army Veterans: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సర్కారు ఆసుపత్రుల్లో ఆర్మీ జవాన్లు