Vijay And Rashmika: ఈ మధ్య ఎక్కడా చూసిన ఏఇ తో చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే.. ఇదొక ట్రెండ్ అయిపోయింది. ఖాళీ సమయం దొరికితే చాలు.. ఆ హీరోల ఫోటోలు.. ఈ హీరోయిన్ ఫోటోలు అంటూ ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు ఏదొక ఫొటో క్రియోట్ చేసి వైరల్ చేస్తున్నారు.
Also Read: Hyderabad Collector: సీజనల్ వ్యాధుల నివారణపై దృష్టి పెట్టాలి.. అధికారులకు కలెక్టర్ హరిచందన ఆదేశం!
విజయ్, రష్మిక ఫ్యామిలీ ఫొటోలు
గత కొంత కాలం నుంచి హీరో విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda ), నేషనల్ క్రష్ రష్మిక మందన్నా( Rashmika Mandanna) డేటింగ్‌లో ఉన్నారంటూ ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి. ఇప్పటికే వీరు మీడియాకి ఎన్నో సార్లు దొరికిపోయారు. కొన్ని మీడియా సంస్థలు కూడా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ న్యూస్ లు రాసుకొచ్చారు. అయితే, వీరి సంబంధాన్ని అధికారికంగా ప్రకటించనప్పటికీ.. కలిసి ఒకే ప్రదేశానికి వెళ్లడం, ఇద్దరూ ఒకే చోట కనిపించడం, వంటి వార్తలకు మరింత బలాన్ని అందించాయి. అయితే, తాజాగా మరో సారి వీరిద్దరూ మళ్లీ వార్తల్లో నిలిచారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఫ్యామిలీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సీక్రెట్ గా పెళ్ళి చేసుకుని పిల్లలను కన్న విజయ్ దేవరకొండ, రష్మిక?
అయితే, వీరిద్దరూ పెళ్లి చేసుకుని పిల్లలు కన్నట్లుగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ షాక్ అయి ఏంటి నిజంగానే వీరిద్దరూ పెళ్లి చేసుకుని పిల్లలను కూడా కన్నారా? ఇది నిజంగా బిగ్ షాక్ అని ఇంకొందరు అంటున్నారు. ఈ ఫోటోలలో ఇద్దరూ సంతోషంగా కనిపిస్తున్నారు. అయితే, ఈ ఫోటోలు అభిమానులు AI టూల్స్ ద్వారా సృష్టించినట్లు తెలుస్తుంది.