Ponguleti Srinivas Reddy: మీడియా అక్రిడిటేషన్ పాలసీ సిద్ధమైందని, త్వరలోనే అమలు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) పేర్కొన్నారు. ఆయన సచివాలయంలో అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ… ప్రజా ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నదన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికి అక్రిడిటేషన్ కార్డ్ లు అందేలా చూస్తామన్నారు. జర్నలిస్టులపై దాడులు జరగకుండా ప్రభుత్వం అన్నీ చర్యలు తీసుకుంటుందని, ఇందుకోసం హై పవర్ కమిటీని కూడా పునరుద్దరించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
Also Read: Road Accident: ఓఆర్ఆర్ పై ప్రమాదం.. పల్టీలు కొట్టిన కారు.. 8 మంది ఇన్ఫోసిస్ సాఫ్ట్‌వేర్లు?
ప్రత్యేక వెబ్ సైట్ ను తక్షణమే రూపొందించాలి
ఇందుకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో 2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జీవో జారీచేసిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆ ఊసే ఎత్తలేదని విమర్శించారు. ఇక జర్నలిస్టుల జీత భత్యాలకు సంబంధించి త్రైపాక్షిక కమిటీని కూడా పునరుద్దరిస్తున్నట్లు తెలిపారు. జర్నలిస్టుల హెల్త్ పాలసీపై సమగ్రంగా చర్చించామని, ఇన్సూరెన్స్ పాలసీలో ఏది జర్నలిస్టులకు ప్రయోజనకరంగా ఉంటుందనే అంశంపై ఆరోగ్యశ్రీ విభాగంతో కలిసి లోతైన అధ్యయనం చేయాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. జర్నలిస్టుల నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు ప్రత్యేక వెబ్ సైట్ ను తక్షణమే రూపొందించాలని అధికారులకు సూచించారు.
Also Read: Almonds: బాదం తొక్కతో తినాలా.. తొక్క తీసేయాలా? షాకింగ్ నిజాలు బయట పెట్టిన నిపుణులు