Mirai Movie Still
ఎంటర్‌టైన్మెంట్

Mirai Movie: ఒక టికెట్ కొంటే ఇంకోటి ఫ్రీ.. ‘మిరాయ్’ మేకర్స్ సంచలన నిర్ణయం

Mirai Movie: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా నటించిన ‘మిరాయ్’ (Mirai) మూవీ మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ని రాబట్టుకుని.. హౌస్‌ ఫుల్ కలెక్షన్లతో థియేటర్లలో దూసుకెళుతోంది. వీకెండ్ మాత్రమే కాదు.. మండే కూడా ఈ సినిమాకు కలెక్షన్స్ బాగున్నట్లుగా ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని అంతా అనుకుంటున్న సమయంలో.. మేకర్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏమిటంటే.. ఈ సినిమాకు ఒక టికెట్ కొంటే ఇంకోటి ఫ్రీ (బై వన్ గెట్ వన్ ఫ్రీ) ఆఫర్‌ను ప్రకటించారు. అదేంటి, థియేటర్లలో దుమ్ము రేపుతోన్న చిత్రానికి మేకర్స్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి? అని అంతా ఆశ్చర్యపోతున్నారేమో.. అసలు విషయం తెలిస్తే, నిరాశ పడతారు. కాబట్టి, పూర్తి విషయం తెలుసుకుంటే బెటర్.

Also Read- Maruthi: చెప్పుతో కొట్టుకున్న ‘బార్బరిక్’ దర్శకుడికి పబ్లిగ్గా డైరెక్టర్ మారుతి క్లాస్!

బై వన్ గెట్ వన్ ఫ్రీ

బై వన్ గెట్ వన్ ఫ్రీ.. ఆఫర్ నిజమే, కానీ సౌత్‌లో కాదు.. ఓన్లీ నార్త్‌లో మాత్రమే. డిజప్పాయింట్ అయ్యారు కదా. అందుకే చెప్పింది.. మ్యాటర్ మొత్తం తెలిసే వరకు ఎగ్జయిట్ అవ్వవద్దని. ప్రస్తుతం ఈ సినిమా విడుదలైన అన్ని చోట్లా గ్రాండ్ సక్సెస్‌ను అందుకుంది. కానీ, నార్త్‌లో ఈ సినిమాకు అంతగా కలెక్షన్స్ లేవు. నార్త్ ఆడియెన్స్‌ను ఆకర్షించేందుకు.. ఈ సినిమాను అక్కడ విడుదల చేసిన కరణ్ జోహార్ ఈ ఆఫర్‌ను ప్రకటించినట్లుగా తెలుస్తోంది. హిందీ వెర్షన్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఐదారు కోట్లకు మించి కలెక్షన్స్ రాలేదని అంటున్నారు. కరణ్ జోహార్ వంటి నిర్మాత ఈ సినిమాను విడుదల చేస్తే, ఆ కలెక్షన్స్ ఏంటి? అనేలా కూడా టాక్ నడుస్తుంది. అందుకే మేకర్స్ ఈ ఆఫర్‌ని ప్రకటించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం హిందీ బెల్ట్‌లో కూడా కలెక్షన్స్ ఊపందుకున్నట్లుగా టాక్ వినబడుతోంది.

Also Read- Nidhhi Agerwal: ‘మిరాయ్’ సక్సెస్‌.. పాపం.. నిధి పాప ఫీలవుతోంది!

ఒక వారం చూడాల్సింది

ఇక ఈ ఆఫర్ కేవలం నార్త్ ఆడియెన్స్‌కు మాత్రమే అని తెలిసి, సౌత్ ఆడియెన్స్ కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు. ఇదిలా ఉంటే, సినిమా విడుదలై వన్ వీక్ కూడా కాలేదు.. అప్పుడే ఈ ఆఫర్ ప్రకటించడం ఏంటి? అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఒక వారం చూడాల్సింది. నార్త్‌లో నిదానంగా కలెక్షన్లు ఊపందుకుంటాయి. ఇప్పుడే కదా టాక్ బయటకు వచ్చింది. నిదానంగా కలెక్షన్లు పుంజుకునేవి.. తొందరపడి ఈ నిర్ణయం తీసుకున్నారు.. అనేలా తేజ సజ్జా ఫ్యాన్స్ కొందరు కామెంట్స్ చేస్తుండటం విశేషం. కానీ, నార్త్ ఆడియెన్స్‌ను ఆకర్షించాలంటే ఇలాంటి ఆఫర్స్ అవసరమే అంటూ మేకర్స్ నిర్ణయాన్ని కొందరు సపోర్ట్ చేస్తున్నారు. మొత్తంగా అయితే ఈ సినిమా కళ్లు చెదిరే కలెక్షన్స్‌ను రాబడుతుందని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కూడా సంతోషంగా చెబుతున్నారు. ఈ సినిమా విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్ ఫిల్మ్‌గా విడుదలైన విషయం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. మంచు మనోజ్ ఓ కీలక పాత్రలో నటించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Huzurabad District: సింగాపూర్‌లో అక్రమ మొరం తవ్వకాలు.. పట్టించుకోని అధికారులు

Vasavi Group: ఓ పక్క ఐటీ దాడులు.. హైడ్రా భయంతో వాసవి గ్రూప్ ఉక్కిరిబిక్కిరి!

BJP Telangana: బీజేపీలో రగులుతున్న అంతర్గత కుమ్ములాట.. మళ్లీ మొదలైన పాత కొత్త నేతల లొల్లి

Army Veterans: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సర్కారు ఆసుపత్రుల్లో ఆర్మీ జవాన్లు

Bathukamma 2025: గిన్నిస్ రికార్డు లక్ష్యంగా బతుకమ్మ ఉత్సవాలు.. ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు