TG Private Colleges (imagecredit:twitter)
తెలంగాణ

TG Private Colleges: నేడు వృత్తి విద్యా కాలేజీలు.. రేపు డిగ్రీ పీజీ కాలేజీలు బంద్

TG Private Colleges: ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ బకాయిలు విడుదల చేయాలనే డిమాండ్ తో వృత్తివిద్య, డిగ్రీ, పీజీ ప్రైవేట్ యాజమాన్యాలు కాలేజీల బంద్ కు పిలుపునిచ్చాయి. ఈనెల 15 నుంచి వృత్తి విద్యాకాలేజీలు, ఈనెల 16 నుంచి డిగ్రీ, పీజీ ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఈ బంద్ కు పిలుపునిచ్చాయి. కాగా మాసబ్ ట్యాంక్ జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ(JNTU Fine Arts University)లో ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ఆధ్వర్యంలో ప్రైవేట్ యాజమాన్యాలు సమావేశం నిర్వహించాయి. ఈ మీటింగ్ అనంతరం ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య చైర్మన్ రమేష్ బాబు మాట్లాడుతూ.. సోమవారం నుంచి కళాశాలలు నిరవధికంగా మూసివేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

అక్టోబర్ 31 నాటికి..

సెప్టెంబర్ 21వ తేదీలోపు టోకెన్ అమౌంట్ గా ఉన్న రూ.1800 కోట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. సంవత్సరం క్రితం టోకెన్ ఇచ్చినా.. ఇప్పటి వరకు మంజూరు చేయలేదని, వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా అక్టోబర్ 31 నాటికి మిగిలిన పెండింగ్ బకాయిల్లో 50 శాతం, డిసెంబర్ 31 లోపు మరో 50 శాతం బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అయినా సెప్టెంబర్ లోపు నిధులు చెల్లించేలా ఒక జీవో తీసుకువారావాలన్నారు. కళాశాలలోని విద్యార్థులతో కలిసి 23 నుంచి 25 తేదీల్లో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Also Read: Modi on Nepal: నేపాల్ మన క్లోజ్ ఫ్రెండ్.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు

జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని..

విద్యార్థులు సోమవారం నుంచి కాలేజీలకు రావద్దని ఆయన విజ్ఞప్తిచేశారు. అనంతరం ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య సెక్రెటరీ రవి కుమార్ మాట్లాడుతూ.. తమ తదుపరి నిర్ణయం తీసుకునేవరకు కళాశాలల బంద్ కొనసాగిస్తామని, ఎలాంటి పరీక్షలు జరగబోవని తెలిపారు. సమయానికి సిబ్బందికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. కళాశాల యాజమన్యాల కష్టాలు ప్రభుత్వానికి తెలియజేయాలని, అందుకే బంద్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. డిగ్రీ పీజీ కాలేజీల అసోసియేషన్ ప్రెసిడెంట్ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. గతేడాది నుంచి ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం ప్రభుత్వం చుట్టూ తిరుగుతూనే ఉన్నామని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు.

Also Read: Turakapalem: డేంజర్ బెల్స్.. తురకపాలెం ప్రాంతంలో మట్టి పరీక్షలు వెలుగులోకి సంచలనాలు.. ?

Just In

01

Army Veterans: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సర్కారు ఆసుపత్రుల్లో ఆర్మీ జవాన్లు

Bathukamma 2025: గిన్నిస్ రికార్డు లక్ష్యంగా బతుకమ్మ ఉత్సవాలు.. ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు

Harish Rao: లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టే ధైర్యం ప్రభుత్వానికి లేదా: హరీష్ రావు

Ramachandra Rao: ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం.. అలైన్ మెంట్ మార్చాలంటూ రైతులు డిమాండ్!

H-City Project: ముందుకు సాగని హెచ్ సిటీ పనులు.. ఎందుకో తెలుసా..!