Mirai Box Office Collections: తేజ సజ్జా ” హనుమాన్” చిత్రంతో పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అదే ఊపుతో ‘మిరాయ్’ అంటూ మరోసారి ఆడియెన్స్ ముందుకొచ్చాడు. రితిక నాయక్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో సీనియర్ స్టార్ హీరోయిన్ శ్రీయ, జగపతి బాబు, జయరామ్ వంటి పెద్ద నటులు నటించగా మంచు మనోజ్ విలన్ రోల్లో అద్భుతంగా నటించాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమా ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థపై టి.జి.విశ్వప్రసాద్ నిర్మించారు.
వరల్డ్ వైడ్ గా సెప్టెంబర్ 12న విడుదలైన అయిన ఈ చిత్రానికి ఫస్ట్ డే నుంచే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో, బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపుతుందనే చెప్పుకోవాలి. ఫస్ట్ డే 40 శాతం వరకు రికవరీ సాధించింది. ఒకసారి రెండు రోజుల కలెక్షన్స్ ను గమనిస్తే .. ‘మిరాయ్’ చిత్ర వరల్డ్ వైడ్ గా రూ.55.60 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.28.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ సినిమాకి రూ.28 కోట్ల షేర్ వచ్చింది. ఈ రోజుతో బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పడుతుంది. చూస్తుంటే మొదటి వీకెండ్ లోనే కొత్త రికార్డ్ క్రియోట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.
‘మిరాయ్’ సినిమా రెండు రోజుల కలెక్షన్స్
డే 1 : రూ.13 కోట్లు (తెలుగు వెర్షన్‌లో రూ.10.6 కోట్లు, హిందీలో రూ.1.5 కోట్లు, మిగతా భాషల్లో చిన్న షేర్)
డే 2 : రూ. 13.50 కోట్లు (తెలుగులో రూ. 10.75 కోట్లు, హిందీలో రూ. 2.5 కోట్లు, మిగతా భాషల్లో రూ. 2 లక్షలు. డే 1 కంటే 3-4% గ్రోత్)
మొత్తం రెండు రోజుల కలెక్షన్స్
ఇండియా నెట్: రూ.26.50 కోట్లు (అన్ని భాషల్లో: తెలుగు, హిందీ, తమిళం, కన్నడం, మలయాళం)
వరల్డ్‌వైడ్ గ్రాస్: రూ.55.60 కోట్లు మార్క్‌ను దాటింది (USలో అయితే $1 మిలియన్‌కు పైగా కలెక్ట్ చేసింది)