Warangal Politics: వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో రోజు రోజుకు వర్గ విభేదాలు ముదురుతున్నాయి. ధర్మకర్తల మండలి సభ్యుల నియామకం మంత్రి కొండా సురేఖ(Min Konda Sureka) ఎమ్మెల్యే నాయిని మధ్య చిచ్చు రేపుతుంది. నాయిని ఏదో అదృష్టం కొద్ది గెలిచిన ఎమ్మెల్యే అంటూ నాయిని రాజేందర్ రెడ్డి(Rajender Reddy)పై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన గురించి కామెంట్ చేయడం అనవసరం అన్నారు. దేవదాయశాఖ మంత్రిగా ఇద్దరికీ పదవులు ఇచ్చే స్వేచ్ఛ కూడ నాకు లేదా అని ప్రశ్నించారు. అధిష్టానం నుంచి వచ్చిన పేర్లనే భద్రకాళి ధర్మకర్తల మండలిలో ఫైనల్ చేశాను. వాళ్లు పేర్లు ఇవ్వరు.. ధర్మకర్తల మండలిని ఫైనల్ చేయనివ్వరని మంత్రి అసహనం వ్యక్తం చేశారు. నా వెంట తిరిగే వాళ్ళు ఎవరికీ ధర్మకర్తల మండలిలో నేను పదవులు ఇవ్వలేదని మంత్రి అన్నారు.
Also Read: Disha Patani: ఇంటి ముందు కాల్పులు.. షాక్‌లో దిశా పటానీ.. విషయం ఏమిటంటే?
పూటకో పార్టీ మారితే నేను ఎమ్మెల్యేగా..
పూటకో పార్టీ మారితే నేను కూడా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచేవాన్ని అని మంత్రి కొండ సురేఖకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(MLA Nayini Rajender Reddy) కౌంటర్ ఇచ్చారు. నాయిని రాజేందర్ రెడ్డి ఏదో అదృష్టం తో గెలిచారు అన్న మంత్రి కొండ సురేఖ(Konda Sureka) వ్యాఖ్యలపై స్పందించిన నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ నాకు ఒకసారే టికెట్ ఇచ్చారు కాబట్టి అదృష్టంతో గెలిచాను. మంత్రిగా ఇద్దరినీ ధర్మకర్తమండలిలో నియమించే స్వేచ్ఛ లేదా అని నన్ను బద్నాం చేస్తున్నారని ప్రశ్నించారు. భద్రకాళి ధర్మకర్త మండలి(Bhadrakali Board of Trustees)లో ఏడుగురినీ సురేఖ నియమించారన్నారు. మంత్రి పదవి ఉనప్పుడు కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా చూడాలి కానీ వాళ్లే ఇతర నియోజకవర్గంలో ఇన్వాల్వ్ అయి కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని నాయిని రాజేందర్ రెడ్డి ఆరోపించారు.
Also Read: Matrimonial Scam: ఓ అందమైన అమ్మాయి కోసం వెళ్లాడు.. తీరా చూస్తే అక్కడ..?
