KTR (imagecredit:twitter)
Politics

KTR: అంగట్లో కొలువులను అమ్ముకున్న ప్రభుత్వం: కేటీఆర్

KTR: నిరుద్యోగుల ఆశలపై కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు చల్లిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత, కాసుల కక్కుర్తి కలిసి అనేక అవకతవకలకు కారణమయ్యాయని మండిపడ్డారు. మీడియా ప్రకటన విడుదల చేశారు. గ్రూప్ వన్ పోస్టుల కోసం భారీగా కాంగ్రెస్(Congress) నేతలు డబ్బులను డిమాండ్ చేసినట్లు పలువురు విద్యార్థులు మీడియాలో చేస్తున్న ఆరోపణల పైన స్పందించారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కష్టపడి, తమ విలువైన సమయాన్ని, తల్లిదండ్రుల కష్టార్జితాన్ని వెచ్చించి పోటీ పరీక్షలు రాసే తెలంగాణ యువత నమ్మకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వమ్ము చేసిందని విమర్శించారు. గ్రూప్ వన్ పోస్టుల కోసం వారిగా డబ్బులు చేతులు మారాయని పలువురు విద్యార్థులు చేస్తున్న ఆరోపణల పైన ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.

ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు

హైకోర్టు ఆదేశించినట్టుగా గ్రూప్ 1 పరీక్షను మళ్లీ తాజాగా, ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా నిర్వహించాలని డిమాండ్ చేశారు. పరీక్షల్లో జరిగిన అవకతవకలపై ఒక జ్యూడీషియల్ కమిషన్ వేసి, ఉద్యోగాలను అమ్ముకున్న దొంగలెవరో తేల్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇది నిరుద్యోగులకు న్యాయం చేకూర్చడమే కాకుండా, భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు పునరావృతం కాకుండా నిరోధిస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో ఫెయిల్ కావడంతో యువత నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయిందని, ఈ వైఫల్యాన్ని వారు ఎప్పటికీ క్షమించరని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ‘ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు’ ఇస్తామని కాంగ్రెస్ చేసిన మోసపూరిత వాగ్ధానంపై ప్రత్యేక అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేసి చర్చించాలని డిమాండ్ చేశారు.

Also Read: Abhishek Sharma: రికార్డు సృష్టించిన అభిషేక్ శర్మ.. వరల్డ్ క్రికెట్‌లో తొలిసారి

కేటీఆర్‌కు అరుదైన గ్లోబల్ గౌరవం

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కు అంతర్జాతీయ గౌరవం దక్కింది. సుస్థిర పాలన, పర్యావరణ పరిరక్షణలో ఆయన చేసిన కృషికి గాను ప్రతిష్టాత్మకమైన ‘గ్రీన్ లీడర్‌షిప్ అవార్డు 2025’(Green Leadership Award 2025’)కు ఆయన ఎంపికయ్యారు. ఈ నెల చివరిలో అమెరికాలోని న్యూయార్క్‌లో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డు ప్రదానోత్సవం ఈ నెల 24న న్యూయార్క్‌లో జరగనున్న 9వ ఎన్వైసీ గ్రీన్ స్కూల్ కాన్ఫరెన్స్‌లో జరగనుంది. ఈ విషయాన్ని గ్రీన్ మెంటార్స్ సంస్థ అధికారికంగా కేటీఆర్‌కు తెలిపింది. గ్రీన్ మెంటార్స్ తరపున, గ్రీన్ లీడర్‌షిప్ అవార్డు 2025 గ్రహీతగా ఎంపికను ధృవీకరిస్తున్నట్లు వారు లేఖలో పేర్కొన్నారు.

టల పెంపకానికి పెద్ద ఎత్తున కృషి

మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ పర్యావరణ కార్యక్రమాలను పర్యవేక్షించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 977 పార్కులను అభివృద్ధి చేసి 10 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించారు. 108 లంగ్ స్పేస్‌లు, థీమ్ పార్కులు, రెయిన్ గార్డెన్స్, ల్యాండ్‌స్కేప్ గార్డెన్స్, వర్టికల్ గార్డెన్‌లను ఏర్పాటు చేశారు. సంస్థాగత తోటలు, కాలనీ, వీధి తోటలు, మీడియన్, అవెన్యూ తోటల పెంపకానికి పెద్ద ఎత్తున కృషి చేసి, తెలంగాణ పచ్చదనాన్ని పెంచారు. ఈ కృషి ఫలితంగా హైదరాబాద్‌కు ప్రతిష్టాత్మకమైన వరల్డ్ గ్రీన్ సిటీస్ అవార్డు లభించింది. ఆర్బర్ డే ఫౌండేషన్ , ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) చే ‘ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్’గా గుర్తింపు పొందిన ఏకైక భారతీయ నగరంగా నిలిచింది. కేసీఆర్చేపట్టిన హరితహారంతో రాష్ట్రంలోని పల్లె, పట్టణ ప్రాంతాలలో మొత్తం పచ్చదనం 24% నుంచి 33%కి పెరిగింది.

Also Read: Gadwal Court: గద్వాల కోర్టు వినూత్న తీర్పు.. జిల్లాలో ఇదే తొలిసారి

Just In

01

Naveen Chandra: ‘అరవింద సమేత’ బాల్‌రెడ్డి తర్వాత మళ్లీ ఇదే..

Bhanu Bhogavarapu: ‘మాస్ జాతర’.. రవితేజ 75వ చిత్రమని తెలియదు

Tollywood: టాలీవుడ్‌లో పవన్ నామ స్మరణ.. వారికి వరమా? శాపమా?

Telugu Indian Idol S4 Finale: మన సినిమాకు ఎప్పుడు పాడుతున్నావబ్బాయ్.. న్యూ సింగర్‌కు రవితేజ బంపరాఫర్!

Jubilee Hills Bypoll: కాంగ్రెస్‌కే మద్ధతు.. జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్‌కు మైనార్టీల హామీ