Ameer Ali Khan: ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలాహీ వాసలం జీవించిన విధానాల మేరకు ప్రతి ఒక్క ముస్లీం పవిత్రంగా ఉండాలని, ప్రతి ఒక్కరితో కలిసి మెలిసి జీవించాలని, మతసామరస్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని మాజీ ఎమ్మెల్సీ మహ్మద్ అమీర్ అలీఖాన్ సూచించారు. జనగామ పట్టణంలోని గిర్నిగడ్డ చౌరస్తాలో మిలాద్ ఇన్ నబీ పర్వదినం సందర్భంగా జల్సా, నాథియా ముషాయిరా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యాయవాది ఎండి జమాల్ షరీఫ్ అధ్యక్షత వహించారు.
Also Read: Bhatti Vikramarka: వేలంలో పాల్గొనక పోవడంతో రూ.60 వేల కోట్ల నష్టం: భట్టి విక్రమార్క
ముఖ్య అతిదులుగా మాజీ ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్, జనగామ డీసీపీ రాజా మహేంద్ర నాయక్‌లు పాల్గొన్నారు. అమీర్ అలీఖాన్ మాట్లాడుతూ మహ్మద్ ప్రవక్త జీవన విధానాన్ని ప్రతి ఒక్క ముస్లీం తెలుసుకోవాలని, వాటిని పాటించాలని, ప్రతిరోజు ఐదు పూటల నమాజు చేయాలని ఉద్బోధించారు. హిందూ, ముస్లీంలు కలిసి జీవించాలని, సోదరభావంతో ఉండాలని హితబోధ చేశారు. ముస్లీంలకు ఖురాన్ పఠనం ఎంతో ముఖ్యమని అన్నారు. ప్రతి ఒక్కరు నియమ నిష్టలతో ఉండాలని సూచించారు.
డీసీపీ రాజామహేంద్ర నాయక్ మాట్లాడుతూ హిందు ముస్లీంలు అన్నదమ్ముల్ల కలిసి ఉన్నప్పుడే సమాజం శాంతిసౌఖ్యాలతో ఉంటుందని అన్నారు. ఎవ్వరు ఎలాంటి హింసాత్మక ధోరణి అవలంబించకుండా సోదరబావంతో ఉండటం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, బుచ్చి రెడ్డి, ముజీబ్ ఉర్ రెహ్మాన్, మౌలానా జాక్రియా సబ్, రఫ్ మతీన్, అంకుషావలి, అబ్దుల్ మన్నాన, మేడ శ్రీను, కరుణాకర్‌రెడ్డి, బాసిత్ పాల్గొన్నారు.
Also Read: Modi Manipur Visits: మణిపూర్ ప్రజలకు ప్రధాని మోదీ కీలక సందేశం
జీవిత పాఠాలు నేర్పాలి.. చదువంటే మార్కులు కాదు
చదువంటే మార్కులు కాదని, విద్యార్థిని జీవిత పాఠాలు నేర్చి, ఉత్తమ పౌరులుగా దిద్దడం అని మండల విద్యాధికారి శంకరయ్య వక్త అజాద్ అహ్మద్ అన్నారు. మండల ప్రైవేట్ గుర్తింపు పొందిన పాఠశాలల యజమాన్య కమిటీ అధ్వర్యంలో శనివారం మేడ్చల్ పట్టణంలోని సెయింట్ క్లారెట్ స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. సమాజం భవిష్యత్ తరగతి గదిలోనే రూపు దిద్దుకుంటుందన్నారు. గురువులు పాఠ్యాంశాలు నేర్పితే సరిపోదని, జీవిత పాఠాలు నేర్పాలన్నారు. సమాజంలో ఎలా మెలగాలి, తల్లిదండ్రులు, పెద్దలు గౌరవించే విధంగా విద్యార్థులను తయారు చేయాలని, నైతికంగా జీవించే ఉత్తమ పౌరులుగా తీర్చాలన్నారు.
ఉపాధ్యాయ వృత్తి గొప్పదని, ఈ వృత్తిలో రావడం అదృష్టమన్నారు. చెప్పాలంటే ఇది ఉద్యోగం కాడని, గురుతర బాధ్యత అన్నారు. ఒక లాయర్, ఒక డాక్టర్. ఒక ఇంజినీరు బాగాలేకపోతే జరిగే నష్టంగా పరిమితంగా ఉంటుందని, అదే ఉపాధ్యాయుడు సరిగా లేకపోతే సమాజానికే ముప్పు అన్నారు. ఇటీవలి కాలంలో మార్కులే ప్రధానంగా బోధన సాగుతుందన్నారు. విద్యార్థుల్లో నైతికత, కరుణ, దయ లోపించడం వల్లే పాఠశాల స్థాయి విద్యార్థులు ఉపాధ్యాయులు, తోటి వారిని హత్య చేయడానికి కూడా వెనుకావడం లేదన్నారు. ఉపాధ్యాయులు ఏ విషయాన్ని బోధించినా విద్యార్థిలో ప్రవర్తనలో మార్పులు తీసుకురావాలన్నారు. వైవిధ్యం కల్గిన పౌరులను సమాజానికి అందజేసి, ప్రగతి దోహద పడే శక్తి ఒక్క గురువులకే ఉందన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఆవార్డు పొందిన ఉపాధ్యాయులపై మరింత బాధ్యతగా పని చేయాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా నాయకులు మంజులా ప్రకాశ్, గిరిబాబు, మండల అధ్యక్ష, కార్యదర్శులు స్వామిబాస్, రాధాకృష్ణ, నాయకులు మూర్తి, లవ్ కుమార్, ప్రైవేట్ పాఠశాలల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Also Read: Shocking Murder: కుషాయిగూడలో దారుణం.. ఓ రియల్టర్ దారుణ హత్య!
ఉపాధ్యాయుల సేవలు మరువలేనివి
సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అపారమైందని పిడిజిలు లయన్ డాక్టర్ రాజేందర్ రెడ్డి, లయన్ లక్ష్మీనరసింహారావులు అన్నారు. తొర్రూరు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లయన్ డాక్టర్ సూర్నం రామనర్సయ్య ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి స్థానిక లయన్స్ క్లబ్ భవనంలో 16 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు ఫీల్డ్, గిఫ్ట్, పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…గురువులు మన జీవితంలో వెలుగులు నింపే దీపస్తంభంలాంటి వారు.
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి గురువులకే ఉంది. గురు దేవో భవ అని మన సంస్కృతి చెబుతోందన్నారు. ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిఎంటి కోఆర్డినేటర్ తుమ్మాటి వెంకట్ రెడ్డి, ఎవల్యూషన్ చైర్మన్ రేగూరి వెంకన్న, జిఎల్టి కోఆర్డినేటర్ శారద, కూల్ గ్యాట్ డాక్టర్ పి.కిరణ్ కుమార్, ఆర్‌సి దామెర సరేష్, జెర్సీ చిదిరాల నవీన్, రీజినల్ సెక్రటరీ వెంకటేశ్వర్లు, క్లబ్ సెక్రటరీ ముడుపు రవీందర్ రెడ్డి, ట్రెజరర్ వజినపల్లి శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ బోనగిరి శంకర్, తమ్మి రమేష్, రమణారెడ్డి, పెరుమాండ్ల రమేష్, డాక్టర్ యాదగిరి రెడ్డి, తమ్మెర వీరభద్రరావు, మాదారపు వేణుగోపాల్, డాక్టర్ సునీల్, మచ్చ సురేష్, మచ్చ సోమయ్య, నగేష్, చక్రపాణి, సుధాకర్, వేముల రమేష్, కిన్నెర పాండు, మున్నూరు కోటయ్య, ఎడ్ల వెంకట్ రెడ్డి, గంగిశెట్టి రమేష్ పాల్గొన్నారు
Also Read: Mouli viral video: మౌళి అప్పుడు సరదాగా చేసింది ఇప్పుడు నిజమైంది.. అది ఏంటంటే?