Ramchander Rao: రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో తెలంగాణలోని కేబుల్ ఆపరేటర్స్ చాలా నష్టాలు, కష్టాల్లో పడ్డారని బీజేపీ( BJP) రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchandra Rao) వ్యాఖ్యానించారు. తార్నాకలోని ఆయన స్వగృహంలో తెలంగాణ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, చిన్నస్థాయి కేబుల్ ఆపరేటర్లు.. రాంచందర్ రావును కలిశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుతో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేపడుతున్నామని, మద్దతు కావాలని కోరారు.
Also Read: Dog in Class Room: టీచర్ ప్లేస్‌లో శునకం.. అవాక్కైన విద్యార్థినులు.. ఇదేందయ్యా ఇది!
కాగా స్పందించిన రాంచందర్ (Ramchandra Rao) ఈ రంగంపై లక్షన్నరకు పైగా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, ధర్నాకు మద్దతు ఉంటుందని భరోసా కల్పించారు. రామంతాపూర్ కృష్ణాష్టమి రోజు జరిగిన దుర్ఘటన తర్వాత కేబుల్ ఆపరేటర్లను ఇబ్బందిపెట్టేలా, ఉపాధి కోల్పోయే పరిస్థితి సృష్టించారన్నారు. పలు ప్రాంతాల్లో కేబుల్ వైర్లు కట్ చేయడం వంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. దీంతో లక్షలాది మంది కేబుల్ ఆపరేటర్లు ఉపాధి కోల్పోతున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా సేవలు వినియోగదారులకు కల్పించాల్సింది పోయి ఇలా కేబుళ్లు కట్ చేయడమేంటని రాంచందర్ రావు ప్రశ్నించారు. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం సరికాదని విమర్శలు చేశారు. కర్ణాటక ప్రభుత్వం ఆప్టికల్ ఫైబర్ కనెక్షన్లను కేబుల్ ఆపరేటర్స్‌కు అందిస్తోందని, అలాగే తెలంగాణలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆప్టికల్ ఫైబర్ సౌకర్యాలను కేబుల్ ఆపరేటర్లకు అందించాలని డిమాండ్ చేశారు.