Damodara Rajanarasimha (imagecredit:twitter)
నార్త్ తెలంగాణ

Damodara Rajanarasimha: గుడ్ న్యూస్.. త్వరలో ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్‌ కార్డులు

Damodara Rajanarasimha: తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అద్బుతాలు జరుగుతాయని అనుకున్నానని, కానీ ఎలాంటిది జరగలేదని, ఇది రాజకీయ విమర్శ కాదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సీ.దామోదర రాజనర్సింహా(Minister Damodara Rajanarasimha) అన్నారు. శుక్రవారం అందోలు మండలం అల్మాయిపేట లక్షిమదేవి గార్డెన్‌లో జరిగిన నియోజకవర్గ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పీఆర్‌టీయు అధ్యక్షుడు ఎ. మాణయ్య అధ్యక్షత వహించారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ది చెందాల్సిన అవసరం ఉందన్నారు.

అందోలులో ఫార్మసీ కళాశాల..

ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి హెల్త్‌ కార్డు(Health Carad) ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. అందోలు నియోజకవర్గంలో ఫార్మసీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గురువు ఉన్న ప్రదేశంలో అక్కడి సమాజ ప్రవర్తన తెలుస్తుందన్నారు. విద్య, వైద్యం రెండు శాఖలు గుండెకాయలాంట ని అన్నారు. నాకు ఇష్టమైన శాఖ విద్యాశాఖయన్నారు. అందోలులో ఫార్మసీ కళాశాల ఏర్పాటుకు ప్రతిపాదన ఉందన్నారు. అందోలు నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా గెలుపొందడం వల్లనే తనను ఉమ్మడి రాష్ట్రంలో తనకు రాజనర్సింహ అంటే అందోలు అన్న గుర్తింపు లభించిందన్నారు.

Also Read: Trance of OMI: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ నుంచి ‘ఓమి ట్రాన్స్’ విడుదల.. ఎలా ఉందంటే?

ప్రజా స్వామ్యం పటిష్టంగా..

అందుకే ఈ ప్రాంతానికి రుణపడి ఉంటానని అన్నారు. ఓటు విలువ తెలిసిననాడే ప్రజా స్వామ్యం పటిష్టంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ సంజీవరెడ్డి(MLA Dr. Sanjeeva Reddy), జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ అంజయ్య, మార్క్‌ఫెడ్‌ డైరెక్టర్‌ ఎస్‌.జగన్మొహన్‌రెడ్డి, ఆర్డీఓ పాండు, ఏఎంసీ చైర్మన్‌ ఎం.జగన్మొహన్‌రెడ్డి, పీఆర్‌టీయు జిల్లా అధ్యక్షుడు ఎ.మాణయ్య, కార్యదర్శి ప్రభులు, ఎంఈఓ కృష్ణలు పాల్గొన్నారు.

Also Read: Japan Centenarians: పాపం జపాన్.. ప్రపంచ రికార్డు బద్దలుకొట్టినా.. సంతోషం లేకపాయే!

Just In

01

Modi on Nepal: నేపాల్ మన క్లోజ్ ఫ్రెండ్.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు

Jangaon Protest: వంతెన నిర్మాణం చేసేదాక మా ఊరు రావోద్దు.. గ్రామ‌స్తుల ఆందోళ‌న‌

Bigg Boss Telugu 9: కాసేపట్లో బాక్సులు బద్దలవుతాయ్.. నాగ్ హింట్ అదేనా?

Krishna Water Dispute: చుక్క నీరు కూడా వదలం.. తెలంగాణ వాటా సాధిస్తాం.. మంత్రి ఉత్తమ్ కుమార్

xAI Lays Offs: 500 మంది ఉద్యోగులను తొలగించిన ఎలాన్ మస్క్ కంపెనీ ‘ఎక్స్ఏఐ’.. ఎందుకంటే?