Trance of OMI: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) బర్త్‌డే స్పెషల్‌గా ‘ఓజీ’ (OG Movie) చిత్రం నుండి విడుదలైన ‘ఓమి’ (OMI) గ్లింప్స్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. గురువారం (సెప్టెంబర్ 11)న ‘ఓజీ’ చిత్ర బృందం, ‘ఓమి ట్రాన్స్’ (Trance of OMI) యొక్క పూర్తి వెర్షన్‌ను విడుదల చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాకుండా.. మరోసారి ‘ఓజీ’ని ట్రెండింగ్‌లో టాప్ వన్‌కి తెచ్చేసింది. ‘ఓమి ట్రాన్స్’ని గమనిస్తే.. ‘ఓజీ’, ‘ఓమి’ల ముఖాముఖి పోరుని సూచిస్తోంది. ఇందులో ఓజాస్ గంభీరగా పవన్ కళ్యాణ్, ఓమిగా ఇమ్రాన్ హష్మి మధ్య భీకర పోరాటం అద్భుతంగా ఉంటుందనేది ఈ ‘ఓమి ట్రాన్స్’ తెలియజేస్తుంది.
Also Read- Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1’.. ఆ రాష్ట్రంలో విడుదల కావడం లేదా? అసలేం జరిగిందంటే?
అగ్నికి ఆజ్యం పోస్తున్నట్టుగా
ముఖ్యంగా థమన్ మరోసారి డ్యూటీ ఎక్కేశాడని అంతా అంటుండటం విశేషం. ఉరుములు, మెరుపులను తలపించే బీట్స్‌తో సంగీత సంచలనం థమన్ ఎస్ స్వరపరిచిన ఈ ‘ఓమి ట్రాన్స్’.. చూడగానే నిజంగానే శ్రోతలను ట్రాన్స్‌లోకి తీసుకెళుతోంది. ఇటీవల విడుదలైన గ్లింప్స్ సంచలన స్పందనను రాబట్టుకోగా, తాజాగా విడుదలైన ఈ సాంగ్.. అగ్నికి ఆజ్యం పోస్తున్నట్టుగా ఉందని చెప్పొచ్చు. సినిమాపై ఉన్న అంచనాలను, అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసేలా ఈ సాంగ్ ఉంది. ‘ఓజీ’ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతి పోస్టర్, ప్రతి గ్లింప్స్ ఎటువంటి సంచనాలను క్రియేట్ చేశాయో, చేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆకాశమే అవధి అన్నట్లుగా సినిమాపై అంచనాలను పెంచేశాయి.
Also Read- Ritika Nayak: హిమాలయాల్లో ఉండే ఒక మాంక్ క్యారెక్టర్.. ‘మిరాయ్’లో తన పాత్ర ఏంటో చెప్పేసిన హీరోయిన్
కౌంట్‌డౌన్ మొదలైంది
ఈ సినిమాపై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సామాన్య ప్రేక్షకులతో పాటు, సినీ పరిశ్రమలోని సెలబ్రిటీలు కూడా ఇక ఈ చిత్రానికి ఎటువంటి ప్రచారం అవసరం లేదని అంటున్నారంటే.. ఈ సినిమాపై ఏ స్థాయి అంచనాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని ఒక సినిమాటిక్ తుఫానుగా రెడీ చేస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీరగా గర్జించనున్న ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుళ్ మోహన్, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి వంటి వారంతా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా 25 సెప్టెంబర్, 2025న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. ఇప్పుడు ‘ఓమి ట్రాన్స్’తో బాక్సాఫీస్ గర్జనకు కౌంట్‌డౌన్ మొదలైందని మేకర్స్ చెప్పకనే చెప్పేశారు. చూద్దాం.. ఈ సినిమా సృష్టించే సునామీ ఎలా ఉండబోతుందో..
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు