Kantara Chapter 1: ‘కాంతార’ (Kantara) సినిమాతో ప్రపంచవ్యాప్త గుర్తింపుతో పాటు బెస్ట్ యాక్టర్‌గా నేషనల్ అవార్డును సైతం అందుకున్న రిషభ్ శెట్టి (Rishab Shetty).. ఇప్పుడా చిత్ర ప్రీక్వెల్‌తో మరోసారి సంచలనాలు సృష్టించేందుకు రెడీ అవుతున్నారు. ‘కాంతార’కు ప్రీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాకు ‘కాంతార చాప్టర్ 1’ (Kantara Chapter 1) అనే టైటిల్‌ని ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. రీసెంట్‌గానే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. అక్టోబర్ 2న విజయ దశమి స్పెషల్‌గా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ డేట్ ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలవుతున్నా, పక్కనే ఉన్న రాష్ట్రంలో మాత్రం ఈ సినిమా విడుదల కష్టం అనేలా తాజాగా టాక్ వినిబడుతోంది.
Also Read- Tunnel movie: డేట్ మారిన లావణ్య త్రిపాఠి ‘టన్నెల్’.. వచ్చేది ఎప్పుడంటే?
అసలు విషయం ఏమిటంటే..
ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది.. ఏదో రకంగా కాంట్రవర్సీలు వినిపిస్తూనే ఉన్నాయి. పాన్ ఇండియా సినిమాగా రూపుదిద్దుకున్న ఈ సినిమా.. ఇప్పుడు కేరళలో విడుదల కష్టమనేలా కాంట్రవర్సీ ఒకటి నడుస్తోంది. అక్కడ ఈ సినిమాను విడుదల చేయనివ్వమని ఎగ్జిబిటర్స్ యూనియన్ ప్రకటించింది. దీంతో కేరళ ఆడియన్స్ సైతం షాక్ అవుతున్నారు. రీసెంట్‌గా టాలీవుడ్‌లో డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ఎలా అయితే కాంట్రవర్సీ సృష్టించారో.. సేమ్ టు సేమ్ ఇప్పుడు కేరళలో కూడా వాటాలపైనే కాంట్రవర్సీ నడుస్తోంది. ఈ సినిమాను కేరళలో నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) విడుదల చేయబోతున్నారు. ఆయనతో లాభాల వాటాపై డీల్ కుదరకపోవడంతో ఎగ్జిబిటర్స్ యూనియన్ (Exhibitors Union) ఈ సినిమాను నిలిపేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.
Also Read- Ritika Nayak: హిమాలయాల్లో ఉండే ఒక మాంక్ క్యారెక్టర్.. ‘మిరాయ్’లో తన పాత్ర ఏంటో చెప్పేసిన హీరోయిన్
వాటాల లెక్కలు తేలితేనే..
‘కాంతార చాప్టర్ 1’ సినిమా విడుదలైన రెండు వారాల పాటు వచ్చే లాభాల్లో 55 శాతం ఎగ్జిబిటర్స్‌కు ఇవ్వాలని అక్కడి యూనియన్ డిమాండ్ చేస్తుంది. అందుకు పృథ్వీ రాజ్ ప్రొడక్షన్స్ నిర్మాత పృథ్వీరాజ్ సుకుమారన్ ఒప్పుకోవడం లేదు. దీంతో కేరళ రాష్ట్ర (Kerala State) వ్యాప్తంగా ‘కాంతార చాప్టర్ 1’ విడుదలపై అనుమానాలు నెలకొన్నాయి. ఇంకా విడుదలకు టైమ్ ఉంది కాబట్టి.. ఈలోపు చర్చల ద్వారా ఈ కాంట్రవర్సీ క్లియర్ అయితే ఓకే గానీ, లేదంటే ఈ సినిమాను విడుదల చేయనివ్వమని ఎగ్జిబిటర్స్ యూనియన్ ఖరాఖండీగా చెప్పేస్తుంది. ఈ క్రమంలో ఫైనల్‌గా ఏం జరుగుతుందనేది ఆశ్చర్యకరంగా మారింది. ‘కాంతార’ చిత్రాన్ని కేవలం రూ. 15 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తే.. రూ. 400 కోట్లకు పైగా ఆ సినిమా కలెక్ట్ చేసింది. ఇప్పుడీ ప్రీక్వెల్ కోసం హోంబలే ఫిలింస్ రూ. 100 నుంచి 150 కోట్ల వరకు బడ్జెట్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఎన్నో అంచనాలతో రాబోతున్న ఈ సినిమా ఈ సారి ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో తెలుసుకునేందుకు, అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు