Tunnel movie: తమిళ సినిమా పరిశ్రమలో యంగ్ హీరో అథర్వా మురళి తన ప్రత్యేక శైలితో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నాడు. అతని లేటెస్ట్ మూవీ ‘టన్నెల్’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో కూడిన యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్‌గా రూపొందింది. ఈ సినిమాకు రవీంద్ర మాధవ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అథర్వ మురళి, లావణ్య త్రిపాఠి జంటగా నటించారు. సెప్టెంబర్ 12న విడుదల కావాల్సి ఉండగా.. ప్రస్తుతం ఓ వారం వాయిదా వేశారు. అలా ఈ మూవీని సెప్టెంబర్ 19న గ్రాండ్‌గా థియేటర్లోకి తీసుకు వచ్చేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.
Read also-MLA Raja Singh: కిషన్ రెడ్డి దమ్ముంటే రాజీనామా చెయ్?.. రాజాసింగ్ సంచలన కామెంట్స్!
‘టన్నెల్’ ఓ యాక్షన్-థ్రిల్లర్ మూవీ అని టీజర్, ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. అడ్రినల్ రష్ ఇచ్చేలా, ఉత్కంఠ రేకెత్తించేలా సస్పెన్స్, థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉన్నాయని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లు అందరినీ సర్ ప్రైజ్ చేసేలా ఉన్నాయి. క్రైమ్‌లు చేస్తున్న సైకోని పోలీస్ ఆఫీసర్ ఎలా పట్టుకున్నాడు? అనే పాయింట్‌తో ‘టన్నెల్’ రాబోతోంది. ‘టన్నెల్’ టీజర్, ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాల్ని పెంచేశాయి. లచ్చురామ్ ప్రొడక్షన్స్ మీద ‘టన్నెల్’ మూవీని తెలుగులో రాజు నాయక్ గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు.
మెగా జంట వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పండంటి బిడ్డకు జన్మను ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యాన్స్ అంతా కూడా సంతోషంలో మునిగి తేలుతున్నారు. అభిమానులు, శ్రేయోభిలాషుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతుండగా.. ఈక్రమంలో లావణ్య త్రిపాఠి నటించిన ‘టన్నెల్’ టీం స్పెషల్ విషెస్‌ను అందించింది. తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలకు ‘టన్నెల్’ మేకర్స్ కంగ్రాట్స్ తెలిపారు.
Read also-Bunny Vas: ‘లిటిల్ హార్ట్స్’కు వచ్చే ప్రతి రూపాయి నాకు కోటి రూపాయలతో సమానం!
‘టన్నెల్’ సినిమా ఒక పోలీస్ స్టోరీ ఆధారంగా రూపొందింది. కథలో అథర్వా మురళి ప్రధాన పాత్రలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడు. క్రూరమైన హత్యల సీరీస్ జరిగే ఫోర్మాట్‌లో సినిమా సాగుతుంది. ఈ హత్యల వెనుక ఉన్న మిస్టరీ సైకోను పట్టుకోవడానికి హీరో చేసే పోరాటమే ముఖ్య కథాంశం. ట్రైలర్‌లోనే ‘యూనిఫామ్ వేసుకున్న తర్వాత అందరూ ఫ్యామిలీనే’ అనే డైలాగ్ ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. ఇది పోలీస్ టీమ్‌లోని బాండింగ్ వారి మిషన్‌ను సూచిస్తుంది. గ్రిప్పింగ్ సస్పెన్స్, అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాను మరింత ఆసక్తికరంగా మార్చాయి. ఈ చిత్రం మొదట తమిళంగా ‘థనల్’ పేరుతో రూపొందింది. తెలుగు ప్రేక్షకుల కోసం డబ్బింగ్ వెర్షన్‌గా ‘టన్నెల్’గా మార్చారు. అథర్వా మురళి గతంలో ‘గద్దలకొండ గణేష్’ వంటి తెలుగు సినిమాల్లో నటించి పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఈ సినిమాతో తెలుగు మార్కెట్‌లో మరోసారి హిట్ కొట్టాలని ఆశిస్తున్నారు.