Little Hearts Thanks Meet
ఎంటర్‌టైన్మెంట్

Bunny Vas: ‘లిటిల్ హార్ట్స్’కు వచ్చే ప్రతి రూపాయి నాకు కోటి రూపాయలతో సమానం!

Bunny Vas: మౌళి తనూజ్ (Mouli Tanuj), శివానీ నాగరం (Shivani Nagaram) జంటగా నటించిన చిత్రం ‘లిటిల్ హార్ట్స్’ (Little Hearts). సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సైలెంట్‌గా ప్రేక్షకుల మనసును దోచేస్తూ.. బిగ్గెస్ట్ విజయం దిశగా దూసుకెళుతోంది. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్‌పై సాయి మార్తాండ్ దర్శకత్వంలో ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను నిర్మాత బన్నీ వాస్ తన బీవీ వర్క్స్, వంశీ నందిపాటి తన వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై వరల్డ్ వైడ్‌గా డిస్ట్రిబ్యూట్ చేశారు. సినిమా విడుదలైన మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని, కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో తమ సంతోషాన్ని తెలిపేందుకు మేకర్స్ గురువారం హైదరాబాద్‌లో థ్యాంక్స్ మీట్ నిర్వహించారు.

Also Read- Bigg Boss Telugu 9: రొమాంటిక్ మాటలతో రెచ్చిపోయిన రీతూ చౌదరి.. ప్రోమోలో హైలెట్ అదే?

హీరోలను తయారుచేద్దామనేవారు

ఈ కార్యక్రమంలో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి (Vamsi Nandipati) మాట్లాడుతూ.. సినిమా విడుదలైనప్పటి నుంచి థియేటర్లలో ప్రేక్షకుల స్పందనను తెలుసుకుంటూనే ఉన్నాం. ప్రేక్షకులు ఈ సినిమా గురించి మాతో షేర్ చేసుకుంటున్న హ్యాపీనెస్ మాకెంతో ఆనందాన్నిస్తోంది. వాస్తవానికి ఈ కథను నేను పదిహేను నిమిషాలు కూడా వినలేను. మూమెంట్స్ మీద నడిచే చిత్రమిది. ఇలాంటి కథను నమ్మి సినిమా చేసిన ఈటీవీ విన్ సాయి కృష్ణ, నితిన్‌కు అభినందనలు. మేము హీరోలతో వెళ్లాలని అనుకుంటాం, కానీ సాయి కృష్ణ హీరోలను తయారుచేద్దామని అనేవాడు. అలా మౌళిని హీరోగా ఈ వేదిక మీద నిలబెట్టాడు. డైరెక్టర్‌గా సాయి మార్తాండ్ తన ప్రతిభ ఏంటో చూపించాడు. క్లోజ్ షాట్స్‌తో తను చేసిన సీన్స్ చాలా కొత్తగా ఉన్నాయి. హీరోగా మౌళి గొప్ప స్థాయికి వెళ్తాడు. తన నటన, అభినయంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. శివానీకి కూడా ఇంకా మంచి అవకాశాలు రావాలని, వస్తాయని ఆశిస్తున్నాను. ఆదిత్య హాసన్ తన తొలి చిత్రంతోనే నిర్మాతగా పెద్ద సక్సెస్ కొట్టాడు. బన్నీ వాస్ అన్నతో కలిసి ఈ సినిమా డిస్ట్రిబ్యూట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉందని చెప్పుకొచ్చారు.

Also Read- Samantha: ఇప్పుడన్ని వదిలేసా.. సంతోషంగా ఉన్నా.. సమంత సంచలన కామెంట్స్

నాకెంతో స్పెషల్ చిత్రమిది

మరో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ బన్నీ వాస్ (Bunny Vas) మాట్లాడుతూ.. మేమంతా కంటెంట్ బాగున్న సినిమాను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని నమ్మే వాళ్లం. ప్రేక్షకులు ఇచ్చిన ఆ నమ్మకంతోనే ఈ ‘లిటిల్ హార్ట్స్’ సినిమా చేశాం. ఈ రోజు మా అంచనా మరోసారి నిజమైంది. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చాలా బాగా ఆదరిస్తున్నారు. అరవింద్ సార్ కూడా మూవీ చూశారు. ఈ చిత్రంతో వచ్చే ప్రతి ఒక్క రూపాయి నాకు కోటి రూపాయలతో సమానం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే.. నా బీవీ వర్క్స్ బ్యానర్‌పై రిలీజ్ చేసిన మొట్టమొదటి చిత్రమిది. నాకెంతో స్పెషల్. యంగ్ టీమ్‌ను ప్రిపేర్ చేసుకోండని బన్నీ ఎప్పుడూ చెబుతుంటారు. నాకు అలాంటి యంగ్ టీమ్ ఈ సినిమా రూపంలో దొరికింది. ఈ సినిమా చూస్తున్నప్పుడే గట్టి సక్సెస్ కొడుతున్నామనే ఫీల్ నాకు కలిగింది. ఈ సినిమా నాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో మరిన్ని మంచి చిత్రాలు చేస్తాను. మా వంశీ నందిపాటి ప్రమోషన్, రిలీజ్.. ఇలా ప్రతిదీ దగ్గరుండి చూసుకున్నాడు. మౌళిని స్క్రీన్ మీద చూస్తూ ప్రేక్షకులు ఈలలతో గోలగోల చేస్తున్నారు. సోషల్ మీడియాతో మౌళి అంతగా రీచ్ అయ్యాడు. తొలి చిత్రంతోనే ఇంత మంచి వసూళ్లు ఆయన సినిమాకు రావడం చాలా గొప్ప విషయం. బ్యాగ్రౌండ్ ఉన్నా, లేకున్నా.. ఎవరైనా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవచ్చు అనేందుకు మౌళినే చక్కని ఉదాహరణ. నాతో నెక్ట్స్ సినిమా కాకపోయినా.. డైరెక్టర్ సాయి ఎప్పుడైనా ఒక మూవీ చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈటీవీ విన్ వారు ఇచ్చిన సపోర్ట్ మరిచిపోలేనిది. అలాగే నాకు లైఫ్ ఇచ్చిన అల్లు అరవింద్‌, బన్నీలకు ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటానని ఈ సందర్భంగా మరోసారి చెబుతున్నానని అన్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

YS Sharmila: నా బిడ్డ రాజకీయాల్లోకి వస్తే.. వైసీపీకి ఎందుకంత ఉలికిపాటు.. వైఎస్ షర్మిల

Warangal District: రజాకార్లపై విరోచితంగా పోరాడిన యోధుల గాధ.. స్వేచ్ఛ అందిస్తున్న ప్రత్యేక కథనం

Viral Video: బాత్రూం ఖాళీగా లేదా? ఈ పని చేయడానికి మెట్రోనే దొరికిందా!

only murders in the building season 5: కితకితలు పెట్టిస్తున్న థ్రల్లర్ సిరీస్.. ఎక్కడంటే?

Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1’.. ఆ రాష్ట్రంలో విడుదల కావడం లేదా? అసలేం జరిగిందంటే?