Bigg Boss Telugu 9: బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండుగా లాంచ్ అయింది. ఇక నామినేషన్స్ అంటే హాట్ అండ్ హీట్ లా ఉంటుందని మనందరికీ తెలిసిందే. ఇక మొదటి వారం నామిషన్స్ రసవత్తరంగా సాగాయి. ప్రోమో లో బిగ్ బాస్ చెప్పినట్లు ముందుంది మొసళ్ళ పండుగ అంటూ.. ఆ పండుగ ఆల్రెడీ మొదలైంది.
Also Read: Telusu Kada Teaser: సిద్దు జొన్నలగడ్డ కొత్త సినిమా టీజర్ వచ్చేసింది.. చూడాలంటే ‘తెలుసు కదా’?
రచ్చ స్టార్ట్.. ఆట షురూ అన్నట్టు సాగుతుంది . ఇక ఈ రోజు దీనికి సంబందించిన ప్రోమో కూడా రిలీజ్ అయింది. చూడటానికి చాలా చాలా రసవత్తరంగా ఉంది. ఆడియెన్స్ కి కూడా ఇలాంటి మాస్ మసాలా కావాలని కోరుకుంటున్నారు. అయితే, ఈ ప్రోమోలో(Bigg Boss Season 9) కంటెస్టెంట్స్ అందరూ ఎవరికీ వారు నిజ స్వరూపాలు బయట పెడుతున్నారు. మొన్న కామనర్స్ సంజనను టార్గెట్ చేసి.. ఇష్టమొచ్చినట్లు ఒక ఆట ఆడారు. ఇక ఇప్పుడు వాళ్లు.. వీళ్ళు అని తేడా లేకుండా.. ఒకరి మీదకు ఇంకొకరు వెళ్ళడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం లాంటివి జరుగుతున్నాయి. ఇక తాజాగా వదిలిన ప్రోమోలో రీతూ చౌదరి రెచ్చిపోయి మాట్లాడుతుంది.
చూడు మీ మొహం కనిపిస్తుంది అద్దంలో అంటూ అబ్బాయిలకు రీతూ బిస్కెట్స్ వేస్తుంది. ఇంకో వైపు మాస్క్ మేన్ ఫ్లోరా గారు ఐ బ్రో పెన్సిల్ ఇచ్చాడు అని చెప్పగా.. నేను అయితే చూడలేదు అని రీతూ చెప్పగా.. చూడటం కాదు, దొంగతనం చేశారా అని అడుగుతున్నా అని రివర్స్ కౌంటర్ వేశాడు. మా ఇంట, వంట లేదు అని రీతూ చెప్పింది. మనం మనసులను దొంగతనం చేస్తాం కానీ, మనుషులు వస్తువులని కాదని చెప్పింది. హా హ ఆపు.. మేము 15 ఏళ్ళ అప్పుడే వాడేశాం అని రొమాంటిక్ మాటలు ఎక్కడికో వెళ్లిపోయాయి.
Also Read: Army Recruitment Rally: యువతకు గుడ్ న్యూస్.. హనుమకొండలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ.. వివరాలు ఇవే!
ఇంకో వైపు ఇమ్మానూయేల్ హాయ్ .. షాక్ అయ్యారా అంటూ ఉప్పల్ బాలు డైలాగ్ తో అమ్మాయి గెటప్ లో రెడీ అయ్యి అందర్ని షాక్ కు గురి చేశాడు. నా పేరు సు.. నేను ఉదయాన్నే లెమన్ వాటర్ తాగుతాను అంటూ చెప్పి అందర్నీ నవ్విస్తాడు. ప్రోమో కూడా రిలీజ్ అయిన కొద్దీ సేపటికే బాగా వైరల్ అయింది.