BRAOU Admissions: అంబేద్కర్ వర్సిటీలో డిగ్రీ(బీ.ఏ/బీ.కాం/బీ.ఎస్సీ) కోర్సులు, పీజీ(ఎం.ఏ/ఎంకాం/ఎంఎస్సీ, ఎంబీఏ) కోర్సులు, బీఎల్ఐఎస్ సీ, ఎంఎల్ఐఎస్ సీ, డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో 2025-26 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు గడువు పొడిగించారు. ఈనెల 26 వరకు పొడిగించినట్లు విశ్వవిద్యాలయ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి సమాచారం, ఆన్ లైన్ లో నమోదు తదితర అంశాలపై సందేహాలుంటే సమీపంలోని అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని సూచించారు. లేదా విశ్వవిద్యాలయ హెల్ప్ డెస్క్ నంబర్లు 040-23680 333/444/555, టోల్‌ఫ్రీ నంబర్ 18005990101 లో సంప్రదించొచ్చని సూచించారు. పూర్తి వివరాల కోసం www.braouonline.in లేదా www.braou.ac.in లో సంప్రదించాలన్నారు.
నేడు అంబేద్కర్ వర్సిటీ పీహెచ్ డీ ఎంట్రెన్స్ టెస్ట్
అంబేద్కర్ వర్సిటీ పీహెచ్ డీ ఎంట్రెన్స్ టెస్ట్ శనివారం జరగనుంది. ఎల్బీ నగర్ సర్కిల్ లోని అయాన్ డిజిటల్ జోన్(ఐడీజెడ్)-(9577) రంగారెడ్డి, హైదరాబాద్ లో ఎగ్జామ్ నిర్వహిస్తున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. ఎంట్రెన్స్ టెస్ట్ కు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి ఒక గంట ముందుగా చేరుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం విశ్వవిద్యాలయ పోర్టల్ www.braouonline.in లేదా వెబ్ సైట్ www.braou.ac.in లేదా 040-23680411/498/ 240 లో సంప్రదించాలని సూచించారు.
Read Read: Lawyers Fight: హైకోర్టులో షాకింగ్ ఘటన.. జడ్జి ముందే గొడవ పడ్డ లాయర్లు.. వీడియో వైరల్