Sushila Karki: పొరుగు దేశం నేపాల్‌లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితికి తాత్కాలిక బ్రేక్ పడినట్టుగా కనిపిస్తోంది. మధ్యంతర ప్రభుత్వాన్ని నడిపించేది ఎవరనే ఉత్కంఠకు చెక్ పెడుతూ, తాత్కాలిక ప్రధానమంత్రిగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కార్కీను (Sushila Karki) నియమించేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు చర్చల్లో పాల్గన్న విశ్వసవర్గాలు వెల్లడించాయి. సుశీల కార్కీ శుక్రవారం రాత్రి 9 గంటలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు తెలుస్తోంది.
జెన్-జెడ్ నిరసనకారులు, నేపాల్ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్, ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సిగ్దేల్ మధ్య కుదిరిన ఏకాభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నారని సంబంధిత వర్గాలు వివరించాయి. తాత్కాలిక ప్రభుత్వం కోసం సుశీలా కార్కీ తక్కువ మంది సభ్యులతో కేబినెట్‌ను ఏర్పాటు చేయనున్నారు. తొలి మంత్రివర్గ సమావేశం కూడా శుక్రవారం రాత్రే జరుగుతుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత కేబినెట్, ఫెడరల్ పార్లమెంట్‌తో పాటు 7 ప్రావిన్షియల్ అసెంబ్లీలను కూడా రద్దు చేయాలంటూ తాత్కాలిక ప్రభుత్వం సిఫార్సు చేసే అవకాశమున్నట్లు సమాచారం.
నేపాల్‌లో సంక్షోభం
ఏకంగా 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై నిషేధం విధించడంతో పాటు అవినీతిమయమైన ప్రభుత్వంపై కోపంతో రగిలిపోయిన నేపాల్ యువత తిరగబడ్డారు. జెనరేషన్-జె (Gen-Z) యువత మూడు రోజులపాటు దేశాన్ని అట్టుడికించారు. భారీగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. దీంతో, ప్రధానమంత్రి, మంత్రులు అందరూ రాజీనామా చేశారు. అనివార్యమైన పరిస్థితులు ఏర్పడడంతో తదుపరి ఎన్నికల వరకు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. అప్పటివరకు మధ్యంతర ప్రభుత్వాన్ని నడిపించేందుకు సుశీలా కార్కీకి బాధ్యతలు అప్పగించారు. తాత్కాలిక ప్రధాని బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే విషయమై కూడా 2 రోజులుగా సస్పెన్స్ నడిచింది. ఈ విషయమై నిరసనకారుల మధ్య విభేదాలు వచ్చాయని , తాత్కాలిక ప్రధానమంత్రిగా కుల్మన్ ఘిసింగ్‌ను ఒక వర్గం ప్రతిపాదించినట్లు కథనాలు జోరుగా వెల్లడయ్యాయి. ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయిన కుల్మన్ సింగ్… నేపాల్‌లో విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించిన వ్యక్తిగా దేశవ్యాప్తంగా విశేష గుర్తింపుపొందారు.
Read Also- Women vs Jackel: ఈ బామ్మ భల్లాలదేవ కంటే పవర్ ఫుల్.. చీర కొంగుతో నక్కను రఫ్పాడించింది!
ఇక, ఖాట్మండ్ మేయర్ బలేందర్ షాకి కూడా దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉంది. తాత్కాలిక ప్రధానమంత్రి పదవికి ఆయననే ఎంపిక చేస్తారని తొలి నుంచీ ప్రచారం జరిగింది. ఒక ర్యాపర్‌గా, రాజకీయ నాయకుడిగా నిరసనకారుల్లో చాలా మందికి ఆదర్శంగా నిలిచినప్పటికీ, తాత్కాలిక ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు ఆయన ఆసక్తి చూపలేదు. దీంతో, ఫైనల్‌గా సుశీలా కార్కీ అభ్యర్థిత్వాన్ని నిరసనకారులు, ఆర్మీ చీఫ్, అధ్యక్షుడు కలిసి ఏకాభిప్రాయంతో ఖరారు చేశారు.
Read Also- Konda Surekha: అటవీ అమరవీరులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. మంత్రి కొండా సురేఖ స్పష్టం