Farmers Protest ( IMAGE credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Farmers Protest: వరంగల్ జిల్లాలో.. యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్నలు.. రహదారి పై రాస్తారోకో

Farmers Protest:  వరంగల్ జిల్లా రాయపర్తిలో  పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. యూరియా కొరతపై మండిపడిన రైతు సంఘం ఆధ్వర్యంలో వందలాది మంది రైతులు ధర్నా(Farmers Protest) కు దిగారు. గ్రామాలనుంచి వందలాది మంది రైతులు తరలి రావడంతో రాయపర్తి చౌరస్తా కిక్కిరిసిపోయింది.ఈ ధర్నాకు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. పార్టీ శ్రేణులు, స్థానిక నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్వయంగా ఆందోళనలో పాల్గొనడంతో వాతావరణం మరింత రగిలిపోయింది.

 Also Read: Khammam District: చేసేది ప్రభుత్వ ఉద్యోగం.. కానీ సెటిల్మెంట్ లక్ష్యం.. ఇంతకీ ఎవరు..?

రైతుల ఆవేదనను విని ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతులను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలి అంటూ దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.దీంతో ఆందోళన వేడెక్కుతుండగా పోలీసులు జోక్యం చేసుకున్నారు. రైతులు రహదారిపై బైఠాయించడంతో రాకపోకలు అంతరాయమయ్యాయి. దీంతో పోలీసులు ఆందోళనను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు.

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అక్రమంగా అరెస్ట్

ఈ క్రమంలో రైతులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దంతో ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. తదుపరి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం కలకలం రేపింది. ఆయనను బలవంతంగా రాయపర్తి పోలీస్ స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేయాగ,ఈ పరిణామంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులను అడ్డుకున్నారు.రైతుల కోసం పోరాడితే అరెస్టులా..? అంటూ పోలీసులు చేసిన తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.రైతుల అరుపులు, కార్యకర్తల నినాదాలతో రాయపర్తి మొత్తం మార్మోగిపోయింది.సంఘటన స్థలంలో కొంతసేపు అల్లకల్లోలం కొనసాగడంతో పరిస్థితి అదుపులోకి తేవడానికి అదనపు పోలీసులు మోహరించారు.

Also Read: Karishma Sharma: రైలు ప్రమాదంలో ప్రముఖ నటికి గాయాలు.. ఇప్పుడు ఎలా ఉందంటే?

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కాంగ్రెస్ నాయకుడు ప్రణవ్

రాత్రి కురిసిన భారీ వర్షానికి హుజూరాబాద్ పట్టణంలోని పలు కాలనీల్లో వరద చుట్టుముట్టిందని,దానికి తగ్గట్టుగా శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని,త్వరలోనే హుజూరాబాద్ నాలాలపై మాస్టర్ ప్లాన్ తయారుచేసి పరిష్కారానికి కృషి చేస్తామని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ అన్నారు.శుక్రవారం ఉదయం నుండే గాంధీ నగర్,బుడగ జంగాల కాలనీ,మామిండ్ల వాడ,గ్యాస్ గోదాం ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్,అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఆయన పర్యటించారు.

ప్రాంతాల్లో పర్యటిస్తున్న క్రమంలో పలువురు వార్డుల్లో నెలకొన్న సమస్యలను దృష్టికి తీసుకురాగా,వాటిని అధికారులతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తానని,వరద సమస్యపై శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలను సిద్ధం చేసేలా కలెక్టర్ తో మాట్లాడామని అన్నారు.గురువారం రాత్రి నుండే అధికారులకు సూచనలు చేశామని,ముందస్తు చర్యలో భాగంగా ఓ ఫంక్షన్ హాల్ లో లోతట్టు ప్రాంతాలవారిని తరలించే విధంగా సమాయత్తం చేసేలా అధికారులను,కాంగ్రెస్ పార్టీ నాయకులను కోరామని అన్నారు.ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ కమిషనర్ సమ్మయ్య,అధికారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

 Also Read: Firecrackers Policy: టపాసులపై సుప్రీంకోర్టు అనూహ్య వ్యాఖ్యలు.. దేశవ్యాప్తంగా నిషేధం!

Just In

01

Tummala Nageswara Rao: రైతులకు అవసరమైన ఎరువులు సరఫరా చేయాలి.. అధికారులతో మంత్రి సమీక్ష

Electrocution Tragedy: రైలు పైకెక్కి నిలబడ్డాడు.. హైటెన్షన్‌ వైర్లు తాకి మాడి మసై పోయాడు

RV Karnan: శిథిలావస్థలోనున్న భవనాలను గుర్తించాలి.. కర్ణన్ కీలక సూచనలు

Kishkindhapuri: ‘ఓజీ’ వచ్చే వరకు.. ‘కిష్కింధపురి’ రెస్పాన్స్‌పై టీమ్ రియాక్షన్ ఇదే!

HCA Scam: జగన్మోహన్​ రావు టైంలో హెచ్​సీఏ ఎన్నో అక్రమాలు.. తెలిస్తే షాక్?