Rains-in-Hyderabad
లేటెస్ట్ న్యూస్, హైదరాబాద్

Rain Alert: వర్షాలపై అలర్ట్.. హెల్ప్‌లైన్ నంబర్ విడుదల చేసిన హైదరాబాద్ కలెక్టరేట్

Rain Alert: వర్షాల పట్ల అప్రమత్తమైన అధికారులు

కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్ 9063423979ను సంప్రదించవచ్చు

నగరవాసులకు సూచించిన అధికారులు

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం నుంచి ఎడతెరిపిలేని వర్షం (Rain Alert) కురుస్తోంది. గడిచిన 3 రోజులుగా పొడి వాతావరణం, ఎండ, ఉక్కపోతతో అల్లాడిన నగరవాసులకు గురువారం మధ్యాహ్నం కురిసిన చిరు జల్లులతో కాస్త సేద తీరారు. హైదరాబాద్ జిల్లాలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసి, ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.

లక్డీకాపూల్‌లోని హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. వర్షం, వరదల విషయంలో ఏమైనా సమస్యలు, ఇబ్బందులు ఎదురైతే నగరవాసులు మొబైల్ హెల్ప్ లైన్ నెంబర్ 9063423979 కాల్ చేయవచ్చునని అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం తర్వాత వనస్థలిపురం, ఎల్బీనగర్ ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. సుమారు 10 సెంటీమీటర్ల వరకు వర్షం కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. సాయంత్రం 5 గంటల నుంచి సిటీలోని ప్రధాన ప్రాంతాల్లో చిరు జల్లులు మొదలయ్యాయి.  తర్వాత రాత్రి వరకు వర్షం కురుస్తూనే ఉండటంతో పలు జంక్షన్లలో నీరు నిలిచి, రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి.

Read Also- Warangal District: రజాకార్లపై విరోచితంగా పోరాడిన యోధుల గాధ.. స్వేచ్ఛ అందిస్తున్న ప్రత్యేక కథనం

ముంపునకు శాశ్వత పరిష్కారం: మేయర్

హైదరాబాద్ నగరంలో వర్షం కురుస్తుండటంతో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి క్షేత్ర స్థాయిలో పరిస్థితులను పరిశీలించేందుకు పలు ప్రాంతాల్లో పర్యటించారు. షేక్‌పేట డివిజన్‌లోని విరాట్ నగర్ కాలనీ, బసవతారక నగర్ బస్తీలలో పర్యటించిన ఆమె, అక్కడ ముంపునకు గురయ్యే ప్రాంతాల పరిస్థితులను గురువారం సాయంత్రం అడిగి తెలుసుకున్నారు. విరాట్ నగర్ కాలనీలో స్టార్మ్ వాటర్ డ్రైన్ పనులను పరిశీలించారు. వర్షాలు కురిస్తే ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వర్షపు వరదతో విరాట్ నగర్ కాలనీ, బసవతారక నగర్‌లు ముంపుకు గురవుతున్నట్లు స్థానికులు మేయర్‌కు  వివరించారు. దీనికి శాశ్వత పరిష్కారంగా జీహెచ్ఎంసీ స్టార్మ్ వాటర్ డ్రైన్, బాక్స్ డ్రైన్‌ను నిర్మిస్తుందని హామీ ఇచ్చారు. స్టార్మ్ వాటర్ డ్రైన్, బాక్స్ డ్రైన్ నిర్మాణం పూర్తయితే విరాట్ నగర్, బసవతారక నగర్‌లే కాకుండ సమీప లోతట్టు ప్రాంతాలకు వరద ముంపు నుంచి శాశ్వత విముక్తి కలగనుందని మేయర్ వెల్లడించారు. స్టార్మ్ వాటర్ డ్రైన్, బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను మేయర్ ఆదేశించారు. క్షేత్ర పరిశీలనలో మేయర్ వెంట ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, కార్పొరేటర్ ఫరాజ్, డిప్యూటీ కమిషనర్ వి.సమ్మయ్య, ఈఈ విజయ్, తదితరులున్నారు.

Read Also- Hyderabad SHE Teams: గణేష్ ఉత్సవాలు.. మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన.. 1612 మంది పోకిరీల అరెస్ట్

Just In

01

Teja Sajja: ‘మిరాయ్‌’లో రెండు సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి.. చూసే వారికి గూస్‌బంప్స్ పక్కా!

Chiranjeevi: ఈ కట్టె కాలేంత వరకూ మీ అభిమానినే.. ఈ మాట అంది ఎవరో తెలుసా?

DOST Admissions: ‘దోస్త్’ స్పాట్ అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తున్నవారికి కీలక అప్‌డేట్

Gadwal Court: గద్వాల కోర్టు వినూత్న తీర్పు.. జిల్లాలో ఇదే తొలిసారి

Coolie Monica Song: జుమ్ జుమ్ జుమ్‌తాక్.. ‘కూలీ’ మోనికా వీడియో సాంగ్ వచ్చేసిందోచ్..