Warangal District (IMAGE credit: twitter)
నార్త్ తెలంగాణ

Warangal District: రజాకార్లపై విరోచితంగా పోరాడిన యోధుల గాధ.. స్వేచ్ఛ అందిస్తున్న ప్రత్యేక కథనం

Warangal District: తెలంగాణ సాయుధ పోరాటంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని డోర్నకల్ మండలం పెరుమాండ్ల సంకీస గ్రామానికి చెందిన కొంతమంది ఉద్దండులు నైజం, రజాకార్ల పాలనకు వ్యతిరేకంగా నిర్విరామ పోరాట కృషిని ప్రదర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 11 నుంచి 17 వరకు తెలంగాణ రైతాంగ పోరాట వారోత్సవాలను సిపిఐ పార్టీ ఘనంగా నిర్వహిస్తోంది. హైదరాబాదులోని ట్యాంక్ బండ్ పై మక్దూం మోహిని మొయినోయుద్ధిన్ విగ్రహం వద్ద నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఎర్ర చొక్కాలు, ఎర్ర చీరలతో పురుషులు, మహిళల ప్రదర్శనతో నిర్వహించబోయే తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమ నేపథ్యంలో

స్వేచ్ఛ అందిస్తున్న ప్రత్యేక కథనం…

తెలంగాణ సాయుధ పోరులో పెరుమాళ్ళ సంకీస కీలక పాత్ర పోషించింది. డోర్నకల్ మండలంలోని పెరుమాండ్ల సంఖ్య తో పాటు బూరుగుపాడు, ఉయ్యాలవాడ, వెన్నారం తదితర గ్రామాలకు చెందిన అనేకమంది రజాకార్ల దురాగతాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు కొనసాగించారు. తెలంగాణ ప్రాంతం నుంచి రజాకారులను తరిమికొట్టాలంటూ దళాలతో గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలను చైతన్యపరిచారు. ఒక్కో దళంలో 12 మంది చొప్పున 8 దళాలను ఏర్పాటు చేసి ఉద్యమాన్ని ఉదృతం చేశారు. 1948 సెప్టెంబర్ ఒకటవ తేదీన రాక్షస రజాకారుల దమన కాండలో 21 మంది యోధులు సజీవ దహనమయ్యారు.

ఇది జరిగిన కొద్ది రోజుల్లోనే 1948 సెప్టెంబర్ 17న రజాకార్ల పాలన అంతమైంది. తెలంగాణ గడ్డమీద స్వేచ్ఛ వాయువులు వీచాయి. రజాకార్ల పీడ విరగడ అయిన ఈ రోజునే తెలంగాణ ప్రజలంతా విమోచన దినంగా ఆచరిస్తూ, ఆనందోత్సాహాలతో సంబరాలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటన జరిగి 68 సంవత్సరాలు గడిచిన వీరుల త్యాగాలను తమ హృదయంలో పదినపరుచుకుని ప్రతి సెప్టెంబర్ 17న అమరవీరుల త్యాగాలను వేసుకుంటూ ఆ పోరాటాలకు సజీవ సాక్షులుగా నిలిచిన స్వాతంత్ర సమరయోధులను గ్రామస్తులు సత్కరించుకుంటున్నారు.

 Also Read: CRPF: రాహుల్ గాంధీపై సీఆర్‌పీఎఫ్ విమర్శలు.. మల్లికార్జున ఖర్గేకి లేఖ

దళాలను నిర్మించుకొని అంచలంచెలుగా ఉద్యమం

1947లో నైజాం నవాబుకు వ్యతిరేకంగా, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి పెరుమాండ్ల సంకీస ఉద్యమకారులు మూడు దళాలను నిర్మించుకొని అంచలంచెలుగా 8 దళాలను ఏర్పాటు చేసుకొని ఉద్యమాన్ని ఉదృతం చేశారు. ఈ గ్రామానికి చెందిన తుమ్మ శేషయ్య నాయకత్వంలో ప్రజా చైతన్యాన్ని రగిలిస్తూ ఆయుధాలను సేకరించుకొని పటిష్టమైన ఉద్యమానికి నడుం బిగించారు. ఇందులో భాగంగానే భూస్వాముల ధాన్యాన్ని స్వాధీనం చేసుకుని ప్రజలకు పంపిణీ చేసే కార్యాచరణను రూపొందించి ఆచరణ మార్గంలో పెట్టారు. ఇదే సమయంలో ప్రాంతీయ ఆంధ్ర మహాసభ సంకీస గ్రామ పెద్ద చెరువు సమీపంలో జరిగింది. ఈ మహాసభలో మంచికంటి రామకిషన్, మల్లు వెంకట నరసింహారెడ్డి, నంద్యాల శ్రీనివాస్ రెడ్డి లాంటి ఉద్దండులు పాల్గొని ఉద్యమ తీరు తెన్నుల గురించి విశ్లేషించుకునే సమయాన, రజాకార్లు మహాసభ పై దాడికి పాల్పడ్డారు.

అందుకు ప్రతి దాడి చేసిన ఉద్యమకారులు ఇద్దరు రసాకారులను మట్టుపెట్టారు. మూడుసార్లు గ్రామం పై దాడి చేసి దొరికిన వారిని దొరికినట్టుగా చావబాదారు. అడ్డు వచ్చిన ఆడవాళ్లను హింసించి మానభంగం చేశారు. ఉద్యమాన్ని అణిచివేయాలంటే తుమ్మ శేషయ్యను అంతమొందించాలని శేషయ్య ఆచూకీ తెలిపాలని 1948 సెప్టెంబర్ ఒకటవ తేదీన 200 మంది పోలీసులతో కలిసి పెరుమాండ్ల సంకీర్త గ్రామం పై ముపెట్ట దాడి చేశారు. దొరికిన మగవారందర్నీ చేతులు కట్టేసి బూటు కాళ్లతో తన్నారు. అయినా శేషయ్య జాడకాన్ని, దళం జాడ కానీ చెప్పించలేకపోయారు.

ఆ కోపంతో బందెల దొడ్డి ప్రాంతంలో ఉన్న గడ్డివాము వద్ద కాల్పులు

ఆ కోపంతో బందేలదొడ్డి ప్రాంతంలో ఉన్న గడ్డివాము దగ్గర కాల్పులు జరిపి, కొన ఊపిరితో ఉన్న వారితో సహా మొత్తం 21 మందిని సజీవ దహనం చేశారు. ఇందులో తేరాల రామయ్య, తేరాల మల్లయ్య, బుట్టి పిచ్చయ్య, శెట్టి పెద్ద నరసయ్య, శెట్టి రామయ్య, శెట్టి వెంకట నరసయ్య, దండు ముత్తయ్య, కూరపాడు సత్తయ్య, కాసం లక్ష్మీ నరసయ్య, మోటమర్రి పటయ్య, గండు ముత్తయ్య లు అమరులయ్యారు. పోరాట యోధుల స్మృతి చిహ్నంగా పెరుమాండ్ల సంఖ్య గ్రామపంచాయతీ ఆవరణలో 1994లో స్మారక స్తూపాన్ని నిర్మించారు. ఆ తర్వాత ఉద్యమ నాయకుడు తుమ్మ శేషయ్య కొంతకాలం తర్వాత నర్సంపేట ప్రాంతానికి వలస వెళ్లి 1967.. 68 ప్రాంతంలో అస్వస్థతకు లోనై మృతి చెందారు.

 Also Read: Illegal Mining: అడ్డు అదుపు లేకుండా జోరుగా అక్రమ మైనింగ్ దందా.. పట్టపగలే బాంబు బ్లాస్టింగ్.. ఎక్కడంటే?

Just In

01

DOST Admissions: ‘దోస్త్’ స్పాట్ అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తున్నవారికి కీలక అప్‌డేట్

Gadwal Court: గద్వాల కోర్టు వినూత్న తీర్పు.. జిల్లాలో ఇదే తొలిసారి

Coolie Monica Song: జుమ్ జుమ్ జుమ్‌తాక్.. ‘కూలీ’ మోనికా వీడియో సాంగ్ వచ్చేసిందోచ్..

Kavitha Politics: జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ ఓటు చీల్చేందుకు కవిత మాస్టర్ ప్లాన్?

Chai Waala: ‘చాయ్ వాలా’ ‘సఖిరే..’ని చూశారా.. మెలోడీ అదిరింది