Gold vs Diamond: 2025 సంవత్సరంలో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గతేడాది 30% పైగా పెరిగిన ఈ ధరలు.. ఇప్పుడు అమాంతం పెరిగి సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. గ్లోబల్ అస్థిరత, ఆర్థిక అనిశ్చితులతో దృఢంగా ముడిపడి ఉన్నాయి. బంగారం సాంప్రదాయకంగా ఓ ఆస్తిగా చెబుతుంటారు. అంటే ఆర్థిక సంక్షోభాలు, రాజకీయ అస్థిరతలు లేదా ఇన్ఫ్లేషన్‌లో ఇది రక్షణగా పనిచేస్తుంది. క్రింది ప్రధాన కారణాలు ఈ పెరుగుదలకు దారితీస్తున్నాయి.
1. కరెన్సీ పాలసీలు మరియు ఆసక్తి రేట్ల ఆర్థిక విధానాలు,
2. సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు,
3. జియోపాలిటికల్, రాజకీయ అస్థిరత,
4. ఇన్వెస్టర్ డిమాండ్, ETF ఇన్‌ఫ్లోలు,
5. చైనా, భారత్‌లో రిటైల్ డిమాండ్
6 . డాలర్ బలహీనత, ఇన్ఫ్లేషన్
Also Read: Shocking Incident: అందరూ చూస్తుండగానే.. కుప్పకూలిన స్వీడన్ ఆరోగ్య మంత్రి.. వీడియో వైరల్
ఇక ఈ రోజు గోల్డ్ ధరలు చూసుకుంటే.. 24 క్యారెట్ (10 గ్రాములు) రూ.1,10,509 గా ఉండగా, 22 క్యారెట్ (10 గ్రాములు) రూ.1,01,300 ఉంది. ఇక వెండి (1 కిలో) రూ.1,40,000 గా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆల్ టైం రికార్డ్. మొన్నటి వరకు లక్ష వరకు ఉన్న ధరలు. రెండు రోజుల క్రితం లక్ష దాటింది. భవిష్యత్తులో ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది నిజమైతే సామాన్యులకు ఇక బంగారం అందకుండా పోతుంది.
Also Read: NHRC Files Case: క్లినికల్ ట్రయల్స్ ముసుగులో పేదల ప్రాణాలతో చెలగాటం.. రెడ్డీస్ ల్యాబ్‌పై కేసులు!