Charlie Kirk: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు అత్యంత సన్నిహితుడు, రైటి వింగ్ యాక్టివిస్ట్ చార్లీ కిర్క్ (Charlie Kirk) దారుణ హత్యకు గురయ్యారు. ఉటా వ్యాలీ యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన వేదికపై ఉన్న అతడ్ని 150 మీటర్ల దూరం నుంచి ఓ వ్యక్తి రైఫిల్ తో కాల్చి చంపాడు. ఓ భవనంపై నుంచి చార్లీని కాల్చి చంపినట్లు తెలిపే సీసీటీవీ వీడియోలు బయటకొచ్చాయి. ఈ విషయాన్ని
అసలేం జరిగిందంటే?
అమెరికా ఓరెమ్ నగరంలోని ఉటా వ్యాలీ యూనివర్శిటీలో జరిగిన ఓ కార్యక్రమానికి రైట్ వింగ్ యాక్టివిస్ట్, వ్యాఖ్యత చార్లీ కిర్క్ (31) హాజరయ్యారు. ‘ది అమెరికా కమ్ బ్యాక్’ (The American Comeback), ప్రూవ్ మీ రాంగ్ (Prove Me Wrong) అనే నినాదాలతో చార్లీ మాట్లాడుతుండగా ఒక్కసారిగా అతడిపై అగంతకుడు కాల్పులు జరిపాడు. దీంతో తూటా చార్లీ మెడ గుండా దూసుకెళ్లి.. ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. తీవ్రరక్తస్రావంతో వేదికపైనే పడిపోయారు. ఇదంతా చూసిన ప్రజలు.. కేకలు వేస్తూ పరుగులు పెట్టారు.
I doubt Charlie Kirk has survived that shot. But until he’s officially pronounced dead I hope he makes it out alive somehow pic.twitter.com/sLj4tpfdc6
— MrBraindead (@braindead_mr) September 10, 2025
గన్ కల్చర్ గురించి మాట్లాడుతూ..
ప్రత్యక్ష సాక్షులు తెలిపిన ప్రకారం.. కాల్పులకు కొద్దిసేపటి ముందు అమెరికాలో గన్ కల్చర్ పై చార్లీ కిర్క్ మాట్లాడుతున్నాడు. ‘చార్లీ ఆ సమయంలో తుపాకీ నియంత్రణ గురించి మాట్లాడుతున్నారు. ఒక్కసారిగా ఆయన తన మెడ పట్టుకొని కుప్పకూలాడు. రక్తం కారడం కూడా ప్రారంభమైంది. మరో తూటా శబ్దం వినిపించగానే మేమంతా నేలపై పడిపోయాం. ఆ తర్వాత మమ్మల్ని పరుగెత్తమని చెప్పారు. మేమంతా పరిగెత్తాము’ అని రేడన్ డిషేన్ అనే స్థానికుడు తెలిపారు.
SHOT DEAD IN FRONT OF FAMILY 💔
at Utah Valley University as Charlie Kirk is gunned down Wife & kids witnessed the attack pic.twitter.com/SKCS5UCSHf
— Hindustan (@InsideHindustan) September 11, 2025
భద్రతా లోపాలు
చార్లీ కిర్క్ హాజరైన ఈ సభను TPUSA “The American Comeback Tour” లో భాగంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం యూనివర్సిటీ క్యాంపస్‌లోని ఓపెన్ క్వాడ్ ప్రాంతంలో జరిగింది. అక్కడ సాధారణంగా విద్యార్థి సభలు నిర్వహిస్తుంటారు. అయితే సాక్షుల ప్రకారం ఈ సభలో మెటల్ డిటెక్టర్లు వంటి కఠిన భద్రతా ఏర్పాట్లు లేవు. సుమారు 3,000 మంది ఈ సమావేశానికి హాజరైనట్లు ఉటా డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ తెలిపింది. యూనివర్సిటీ పోలీస్ విభాగం ఆరుగురు అధికారులను మాత్రమే నియమించింది. వీరితో పాటు అదనంగా చార్లీ వ్యక్తిగత భద్రతా సిబ్బంది మాత్రమే ఉన్నారు.
ట్రంప్ రియాక్షన్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తన మిత్రుడైన చార్లీ కిర్క్ దారుణ హత్యపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాల్పులు జరిగిన వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించారని.. అప్పటికే చార్లీ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారని ట్రంప్ అన్నారు. ‘అమెరికా యువత హృదయాన్ని ఎవరికీ అర్థం కాలేదు. చార్లీ మాత్రమే దానిని అర్థం చేసుకున్నారు. ఆయన అందరి ప్రేమాభిమానాలు పొందారు. ముఖ్యంగా నా అభిమానాన్ని. ఇప్పుడు ఆయన మనతో లేరు’ అని ట్రంప్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
Also Read: Nara Lokesh: నారా లోకేష్ చొరవ.. నేపాల్ నుంచి స్పెషల్ ఫ్లైట్‌లో.. వచ్చేస్తున్న ఏపీ వాసులు
నిందితుడి కోసం గాలింపు..
చార్లీ కిర్క్ ను హత్య చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు అమెరికన్ పోలీసులు రంగంలోకి దిగారు. వేదిక స్పష్టంగా కనిపిస్తున్న భవనం పై కప్పు నుంచి అగంతుకుడు కాల్పులు జరిపాడని ఉటా పబ్లిక్ సేఫ్టీ డిపార్ట్ మెంట్ వెల్లడించింది. ‘దుండగుడు భవనం పైకప్పు నుంచి కాల్పులు జరిపాడు’ అని అధికారుల ప్రకటనలో చెప్పారు. నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు చెప్పారు.
